Court Cases Pending: దేశవ్యాప్తంగా పలు కోర్టుల్లో లెక్కకుమించిన కేసులు పెండింగ్‌లో ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. అయితే నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జేడీజి) అందించిన తాజా సమాచారం చూస్తే మాత్రం మీరు ఆశ్చర్యపోవడం గ్యారెంటీ. దేశంలోని కోర్టుల్లో 4.47 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తేలింది. Court Cases Pending
మొత్తం 25 హైకోర్టుల్లో అలహాబాద్ హైకోర్టు 10.74 లక్షల కేసులతో టాప్‌లో ఉండటం విశేషం. దీని తర్వాత బాంబే హైకోర్టులో 7.13 లక్షల కేసులు, రాజస్థాన్ హైకోర్టులో 6.67 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వెల్లడైంది. నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్ (ఎన్‌జీడీజీ) అందించిన తాజా డేటాలో ఈ వివరాలు తేటతెల్లం అయ్యాయి.
2018 నుంచి పెండింగ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోయిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసులు 50.95 శాతం మేరకు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. బాంబే హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు 53.85 శాతం మేరకు పెరిగాయట.
అన్ని హైకోర్టుల్లో మొత్తం 62 లక్షల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 71.6 శాతం సివిల్ కేసులు, 28.4 శాతం క్రిమినల్ కేసులు ఉన్నాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018 నుంచి ఈ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య అధికంగా పెరిగిందట. 24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్ల క్రితం నాటివని తేలింది.
పెరుగుతున్న పెండింగ్ కేసులు
24.83 శాతం కేసులు 5 నుంచి 10 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని తెలుస్తోంది. 18.25 శాతం కేసులు 10 నుంచి 20 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయట. పలు నివేదికల ప్రకారం పెండింగ్‌లో ఉన్న కేసులకు న్యాయమూర్తుల సంఖ్య సరిపోకపోవడమే ఇందుకు ప్రధాన కారణం అని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
2022 మే నాటికి దాదాపు 25,600 మంది న్యాయమూర్తులు నాలుగు కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న కేసులను విచారణ చేయడంలో, లేదా తీర్పులు వెలువరించే పనిలో ఉన్నారట.
ఇవీ చదవండి: Ponnavolu: ఎన్ని దుష్ప్రచారాలు చేసినా వెరవను.. కోర్టులో వాదనలపై ఇంత దిగజారాలా? పొన్నవోలు ఫైర్
Judiciary Andhra Pradesh: ఏపీ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ న్యూస్ లెటర్ ఆవిష్కరణ
Patanjali Foods: పతంజలి ఫుడ్స్‌కు ఎదురుదెబ్బ.. ఏకంగా 3.91 శాతం క్షీణించిన షేర్లు
AP high court news: ఏపీ హైకోర్టులో జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులుకు ఘన వీడ్కోలు
Amaravati R5 Zone issue: అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్లపై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం
