Cool Drinks Danger: వేసవి కాలం వచ్చేసింది. కూల్ డ్రింక్స్, కూల్ వాటర్, చల్లటి పానీయాలు ఎక్కువగా తాగడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. అయితే, కూల్ డ్రింక్స్ తాగడం డేంజరని తెలిసినా సరే.. తాగకుండా ఉండలేరు. కూల్ డ్రింక్స్ తాగడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. Cool Drinks Danger
శీతలపానీయమే కదా అని అదే పనిగా తాగితే మీ ఆరోగ్యానికి తిప్ప తప్పవు. వీటిని ఎక్కువగా తాగటం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు కూల్ డ్రింక్స్ సహజంగానే తాగుతుంటారు. వేసవి కాలంలో ఇది మరింత ఎక్కువ. దాహం తీరుతుందని చల్లగా ఉండే పానీయాన్ని గటగటా లాగించేస్తుంటారు.
ఇంటికి అతిథులు వచ్చినా, లేదా పర్యటనలకు, పిక్నిక్‌లకు వెళ్లినప్పుడైనా, కూల్ డ్రింక్స్ కచ్చితంగా తాగేస్తుంటారు. చూడటానికి రకరకాల రంగుల్లో కూల్ డ్రింక్స్ ఆకర్షణీయంగా ఉంటాయి. ఇటీవల రోజుల్లో వీటిని తాగే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ కూల్ డ్రింక్స్‌ను అదే పనిగా తాగటం వలన లేనిపోని రోగాన్ని కొని తెచ్చుకున్నట్టేనని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే ప్రమాదం
అతిగా కూల్ డ్రింక్స్ తాగటం వలన దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శీతల పానీయాలు లేదా సోడా డ్రింక్స్ వంటి స్వీట్ టేస్ట్ పానీయాలు హెల్త్ పాడు చేస్తాయంటున్నారు. కూల్ డ్రింక్స్ తాగి సంతృప్తి చెందినప్పటికీ ఈ పానీయాలు ప్రాణాంతక వ్యాధుల బారిన పడేలా చేస్తాయంటున్నారు.
ఇలాంటి పానీయాలను సేవిస్తే మహిళలకు మరింత ప్రమాదం అని వైద్యులు చెబుతున్నారు. శీతల పానీయాలు సేవిస్తే బరుగు పెరుగుతామని చాలామంది మహిళలు అనుకుంటారు. బరువు మాత్రమే కాదు.. సోడా పానీయాలు కాలేయం, క్యాన్సర్‌తో పాటు అనేక అనారోగ్య సమస్యలను సృష్టిస్తాయి. కొన్నిసార్లు పిజ్జా, బిర్యానీ, బర్గర్లతో శీతల పానీయాలు విచ్చలవిడిగా తాగేస్తూ ఉంటారు. ఇవి కూడా కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు.
కృత్రిమ చక్కెరతో రూపొందిస్తారు..!
కూల్ డ్రింక్ పురుషులు, స్త్రీలకు అసలు ప్రయోజకరం కానే కాదు. వీటిలో పోషకాలు ఏమాత్రం ఉండవు. ఈ పానీయాలను కృత్రిమ చక్కెరతో తయారు చేస్తారు. ఇలాంటి పానీయాలను రెగ్యులర్‌గా తాగటం వలన ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్, కాలేయం దెబ్బ తినడం, జీర్ణ సమస్యలు వచ్చిపడతాయి.
కూల్ డ్రింక్స్ తాగడం వలన పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ శాతం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదాలు ఉన్నాయి. లివర్ క్యాన్సర్‌తో పాటు ప్రెగ్నెన్సీ , గుండెపోటు ఇలాంటి జబ్బులు వస్తాయి. ఈ శీతల పానీయాలు తాగడం వలన మహిళల్లో ఫ్రై బ్రోస్ , ఫిరోసిస్ వంటి కాలేయంలో మంట ఏర్పడుతాయి. ఈ తరహా వ్యాధులు మలివయసులో తీవ్రంగా ఇబ్బంది పడేలా చేస్తాయి. కాలేయ క్యాన్సర్ తో పాటు రొమ్ము క్యాన్సర్, మరికొన్ని అనారోగ్య సమస్యలను కలిగించే ఆస్కారం ఉంది.
ఇవీ చదవండి: Daily Egg: రోజుకో గుడ్డు.. ఆరోగ్యానికి వెరీ గుడ్డు.. ఉడికించిన గుడ్డులో పోషకాలెన్నో తెలుసా?
Peas: వేయించిన శనగలు.. మితంగా తీసుకుంటే రుచి, ఆరోగ్యం.. ప్రోటీన్స్ సమ్మిళితం
Early morning Tea: ఉదయాన్నే పరగడుపున టీ తాగుతున్నారా? ఆరోగ్యానికి ఎంతటి నష్టమో తెలుసా?
Egg benefits: ఇది మీకు తెలుసా? గుడ్డుతో పాటు పెంకులు తిన్నా ఆరోగ్యమేనట..
Beetroot: బీట్‌రూట్‌తో మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు.. ఏయే విటమిన్లు ఉంటాయంటే..
