HomeLife StyleSnow color: మంచుకెందుకు తెలుపు రంగు? నీటికెందుకు లేదు వర్ణం!

Snow color: మంచుకెందుకు తెలుపు రంగు? నీటికెందుకు లేదు వర్ణం!

Snow color: మంచు తెల్లగా ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ నీటికి ఏ రంగూ ఉండదు. దూరం నుంచి చూస్తే నీటికి నీలి రంగు ఉన్నట్లు కనిపించినా తాగేటప్పుడు ఏ రంగూ కనిపించదు. అయితే, మంచుకు మాత్రం తెలుపు రంగు ఎందుకు ఉంటుందన్నది అందరికీ ఆసక్తి కలిగించే అంశం. Snow color

నీరు ఎక్కడ చేసిన ఒకే రంగులో ఉంటుందన్నది తెలిసిందే. నీటికి రంగు అనేది అస్సలు ఉండదు. కానీ నీరు గడ్డకట్టడం వల్ల మంచు ఏర్పడుతుందన్నది తెలిసిందే. నీటి ఉష్ణోగ్రత సున్నా డిగ్రీ సెల్సియస్ లేదా అంతకంటే తక్కువకు పడిపోయినప్పుడల్లా అది మంచుగా రూపాంతరం చెందుతుంది.

సముద్ర మట్టంతో పోలిస్తే మనం ఎత్తు పెరిగే కొద్దీ ఉష్ణోగ్రత క్రమంగా తగ్గుతుంది. అలాంటి ప్రదేశాలలో మనం ఎక్కువ మంచు కనిపిస్తుంది. అయితే మంచు నుండి తయారయ్యే నీటికి రంగు ఉండదు. మరి మంచుకు తెలుపు రంగు ఎందుకు ఏర్పడుతుంది? వేరే రంగులోకి అది ఎందుకు మారదు? అన్నది అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది.

నీరు రంగు ఉండదు అనేది కచ్చితంగా వాస్తవమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నీరు దాని సహజ రూపంలో ఉన్నప్పుడు అది ద్రవంగా ఉండటం చూస్తుంటాం. ఏదైనా దానిలో కలిపితే.. అది ఆ రంగులోకి రూపాంతరం చెందుతుంది. నీరు మంచు రూపాన్ని తీసుకున్నప్పుడు, అది పొరల వారీగా ఘన పొరగా తయారవుతుంది.

ఆ ఘనీభవించిన నీటిని తెల్లని రంగులో మనకు కనిపిస్తుంది. ప్రకృతిచేత సృష్టించబడిన ప్రతి వస్తువును గ్రహించే సామర్థ్యం ఉంది. ఇది పదార్థం లేదా లోహం ఊకూడా కావచ్చు. సూర్యకాంతి సాయంతో భూమిపై ఉన్న అన్ని వస్తువులకు మనం రంగులు ఇవ్వగలుగుతాం. అదే విధంగా మంచు విషయంలో కూడా ఇదే జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

కాంతి ప్రతిబింబమే కారణం..
ఎందుకు మంచు తెల్లగా ఉంటుందనే విషయానికి వస్తే.. ఇందుకు కారణం మంచు లోపల గాలి ఎక్కువగా ఉంటమేనట. ఇది చాలా కాంతి తరంగాలను ప్రతిబింబించేలా చేస్తుంది. ఆకాశం నుంచి మంచు వచ్చినప్పుడు అది రంగులేనిదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కదా… కానీ కాంతి కిరణాలు దానిపై పడగానే, మనం దానిని చూసినప్పుడు, కాంతి ప్రతిబింబం కారణంగా, దాని రంగు తెల్లగా కనిపించడం మొదలవుతుంది.

చాలా సమయం నీటిలో కరిగిన వాయువులు ఉంటాయి. ఇవి మంచులో చిన్న బుడగలు, ప్యాకెట్లను ఏర్పడేలా చేస్తాయి. ఈ కారణంగా రంగు తెల్లగా ఉండటం గమనించవచ్చు. ఎరుపు లేదా ఇతర రంగులు ఎందుకు కాకూడదని అనుమానం చాలా మందికి కలుగుతుంది. నిజానికి కాంతి రంగు తెలుపు. అందుకే అది మనకు తెల్లగా కనిపిస్తుంది. నీరు రంగులేనిది కాబట్టి.. అది మనకు తెల్లగా కనపడుతుంది. దానికి ఏదైనా రంగు ఉంటే అది మనకు వేరే రంగులో కనిపించే అవకాశం ఉండేది.

ఇవీ చదవండి: Cool Drinks Danger: చల్లటి పానీయాలు ప్రాణాంతం.. కాలేయ క్యాన్సర్‌ కారకం!
Child Aadhar: బ్లూ ఆధార్‌.. బాల ఆధార్‌.. ఎలా తీసుకోవాలి?
Vitamin D sun: మన దేహానికి రోజూ ఎన్ని నిమిషాలు ఎండ తాకాలంటే.. విటమిన్ డితో పాటు ఎన్నో ప్రయోజనాలు
Maoist Hidma: ఆ గ్రామంలో 77 ఏళ్ల తర్వాత తొలిసారి ఎగిరిన జాతీయ జెండా..
YS Jagan in Rapthadu: పదవులు, అధికారం ఇవ్వడంలో రెండు మెట్లు పైకి ఎక్కేలా చేస్తా..: సీఎం జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు