Ponnavolu: కోర్టులో జరిగిన వాదనలపై ఎల్లో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించింది. దీనిపై ప్రభుత్వ అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా భయపడేది లేదని, అన్నింటికీ తెగించే తాను వృత్తిలో కొనసాగుతున్నానని స్పష్టీకరించారు. ఏబీఎన్, టీవీ–5 తీరుపై ఏఏజీ పొన్నవోలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చానళ్లలో కోర్టు వాదనలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. (Ponnavolu)
‘ఏబీఎన్, టీవీ–5 దిగజారి ప్రవర్తిస్తున్నాయి. దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నాయి. పచ్చి అబద్ధాలను ప్రసారం చేస్తున్నారు. కోర్టు నా వాదనలకు అడ్డుపడినట్టు, తిట్టినట్టుగా ప్రచారం చేస్తున్నారు. బుట్టలో వేసుకో.. పడకపోతే బురద చల్లు.. ఇదే వారి విధానం. ప్రభుత్వం తరఫున నేను నా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. నాపై ఇష్టమొచ్చినట్లు దుష్ప్రచారం చేస్తున్నారు.’ అని పొన్నవోలు మండిపడ్డారు.
మరోవైపు స్కిల్ స్కామ్ కేసులో నిన్న విచారణ కొనసాగింది. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో ఈ దశలో చంద్రబాబు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని, ఈ కేసులో ప్రధాన నిందతులైన శ్రీనివాస్, మనోజ్ విదేశాలకు పారిపోవడం వెనుక బాబు హస్తం ఉందని ఏసీబీ కోర్టులో ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బాబు బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేయాలని, సీఐడీ కస్టడీకి ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. ఇరువైపుల వాదనలు విన్న ఏసీబీ కోర్టు విచారణను గురువారానికి వాయిదా వేసింది.
పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు ఇవీ..
* స్కిల్ స్కాం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది.
* స్కిల్ స్కాంలో రూ.371 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం
* డొల్ల కంపెనీల పేరుతో నిధులు దోచుకున్నారు
* 2017లోనే పన్నుల ఎగవేతపై జీఎస్టీ హెచ్చరించింది
* సీబీఐ విచారణ చేయాలని జీఎస్టీ కోరింది
* ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలో ఉండగానే 2018లో 17ఏ సవరణ జరిగింది
* ఈ కేసులో చంద్రబాబుకు 17ఏ వర్తించదు
* స్కిల్ స్కాంలో అన్ని ఆధారాలు కోర్టు ముందు ఉంచాం
* బాబు పాత్ర ఉందని సీఐడీ గుర్తించిన వివరాలు పరిశీలించాలి
* స్కిల్ స్కాం కేసు.. ఇదేమీ ఫిక్షన్ స్టోరీ కాదు
* ఆధారాలున్నాయి కాబట్టే బాబును కస్టడీ కోరుతున్నాం
* జీవో నం.4 కంటే ముందే సీమెన్స్ సంస్థతో ఎంవోయూ
* సీమెన్స్‌తో ఎంవోయూను జీవో నం.4లో ఎందుకు చూపలేదు?
Read Also : Why not 175: 175 స్థానాల్లో గెలుపు ఎందుకు సాధ్యం కాదు? గేర్ మార్చాల్సిందేనన్న సీఎం జగన్