HomeTrendingPhone beside Bed: బెడ్‌ పక్కన ఫోన్‌ పెట్టుకుని పడుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?

Phone beside Bed: బెడ్‌ పక్కన ఫోన్‌ పెట్టుకుని పడుకుంటే ఎన్ని అనర్థాలో తెలుసా?

Phone beside Bed: నిద్రిస్తున్నప్పుడు మన శరీరానికి సెల్‌ఫోన్‌ దగ్గరగా ఉండకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వీలైనంత వరకు బెడ్‌ పరిపర ప్రాంతాల్లో ఫోన్‌ లేకుండా చూసుకోవాలంటున్నారు. పక్కన పెట్టి పడుకుంటే అనేక సమస్యలు తప్పవని చెబుతున్నారు. Phone beside Bed

మనం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మళ్లీ రాత్రి పడుకునే వరకు చేతిలో మొబైల్ లేకుంటే ఒక్క నిమిషం ఉండలేని పరిస్థితి ఏర్పడింది. సెల్ ఫోన్ వాడకం వల్ల లాభాలు ఎన్ని ఉన్నాయో, నష్టాలు కూడా అంతకంటే ఎక్కువే ఉన్నాయి. సెల్ ఫోన్ ఎక్కువగా వాడటం వలన శారీరక , మానసిక సమస్యలు పెరగడం గ్యారెంటీ. శారీరకంగా మెడ నొప్పి, తలనొప్పి, ఊబకాయం, వినికిడి లోపం మొదలైనవి వస్తాయి.

మానసికంగా నిద్ర లేమి, ఇంటర్నెట్ వ్యసనం, ఆందోళన, దిగులు, పిల్లల్లో మాట/భాష లోపాలు, ఏకాగ్రత కుదరకపోవడం, పని వాయిదా, అలసట ఇంకా చాలా దుష్ఫలితాలు కలుగుతాయి. సెల్ ఫోన్ వాడకం సెల్ ఫోన్ లో డిజిటల్ వెల్ బీయింగ్ ద్వారా మనం ఎంత సేపు వాడుతున్నాం అన్నది చూసుకుని సెల్ ఫోన్ మొత్తం వాడకం రోజుకి ఒకటి రెండు గంటలు మించకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సెల్ ఫోన్ పక్కన పడుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.

సెల్ ఫోన్‌లు రేడియో ఫ్రీక్వెన్సీ రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. ఇది క్యాన్సర్ కారకం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఈ రేడియేషన్‌కు దీర్ఘకాలికంగా గురికావడం వల్ల కలిగే ఆరోగ్య ప్రభావాలపై ఇంకా పలు అధ్యయనాలు చేస్తున్నారు. కొందరు వ్యక్తులు నిద్రిస్తున్నప్పుడు వారి ఫోన్‌ను శరీరానికి దూరంగా ఉంచడం ద్వారా వారి ఎక్స్‌పోజర్‌ను పరిమితం చేయడానికి ఇష్టపడతారు.

నిద్రకు చేటు చేస్తుంది..

సెల్ ఫోన్‌ విడుదల చేసే నీలి కాంతి నిద్రను నియంత్రించడంలో సహాయపడే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిని గణనీయంగా తగ్గించిపడేస్తుంది. నిద్రపోయే ముందు సెల్‌ఫోన్‌ని ఉపయోగించడం లేదా మీరు నిద్రపోతున్నప్పుడు దానిని మీ పక్కన పెట్టుకోవడం అనేది మీ నిద్రకు, నిద్ర సమయానికి, సామర్థ్యానికి విపరీతంగా దెబ్బ కొడుతుంది. ఆటంకం కలిగిస్తుంది.

మీరు నిద్రపోయేటప్పుడు సెల్ ఫోన్‌ను పక్కన పెట్టుకోవడం పరధ్యానంగా ఉంటుంది. మీరు నోటిఫికేషన్‌లను తనిఖీ చేయడానికి లేదా రాత్రి సమయంలో పరికరాన్ని ఉపయోగించడానికి ఆసక్తి కనబరుస్తారు. ఇది నిద్ర క్వాలిటీని తగ్గిస్తుంది. పగటిపూట అలసటకు దారితీస్తుంది.

సెల్ ఫోన్ ను రాత్రి పూట లైట్స్ లేకుండా కానీ డిమ్ లైట్ లో కానీ చూడటం వల్ల కంటిచూపు బాగా దెబ్బతింటుంది. ఫోన్ సెట్టింగ్స్ లో లైట్ మధ్యస్థంగా వుండటం మంచిది. ఆ బ్లూ రేస్ వల్ల చూపు మాత్రమే కాదు నిద్ర కూడా పాడవుతుంది. ఆ అలవాటు వల్ల స్లీప్ సైకిల్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సరైన భంగిమలో కూర్చొని చూడకపోతే మెడ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. *#07# డయల్ చేస్తే ఫోన్ లో రేడియేషన్ ప్రభావం ఎంత ఉందో తెలుస్తుంది.

అరుదైన సందర్భాల్లో, ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు సెల్‌ఫోన్‌లు మంటలు అంటుకున్నాయి లేదా పేలడం లాంటివి జరిగుతాయి. మీరు నిద్రిస్తున్నప్పుడు వాటిని మీ పక్కనే ఉంచితే భద్రతాపరమైన ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ సమస్యలను తగ్గించడానికి, నిద్రవేళకు కనీసం ఒక గంట ముందు సెల్ ఫోన్‌ని ఉపయోగించకుండా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మీరు నిద్రిస్తున్నప్పుడు దానిని మీ శరీరానికి దూరంగా ఉంచాలని స్పష్టీకరిస్తున్నారు.

ఇవీ చదవండి: Health Care at night: రాత్రిపూట ఇవి తింటే పీడ కలలు వస్తాయి.. నిద్రాభంగం తప్పదు!
Phone Hacking: ఫోన్‌ హ్యాకింగ్‌కు గురి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి.. తప్పక తెలుసుకోండి
Life partner name: మీ ఫోన్‌లో మీ జీవిత భాగస్వామి పేరు ఎలా ఫీడ్ చేసుకున్నారు? ఇలా ప్రయత్నిస్తారా?
Phone Pay: ఫోన్‌ పే వాడుతున్నారా? ఈ గుడ్‌ న్యూస్‌ తెలుసా? యాక్టివేట్‌ చేసుకోండిలా!
PM Modi : మోదీ కర్ణాటక పర్యటనలో కలకలం.. వెహికల్‌పై ఫోన్‌ విసిరిన బీజేపీ కార్యకర్త

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు