Scholarship: ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని చాలా మందికి కోరిక ఉంటుంది. అయితే, ట్యూషన్ ఫీజులు, జీవన ఖర్చులు భారీగా పెరిగిన తరుణంలో విదేశాల్లో చదువుకోవడానికి వెనకడుగు వేస్తూ తమ కోరికల్ని నెరవేర్చుకోలేకపోతుంటారు. కానీ, కొన్ని సంస్థలు స్కాలర్‌షిప్ ప్రకటిస్తూ మెరిట్ విద్యార్థులకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తున్నాయి. అందులో ఫ్రాన్స్ ఎక్సలెన్స్ ఛార్పిక్ స్కాలర్‌షిప్ ఒకటి. Scholarship
ఫ్రాన్స్‌లోని యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందిన ఇండియన్ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీహెచ్‌డీ స్కాలర్‌లకు ఆ దేశ ప్రభుత్వం స్టైపెండ్ ప్రకటిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, ఎంపిక వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
ఛార్పక్ బ్యాచిలర్ స్కాలర్‌షిప్ వివరాలు https://www.inde.campusfrance.org అనే పోర్టల్‌లో ఉంటాయి. ఫ్రెంచ్ ఉన్నత విద్యా సంస్థల్లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించాలని అనుకునే భారతీయ విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉంటాయి. ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ కోసం 860 యూరోల (సుమారు రూ.76,000) నెలవారీ జీవన భత్యాన్ని స్కాలర్‌షిప్ కింద మంజూరు చేస్తారు. సామాజిక భద్రత కవరేజ్, వసతి ఖర్చులు అదనంగా పొందవచ్చు.
ఛార్పాక్ బ్యాచిలర్ స్కాలర్‌షిప్ కోసం ఇండియన్ స్టూడెంట్స్ దరఖాస్తు చేసుకోవచ్చు. భారతదేశపు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్ సైతం దరఖాస్తుకు అర్హత ఉంటుంది. అభ్యర్థి వయసు 23 సంవత్సరాలలోపు ఉండాలి. గతంలో ఫ్రాన్స్‌లో చదివి ఉండరాదు. భారతదేశంలో సెకండరీ పాఠశాల విద్యను పూర్తి చేసి ఉండాలి. 2024 సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే బ్యాచిలర్ ప్రోగ్రామ్ కోసం తప్పకుండా దరఖాస్తు చేసి ఉండాలి.
దరఖాస్తు విధానం ఇదీ
స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు ఫ్రెంచ్ విద్యా సంస్థల్లో అడ్మిషన్ తప్పనిసరిగా పొంది ఉండాలి. అడ్మిషన్-రిలేటెడ్ ఎంక్వైరీ భారతదేశంలోని ఫ్రాన్స్ క్యాంపస్ ఆఫీస్ లేదా సంస్థ వెబ్‌సైట్ ద్వారా ఉండే అవకాశం ఉంది.
దరఖాస్తు ప్రక్రియలో భాగంగా https://ifi.scholarship.ifindia.in/ పోర్టల్ ద్వారా పాస్‌పోర్ట్-సైజ్ ఫోటోగ్రాఫ్, పాస్‌పోర్ట్ కాపీ, కరిక్యులం విటే, ఫ్రెంచ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి అడ్మిషన్ లెటర్, 12వ తరగతి, 10వ తరగతి మార్కుల జాబితా వంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ స్కాన్ కాపీలు ఇందులో అప్‌లోడ్ చేయాలి. DELF లేదా DALF వంటి ఫ్రెంచ్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
ఎంపిక ఎలా చేస్తారంటే..
అభ్యర్థి అకడమిక్ ప్రావీణ్యం, స్థిరత్వం, క్వాలిటీ స్టేట్‌మెంట్ పర్పస్ ఆధారంగా స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేయడం జరుగుతుంది. నిర్దిష్ట CGPA/పర్సెంటైల్ కటాఫ్ అర్హత అవసరం లేదు. ఫ్రాన్స్ ఎక్సలెన్స్ ఛార్పిక్ స్కాలర్‌షిప్ కోసం ఇండియన్ స్టూడెంట్స్ ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 1 విడుదల అవుతాయి. విదేశీ విద్య కోసం భారతీయ విద్యార్థుల ముఖ్య గమ్యస్థానాలుగా అమెరికా, యూకేనే ప్రముఖంగా ఉన్నాయి.
అయితే ఈ దేశాల్లో ట్యూషన్ ఫీజులు, జీవన వ్యయాలు ఎక్కువగా ఉండటం వల్ల చాలా మంది జంకుతుంటారు. కానీ ఫ్రాన్స్‌లో నాణ్యమైన విద్యతో పాటు జీవన ఖర్చులు తక్కువగా ఉంటాయి. అందుకే ఇటీవల కాలంలో ఫ్రాన్స్‌లో ఉన్నత విద్య చదవడానికి భారతీయ విద్యార్థులు అమితంగా ఆసక్తి కనబరుస్తున్నారు. అర్హత కలిగిన భారతీయ విద్యార్థులు ఇలాంటి అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఇవీ చదవండి: Early Childhood Education: చిన్నారుల విద్యపై యూనిసెఫ్ రూపొందించిన ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సు ప్రారంభం
IB SCERT: డబ్బున్నోళ్ల పిల్లల మాదిరే గవర్నమెంట్ బడుల పిల్లలకూ విద్యాబోధన.. ఏపీ సర్కార్ కీలక అడుగులు
JVVD: జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం విడుదల
American Education: అందుబాటులో విదేశీ విద్య.. అమెరికా చదువులపై సందేహాలకు సమాధానాలు
Kommineni: విద్యయే ఎనలేని సంపద.. గొప్ప ఆశయంతో సీఎం జగన్ సంస్కరణలు: కొమ్మినేని
