Jagananna Ammavodi: చక్కటి చదువుల కల్పవల్లి.. అమ్మ ఒడి-బతుకులు మార్చే గుడి.. నాలుగేళ్లుగా అప్రతిహతంగా…!

Jagananna Ammavodi: జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లికీ ఏడాదికి రూ.15,000 ఇస్తున్న వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఈ పథకాన్ని నాలుగేళ్లుగా దిగ్విజయంగా కొనసాగిస్తోంది. తద్వారా చక్కటి చదువుల కల్పవల్లిగా ఈ పథకం మారుతోంది. పేద విద్యార్థులు, తల్లిదండ్రులకు వరంగామారుతోంది. తాజాగా వరుసగా నాలుగో ఏడాది కూడా జగనన్న అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్‌ ఇస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి.. ఈ నిధులను పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఇందుకు వేదికవుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. (Jagananna Ammavodi)

10 రోజులపాటు పండుగ వాతావరణంలో రాష్ట్రవ్యాప్తంగా 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయనున్నారు. తద్వారా 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. నేడు అందిస్తున్న రూ.6,392.94 కోట్లతో కలిపి ఇప్పటివరకు కేవలం “జగనన్న అమ్మఒడి” అనే ఈ పథకం క్రింద మాత్రమే జగన్‌ ప్రభుత్వం అందించిన లబ్ధి రూ. 26,067.28 కోట్లు.

పేదరికమే అర్హతగా కుల, మత, ప్రాంత, పార్టీ, వర్గాలకు అతీతంగా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ఏ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకైనా పారదర్శకంగా, లంచాలకు వివక్షకు తావులేకుండా నూటికి నూరు శాతం సంతృప్త స్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు సీఎం జగన్‌ తపన పడుతున్నారు.

అదే రాష్ట్ర బడ్జెట్, అదే అధికార యంత్రాంగం, పాలకుడు మారితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజెప్పేలా చిత్తశుద్ధిని నిరూపిస్తూ పాలన మెరుగ్గా సాగిస్తున్నారు సీఎం జగన్. నాలుగేళ్లలో ఒక్క విద్యా రంగంలో ఆ విద్యా సంస్కరణలపై మాత్రమే చేసిన వ్యయం రూ. 66,722.36 కోట్లు.

పాఠశాలల్లో డ్రాపౌట్స్ సంఖ్యను గణనీయంగా తగ్గించాలనే మంచి ఉద్దేశ్యంతో అమ్మ ఒడి పథకానికి కనీసం అటెండెన్స్ ఉండేలా నిబంధన పెట్టింది విద్యాశాఖ. పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపి, కనీసం 75% హాజరు ఉండేలా తల్లులు బాధ్యత తీసుకోవాలని చెబుతోంది. అప్పుడే విద్యారంగంలో మన ప్రభుత్వం అమలు చేస్తున్న మంచి కార్యక్రమాల లక్ష్యం నెరవేరుతుందని సీఎం జగన్‌ ఆకాంక్షిస్తున్నారు.

2018లో ప్రాథమిక విద్యా స్థాయిలో జీఈఆర్ జాతీయ సగటు 99.21 శాతంగా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో ఇది 84.48 శాతానికి పరిమితమైన దుస్థితి ఉండేది. అప్పుడు దేశంలోని 29 రాష్ట్రాలలో అట్టడుగు స్థానం మనదే. అయితే, నాలుగేళ్లలో జగన్ ప్రభుత్వం విద్యారంగంలో తెచ్చిన సంస్కరణ వల్ల 84.48 శాతంగా ఉన్న జీఈఆర్ 100.8 శాతానికి చేరింది. జీఈఆర్ శాతాన్ని మరింత మెరుగుపర్చేందుకు 10-12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించని వారు తిరిగి క్లాసులకు అటెండ్ అయ్యే అవకాశం కల్పిస్తూ వారికి ” సైతం అమ్మఒడి అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

మన బడి “నాడు-నేడు” ద్వారా కల్పిస్తున్న సౌకర్యాలు చిరకాలం విద్యార్థులకు అందాలన్న తపనతో… A stitch in time saves nine – అన్న సామెతను స్పూర్తిగా తీసుకొని ఏవైనా చిన్న రిపేర్లు సమయానికి వెంటనే పట్టించుకోకపోతే మరింత పెద్దవై కల్పించిన మంచి సౌకర్యాలు పనికిరాకుండా పోతాయని, ఆ పరిస్థితి రాకుండా అప్పటికప్పుడే సరిచేయాలనే సదుద్దేశ్యంతో అమ్మ ఒడి నిధుల నుండి నాడు – నేడులో అభివృద్ధి చెందిన ఆ తల్లుల పిల్లలు వెళ్లే స్కూళ్ల బాగుకోసం “స్కూలు మెయింటెనెన్స్ ఫండ్” (SMF) కు రూ.1,000 లు జమ చేస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్యానికి పెద్దపీట వేస్తూ “నాడు – నేడు” ద్వారా నిర్మించిన బాలికల ప్రత్యేక టాయిలెట్లు, ఇతర టాయిలెట్ల మెయింటెనెన్స్ కోసం.. డ్రాపౌట్సును తగ్గించడంతో పాటు విద్యార్థినీ, విద్యార్థుల ఆత్మ గౌరవం నిలబెట్టాలనే మంచి ఉద్దేశ్యంతో అమ్మఒడి పథకం నిధుల నుంచి పిల్లలు చదివే బడుల “టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్” (TMF) కు రూ. 1,000 జమ చేస్తున్నారు. ఈ టాయిలెట్లు ఎప్పుడూ ఇదేవిధంగా మెయింటెన్ అయ్యేలా ఉండాలన్న తపనతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

నిర్వహణలో ఏవైనా లోపాలుంటే, హక్కుగా అడిగే పరిస్థితులను తల్లులకు కల్పిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో జవాబుదారీతనం పెరిగేలా “పాఠశాల మెయింటెనెన్స్ ఫండ్”, “టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్”ల నిర్వహణ _ బాధ్యత కూడా హెడ్మాస్టర్లు, పేరెంట్స్ కమిటీలకే అప్పగించారు.

“జగనన్న అమ్మఒడి” లబ్ధి అందుకోవడంలో ఏమైనా ఇబ్బందులుంటే జగనన్నకు చెబుదాం 1902 టోల్ ఫ్రీ నంబర్ కేటాయించారు. దేశానికే దిక్సూచిగా విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు అమలు చేస్తోంది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. కార్పొరేట్ స్కూళ్లే ప్రభుత్వ బడులతో పోటీపడేలా.. మన విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ..
* బైజూస్ కంటెంట్ తో ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ (IFP), స్మార్ట్ టీవీలు..
* డిజిటల్ విధానంలో బోధన దిశగా నాడు నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన చేస్తున్న పాఠశాలల్లో 6వ తరగతి ఆపైన ప్రతి తరగతికి ఆన్లైన్లోనే కాకుండా ఆఫ్ లైన్లో కూడా పని చేసేలా, బైజూస్ కంటెంట్ తో కూడిన 62,000 పై చిలుకు ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ తో డిజిటల్ క్లాస్ రూమ్స్.. ఇంగ్లీషు ల్యాబ్ లు నిర్మిస్తూ, 1-5 తరగతులకు ప్రతి స్కూల్లో ఉండేలా 3 దశల్లో దాదాపు 45 వేల స్మార్ట్ టీవీలు కూడా ఏర్పాటు దిశగా అడుగులు..
* ఇంగ్లీషు మీడియం విద్య CBSE తో అనుసంధానం
* పేద విద్యార్థులు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేందుకు, వారిని గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీషు మీడియంలో విద్యా బోధన… సీబీఎస్ఈ తో సిలబస్ తో అనుసంధానం..
* ఇంగ్లీష్ ల్యాబ్స్ ఏర్పాటు.. బైలింగువల్ టెక్స్ట్ బుక్స్ (ఒక పేజీలో తెలుగు, మరో పేజీలో ఇంగ్లీష్. ఆక్స్ఫర్డ్ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీ..
ఉచిత ట్యాబ్లు, బైజూస్ కంటెంట్ తో..
* పేద విద్యార్థులను గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దే లక్ష్యంతో, డిజిటల్ విధానంలో పాఠ్యాంశాలు మరింత సులభంగా ఆఫ్ లైన్లో కూడా పని చేసేలా బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్ ల పంపిణీ.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అర్థమయ్యేలా, ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 8వ తరగతిలో అడుగు పెట్టిన ప్రతి విద్యార్థికి ఆన్లైన్లోనే కాకుండా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 4, 59, 564 మంది విద్యార్థులు, 59.176 మంది ఉపాధ్యాయులకు రూ. 685.87 కోట్ల ఖర్చుతో 5,18,740 ట్యాబ్ ల పంపిణీ.. ప్రతి సంవత్సరం డిసెంబర్ 21న..
* 4 నుంచి 10వ తరగతి వరకు ఉచితంగా బైజూస్ కంటెంట్.. వచ్చే విద్యా సంవత్సరం నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా బైజూస్ కంటెంట్.. బీఎస్ఎన్ఎల్, ఏపీ ఫైబర్ నెట్ ద్వారా 45,000 పాఠశాలల్లో ఇంటర్ నెట్ అందించేందుకు చర్యలు..

* ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులు స్పోకెన్ ఇంగ్లీష్ లో నైపుణ్యం సాధించేలా ఈ ఏడాది నుండే ప్రతి స్కూల్లో దీన్ని ప్రవేశపెడుతూ తర్పీదు ఇస్తూ టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్, ఇంటర్ లో టోఫెల్ సీనియర్ పరీక్షలు కూడా నిర్వహించి ఆ అమెరికన్ సర్టిఫికెట్ అందజేత.. ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ఇచ్చేలా అమెరికన్ సంస్థ ఎడ్యుకేషన్ టెస్టింగ్ సర్వీసెస్ (ఈటీఎస్) తో ఒప్పందం..

* గతంలో 1 నుండి 5వ తరగతి వరకు 18 సబ్జెక్టులు ఒకే టీచర్ బోధించే దుస్థితి.. 1 నుండి 5 తరగతుల వరకు చదివే అందరు పిల్లలని ఒకే దగ్గర కూర్చోబెట్టి పాఠాలు చెప్పే పరిస్థితి.. నేడు ఆ పరిస్థితిని సమూలంగా మారుస్తూ పిల్లల శారీరక, మానసిక వికాసం కోసం 3వ తరగతి నుండే ప్రతి సబ్జెక్టును ప్రత్యేక టీచర్ బోధించే విధంగా ఏర్పాటు..

విద్యారంగంలో జగన్‌ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో చేసిన వ్యయం…
* జగనన్న అమ్మ ఒడి – లబ్ధిదారుల సంఖ్య – 44,48,865, అందించిన మొత్తం రూ. కోట్లలో 26,067.28
* జగనన్న విద్యా కానుక – లబ్ధిదారుల సంఖ్య – 43,10,165 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,366.53
* జగనన్న గోరుముద్ద – లబ్ధిదారుల సంఖ్య – 43,26,782 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,590.00
* పాఠశాలల్లో నాడు నేడు మొదటి దశ – స్కూల్స్ సంఖ్య – 15,715 అందించిన మొత్తం రూ. కోట్లలో 3,669.00
* పాఠశాలల్లో నాడు నేడు రెండో దశ – స్కూల్స్ సంఖ్య – 22,344 అందించిన మొత్తం రూ. కోట్లలో 8,000.00
* వైఎస్సార్ సంపూర్ణ పోషణ – లబ్ధిదారుల సంఖ్య – 35,70,675 అందించిన మొత్తం రూ. కోట్లలో 6,141.34
* స్వేచ్ఛ శానిటరీ న్యాప్కిన్స్ – లబ్ధిదారుల సంఖ్య – 10,01,860 అందించిన మొత్తం రూ. కోట్లలో 32.00
* డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ ట్యాబ్లు – లబ్ధిదారుల సంఖ్య – 5,18,740 అందించిన మొత్తం రూ. కోట్లలో 685.87
* జగనన్న విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 26,98,728 అందించిన మొత్తం రూ. కోట్లలో 10,636.67
* జగనన్న వసతి దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 25,17,245 అందించిన మొత్తం రూ. కోట్లలో 4,275.76
* జగనన్న విదేశీ విద్యా దీవెన – లబ్ధిదారుల సంఖ్య – 1,858 అందించిన మొత్తం రూ. కోట్లలో 132.41
* వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా – లబ్ధిదారుల సంఖ్య – 16,668 అందించిన మొత్తం రూ. కోట్లలో 125.50
* మొత్తం రూ. 66,722.36 కోట్లు.

Read Also : Target YS Jagan: ప్రతిపక్షాలన్నీ ఒక్కటై… జగన్‌ను ఎంత టార్గెట్‌ చేస్తే అంత పైకెదుగుతున్నాడా? వైఎస్సార్‌సీపీ అదే కోరుకుంటోందా?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles