Peas: శనగలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నానబెట్టిన, వేయించిన శనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వేయించిన శనగలను పుట్నాల పప్పు అని పిలుస్తూంటారు. వీటిని ఎక్కువగా ప్రయాణాల్లో టైమ్ పాస్ కోసం తింటుంటారు. కొంత మంది నేరుగా తింటే.. మరి కొందరు వీటిల్లో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, మసాలాలు కలిపి తింటారు. వీటిని కొంత మంది వంటల్లో కూడా యాడ్ చేస్తారు. ఈ పప్పుతో టిఫిన్లలోకి చట్నీ తయారు చేస్తారు. ఈ పుట్నాల పప్పు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మితంగా వీటిని తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు. Peas
పుట్నాల పప్పులో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటుంది. కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి. మలబద్ధకం, అజీర్తి, కడుపులో నొప్పి, జీర్ణ సంబంధిత సమస్యలు అదుపులో ఉంటాయి.
పుట్నాల పప్పులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. చిరుతిండిగా లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకున్నా.. శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం పడదు. ప్రోటీన్ కొరత ఉన్నవారికి ఈ పప్పును స్నాక్‌లా చేసి పెట్టొచ్చు.
వేయించిన శనగ పప్పులో ప్రోటీన్, ఫైబర్ శాతం ఎక్కువ ఉంటుంది. ఇలా వెయిట్ లాస్ అవ్వొచ్చు. పుట్నాల పప్పు తినడం వల్ల శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది. తక్షణమే శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. త్వరగా నీరస పడకుండా ఉంటారు. వీటిల్లో ఐరన్, మాంగనీస్, ఫాస్పరస్, ఫోలేట్, మినరల్స్, విటమిన్స్ వంటివి అధికంగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
పుట్నాల పప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం కూడా మెరుగు పడుతుంది. ఇవి తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. అలాగే ఈ పప్పులో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తాయి.
ఇవీ చదవండి: Eye health: కంటి ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
Kakara Kaya: చేదైన ఆహారం.. పోషక గుణాల్లో తియ్యదనం.. కాకర కాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవీ..
Cluster Beans: గోరుచిక్కుడుతో అద్భుత ప్రయోజనాలు.. కండరాల ఎదుగుదలకు చక్కటి ఆహారం
Cashew: జీడిపప్పు ఆహారంలో భాగం చేస్తున్నారా? ఆరోగ్యం మీ సొంతం.. జీడిపప్పు వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవీ..
Best Veg Food: శాకాహారంలో బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏవి? మంచి ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే..
