HomeInternationalMarta: ఆ మహిళ వయసు 39.. పిల్లలు 19 మంది.. ప్రతి పిల్లాడికీ తండ్రులు వేర్వేరు...

Marta: ఆ మహిళ వయసు 39.. పిల్లలు 19 మంది.. ప్రతి పిల్లాడికీ తండ్రులు వేర్వేరు వ్యక్తులే!

Marta: సాధారణంగా మన పూర్వీకుల కాలంలో ఒకే ఇంట్లో సుమారు 10 నుంచి 15 మంది ఉండేవారు. అప్పట్లో పిల్లలను ఎడాపెడా కనేసేవారు. అయితే, రానురాను కాలక్రమంలో పిల్లల్ని కనడం తగ్గిపోతోంది. ప్రస్తుతం ఒకరు లేదా ఇద్దరితో దంపతులందరూ సరిపెట్టేస్తున్నారు. ఒకే కాన్పులో ముగ్గురు నలుగురు లేదా ఐదుగురు కూడా జన్మిస్తుండడం వార్తల్లో మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు మీరు చదవబోయే వార్త కాస్త డిఫరెంట్‌. ఒక మహిళ వయసు 39 సంవత్సరాలయితే ఇప్పటి వరకు 19 మంది పిల్లల్ని కనింది. ఇందులో ట్విస్ట్‌ ఏంటంటే.. ప్రతి పిల్లాడికీ తండ్రులు వేరు కావడం!! Marta

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ప్రపంచంలోని నలుమూల్లో ఎక్కడ ఏం జరిగినా నిమిషాల వ్యవధిలోనే తెలిసిపోతోంది. అలాంటి వార్తే ఇప్పుడు చూడండి. మెడలిన్ ప్రాంతంలో ఉండే 39 సంవత్సరాల వయసున్న మార్త అనే మహిళకు 19 మంది పిల్లలు సంతానం ఉన్నారు. అందులో 15 మంది పిల్లలు 18 సంవత్సరాల వయసులోపు వారే కావడం విశేషం.

అయితే, ఈ 19 మంది పిల్లల్లోని ప్రతి పిల్లాడికీ తండ్రులు వేరు కావడం మరో విశేషం. ఇంతమంది పిల్లలను కనేందుకు ఆమెకు ప్రభుత్వం నుంచి అనుమతి లభించిందట. ప్రభుత్వం ఆమెకు ఆర్థిక సహాయం కూడా చేస్తోందంటే నమ్మశక్యంగా లేదు కదూ..! ఇలా గర్భం దాల్చడం పిల్లలకు జన్మనివ్వడమే తన పని అంటూ మార్త చెబుతోంది.

ఈ ఘటన మెడలిన్ లో ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఇలా 19 పిల్లలతో మూడు బెడ్ రూమ్ లు ఉన్న ఇంట్లో నివసిస్తోందామె. ఇంట్లో ఎక్కువ స్థలం లేకపోవడంతో పెద్ద పిల్లలు సోఫాలో నిద్రిస్తారని చెబుతోంది. తనకు, తన పిల్లలకు ప్రభుత్వం సహాయం అందిస్తున్నప్పటికీ ఆ డబ్బు సరిపోవడం లేదని చెబుతోంది.

అంతేకాదు.. ఆయా పిల్లల తండ్రులు ఎవరూ పిల్లల బాధ్యతను పట్టించుకోవడం లేదని చెబుతోంది. తన ఇంటి పక్కన ఉండే ఇరుగు పొరుగు వారు కూడా తనకు సాయం అందిస్తున్నారని చెబుతోంది. వేరు వేరు వ్యక్తులతో ఇంతమంది పిల్లలకు జన్మనివ్వడం ఏంటన్నది ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

ఇదీ చదవండి: Banned Names: ప్రపంచంలో నిషేధించిన పేర్లు తెలుసా? ఈ పేర్లు పెట్టుకుంటే చర్యలు తప్పవట!
Long Drive: Long drive road trip plans for international tourists
Creatures in Sea: Creatures that live in the sea.. most interesting facts about sea
Winter Health care: చలికాలంలో సన్‌షైన్ విటమిన్ ప్రాధాన్యం ఎనలేనిది.. ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
World’s Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశం.. అక్కడి ప్రజల సంతోషానికి కారణం ఏంటో తెలుసా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు