Bramayugam: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ… “భ్రమయుగం”. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం… ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. మొదటి రోజే మూడు కోట్ల రూపాయలు వసూలు చేసి, బాక్సాఫీస్ వద్ద సత్తా చాటింది. మూవీ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని… శని, ఆదివారాల్లో ప్రత్యేక షోలు ఏర్పాటు చేయాలని కూడా నిర్మాతలు భావిస్తున్నారు. కొత్తగా మరో వంద థియేటర్లలో రిలీజ్ కు ఏర్పాట్లు చేశారు.
రాహుల్ సదాశివన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘భ్రమయుగం’ (Bramayugam) ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ జానర్ అయిన ఈ మూవీ…. ఇప్పుడు సినీ పరిశ్రమలోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా రిలీజ్ హక్కుల్ని సొంతం చేసుకునేందుకు వివిధ భాషల సినీ పరిశ్రమల బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారంటే… ‘భ్రమయుగం’ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారీ అంచనాలతో తెరకెక్కిన ‘భ్రమయుగం’ షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కానీ.. టెక్నికల్ ప్రాబ్లమ్స్, డబ్బింగ్ వెర్షన్ సెన్సార్ షిప్ పూర్తి కాకపోవడం వల్ల ఇతర భాషల్లో విడుదల వాయిదా పడింది.
ఇక మలయాళంలో సూపర్ హిట్ టాక్ రావడంతో ఇతర భాషల్లోనూ త్వరగా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకుని, ఈ వారంలోనే ఇతర భాషల్లోనూ ‘భ్రమయుగం’ అలరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ‘భ్రమయుగం’. ఓటీటీ హక్కుల్ని సోనీలివ్ సొంతం చేసుకుంది.
‘భ్రమయుగం’ కథేంటంటే: ఈ సినిమా పీరియాడికల్ థ్రిల్లర్, హర్రర్. ఇందులో తేవన్(అర్జున్ అశోకన్) అనే జానపద గాయకుడు తన తల్లిని చూసేందుకు వెళ్తూ… అడవి మార్గంలో తప్పిపోతాడు. ఆ సమయంలో అడవిలో అతడికి ఓ పాడుబడ్డ భవనం కనిపిస్తుంది. ఆ భవనంలో మనక్కల్ కుడుమోన్ పొట్టి (మమ్ముట్టి), అతడి కుమారుడు (సిద్ధార్థ్ భరతన్) నివసిస్తుంటారు.
తమ ఇంటికి వచ్చిన తేవాన్ కు… కుడుమోన్ అన్ని వసతులు కల్పిస్తాడు. కాను… అక్కడి పరిస్థితులు ఎమనించిన తేవన్‌కు అనుమానం వస్తుంది. తాను కుడుమోన్ ఉచ్చులో చిక్కుకున్నట్టు గ్రహిస్తాడు. ఆ భవనం నుంచి తప్పించుకునేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా కుడుమోన్ మంత్ర విద్యతో… తిరిగి ఆ భవనంలోకే వచ్చేలా చేస్తాడు. ఆ ఉచ్చులో నుంచి తేవన్ భయటపడ్డాడా…? కుడుమోన్ ఎవరు? అనేది కథలో ఆసక్తికరమైన విషయం.
Read Also: Kavya Thapar: టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. గ్లామర్ షో.. సోషల్ మీడియాలో హాట్ ఫొటోలు వైరల్
