HomeNationalMaoist Hidma: ఆ గ్రామంలో 77 ఏళ్ల తర్వాత తొలిసారి ఎగిరిన జాతీయ జెండా..

Maoist Hidma: ఆ గ్రామంలో 77 ఏళ్ల తర్వాత తొలిసారి ఎగిరిన జాతీయ జెండా..

Maoist Hidma: దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ఓ గ్రామంలో ఇప్పుడు తొలిసారి మాత్రమే జాతీయ జెండా ఎగరిందని తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండగలరా? ఆ విశేషాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం. Maoist Hidma

మావోయిస్ట్‌ అగ్ర నాయకుడు హిడ్మా స్వగ్రామం పువర్తి. సుమారు 77 ఏళ్ల తర్వాత జాతీయ జెండా అక్కడ రెపరెపలాడింది. ఈ గ్రామంలో ప్రభుత్వానికి సమాంతరంగా మావోయిస్టులు సర్కార్‌ను నడిపారు.

దీంతో ఆ ప్రాంతంలోకి వెళ్లాలంటేనే పోలీసులు హడలిపోయారు. ఇంత కాలం ఇదే కొనసాగుతూ వచ్చింది. హిడ్మా కోసం పోలీసులు ఎన్నో ఆపరేషన్లు చేసినప్పటికీ వాటి నుంచి తప్పించుకుని పోలీసులకు ఎప్పటికప్పుడు సవాళ్లు చేసేవాడు.

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలోని పువర్తి విలేజ్‌ చుట్టు పక్కల పోలీస్ చెక్‌పోస్టులు పెడుతూ క్రమంగా ముందుకెళ్లాయి భద్రతా బలగాలు. చివరికి ఆ గ్రామంలోకి వెళ్లి అక్కడ జెండా ఎగరేశాయి. దీంతో స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారి అక్కడ మూడు రంగుల జెండా రెపరెపలాడింది.

బస్తర్ ప్రాంతంలో తరచూ భద్రతా బలగాలపై అత్యంత వ్యూహాత్మకంగా, భీకర దాడులకు హిడ్మా పాల్పడేవాడని చెబుతారు. ఈ క్రమంలోనే వామపక్ష తీవ్రవాదం అణచివేతకు భద్రతా బలగాలు తీసుకుంటున్న చర్యల్లో హిడ్మా గ్రామం వద్ద పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేయడం అత్యంత కీలకంగా మారిపోయింది.

మావోయిస్టులు చెరలో ఉన్న పువర్తి గ్రామంలో తొలిసారి జాతీయ జెండా ఎగురవేయడంతో స్థానికులకు అక్కడ స్వాతంత్ర్యం వచ్చిన ఫీలింగ్ కలిగింది. సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు, భద్రతా బలగాలకు వ్యతిరేకంగా.. మావోయిస్టులు భారీ దాడులు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు.

అయితే భద్రతా దళాల తనిఖీలో పలువురు మావోయిస్టులు దొరికిపోయారు. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు గ్రామంలో జెండా ఎగరవేయడానికి రెడీ అయ్యారు. పువర్తి గ్రామంలో తాజాగా జాతీయ జెండా ఎగురవేసి అక్కడి ప్రజలకు స్వేచ్ఛను అందించారు. తమ అవసరాల కోసం మావోయిస్టులు కూరగాయలు పండించే భూములను కూడా పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.

పువర్తి గ్రామం, చుట్టు పక్కల ప్రాంతం మావోయిస్టులకు శిక్షణ ఇచ్చే శిబిరంగా పేరుండేది. సమావేశాలు నిర్వహించడం, స్థానిక యువకులను నక్సలిస్టులుగా మార్చి వారికి బాగా ట్రైనింగ్‌ కూడా ఇచ్చేవారు. ఒకప్పుడు పోలీసులు అడుగు పెట్టడానికి భయపడే ఆ ప్రాంతంలో.. గత కొన్ని నెలలుగా పలు పోలీసులు శిబిరాలు ఏర్పాటు చేయడం విశేషం.

ఇవీ చదవండి: Anti Naxal Meeting: అభివృద్ధిమంత్రంతో వామపక్ష తీవ్రవాదం తగ్గుదల.. జాతీయ సమావేశంలో సీఎం జగన్
National School games: జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ బాక్సింగ్ అండర్ – 17, 19 బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ బృందానికి పతకాలు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు