HomeInternationalWorld's Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశం.. అక్కడి ప్రజల సంతోషానికి కారణం ఏంటో...

World’s Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకర దేశం.. అక్కడి ప్రజల సంతోషానికి కారణం ఏంటో తెలుసా?

World’s Happiest Country: ఒక మనిషి సంతోషంగా ఉండటానికి అనేక కారణాలు ఉంటాయి. ఒక ఇంట్లో అందరూ సంతోషంగా ఉండటమే ఈరోజుల్లో గగనం. అయితే, ఓ దేశం మొత్తం సంతోషంగా ఉంటుందంమ్మగలరా? ప్రపంచంలోనే అత్యంత సంతోషకర దేశం ఒకటి ఉందండోయ్‌. ఆ దేశం గురించిన ప్రత్యేకతలు, విశేషాలు ఈ కథనంలో మనం తెలుసుకుందాం. World’s Happiest Country

ఒక వ్యక్తి సంతోషంగానే ఉంటేనే ఇల్లు, గ్రామం, రాష్ట్రం తద్వారా ఆ దేశం బాగుంటాయి. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో ఆకలి, పేదరికం, నిరుద్యోగం రకరకాల సమస్యలు ప్రజలను వేధిస్తున్నాయి. ఈ సమస్యలు ప్రజల ముఖాల్లో ఆనందం, సంతోషాన్ని దూరం చేస్తున్నాయి. అయితే గత 6 సంవత్సరాలుగా వరుసగా ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ ఉంది.

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండ్. ఈ విషయాన్ని న్యూయార్క్ పోస్ట్ నివేదిక వెల్లడించింది. ఫిన్లాండ్ ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా ఎలా అవతరించిందో ఫిన్నిష్ మనస్తత్వవేత్త ఫ్రాంక్ మార్టెలా ఇక్కడ ప్రజల సంతోషానికి కారణం ఏమిటో వెల్లడించారు.

ఫిన్లాండ్ సంతోషకరమైన దేశంగా ఉండటానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయట. వీటిని ప్రజలు తమ దైనందిన జీవితంలో కచ్చితంగా అనుసరిస్తారని తేలింది. ఏ దేశ ప్రజలైనా ఈ నిబంధనలను పాటించడం మొదలు పెడితే, సంతోషంగా ఉండటానికి అతి తక్కకువ సమయమే పడుతుందంటున్నారు. ఐకమత్యంతో ఈ ప్రతిజ్ఞ చేస్తే చెడు పరిస్థితులపై పోరాడే శక్తి వస్తుంది.

ఫిన్లాండ్‌ దేశంలోని ప్రజలు తమ చుట్టూ ఉన్న వారి పట్ల శ్రద్ధ వహిస్తారని నిపుణులు పేర్కొంటున్నారు. వారి ముఖాల్లో సంతోషాన్ని చూడడానికి, తమ వంతు సహాయం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటారట. మీరు ఎవరికైనా విపత్కర పరిస్థితుల్లో సహాయం చేస్తే, వారు మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారన్నది తెలిసిందే. మీరు, మీ కుటుంబం, స్నేహితులు, పొరుగు వారితో ఎంత ఎక్కువ సమయం గడుపుతున్నారో, మీ జీవితం అంత సంతోషంగా ఉంటుందని ఫిన్లాండ్‌లోని అనేక ఘటనలు, ఉదంతాలు స్పష్టీకరిస్తున్నాయి.

ఫిన్‌ల్యాండ్‌ దేశంలో ప్రజలు తమ సమస్యను ఎదుటివారితో పంచుకుంటారు. వారి ఆనందాన్ని కూడా పంచుకునే సౌలభ్యం అక్కడ ఉంది. ఇలా చేయడం వల్ల మీ ముఖంలో చిరునవ్వు, ఆనందం వెల్లివిరుస్తాయి. ఆందోళన, నిరాశ తగ్గిపోతాయి. ఇక్కడి ప్రజలు తమకు సంతోషాన్ని కలిగించే విషయాలను ఒక లిస్ట్‌గా రూపొందించుకుంటారు. ఇక్కడి వారంతా అదే పని చేయాలని కంకణబద్ధులవుతారట. అనేక ఏళ్లుగా ఇక్కడ ఈ పాత పద్ధతి కొనసాగుతూ వస్తోందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇతరులకు మంచి చేయడమే ఇక్కడి వారి ప్రథమ ప్రాధాన్యత.

ఇక్కడి ప్రభుత్వ సంస్థలు కూడా ఎల్లప్పుడూ ప్రజలకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉంటాయి. అక్కడి ప్రజలను ప్రభుత్వం ఎప్పుడూ సంతోషంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ప్రతి క్షణం ప్రజల సమస్యల పరిష్కారానికి కార్యాచరణ ఉంటుంది. మీ దేశం ఎలా నడుస్తుంది అనేది మీ ఆనందంపై ప్రభావాన్ని చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

దేశంలో గందరగోళం ఉంటే, మీ ముఖంలో నిరాశ తేటతెల్లమవుతుందంటున్నారు. అరాచకం సామాజికమైనా, రాజకీయమైనా లేదా ఆర్థికమైనా పరిస్థితులు ప్రజలను ప్రభావితం చేస్తుందన్నది నిపుణుల మాట. దేశంలో శాంతి నెలకొనాలని, ఇది ఆనందానికి ప్రధాన పునాది అని నిపుణులు వెల్లడిస్తున్నారు.

అవినీతికి ఆస్కారమే లేదిక్కడ..

ఫిన్లాండ్‌ దేశంలో ప్రభుత్వ ఆరోగ్య సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ప్రజా రవాణా చాలా నమ్మకమైనది. చవకైనది కూడా. ఎక్కువ సంపాదించేవారు తక్కువ సంపాదించేవారు అనే తేడాలేమీ ఉండవు. ప్రజలకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది. అవినీతి చాలా వరకు ఉండదు. ఇవన్నీ ఇక్కడి ప్రజల ముఖాల్లో, జీవితాల్లో ఆనందాన్ని రెట్టింపు చేసేలా చేస్తున్నాయి.

Read Also: Long Drive: Long drive road trip plans for international tourists

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు