YS Jagan to YSRCP Cadre: వైయస్సార్‌సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాబోయే రెండు నెలలు అత్యంత కీలకమని, ప్రతిరోజూ యుద్ధమేనన్నారు. ప్రతి గడపకూ వెళ్లి మీ బిడ్డ ప్రభుత్వంలో జరిగిన మంచిని వివరించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. జగన్ వస్తేనే పథకాలు కొనసాగుతాయని, జగన్‌ను మళ్లీ గెలిపించుకుందామని చెప్పాలని సూచించారు. (YS Jagan to YSRCP Cadre)
* ఇప్పుడు మనం చేయాల్సిందల్లా ఒక్కటే. 2.53 లక్షల కోట్లు మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు, నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తోంది.
* రాష్ట్రంలో ఈరోజు 84 శాతం ఇళ్లకు న్యాయం,మంచి జరుగుతోంది. గ్రామాల్లో 92 శాతానికిపైగా ఇళ్లకు మేలు జరుగుతోంది.
* ఇంత మంచి జరిగింది కాబట్టే మీ అందరికీ కూడా ఈరోజు ఒకే ఒకటి చెబుతున్నా. మీరు చేయాల్సిందల్లా ప్రతి ఇంటికీ వెళ్లి వాళ్లకు జరిగిన మంచి గురించి చెబుతూ వాళ్లందరినీ ఒక్కటే అడగండి, మీ బిడ్డకు కుతంత్రాలు, కుట్రలు, మోసం చేయడం, అబద్ధాలు ఆడటం తెలియదు. పొత్తుల్ని నమ్ముకోలేదు, జిత్తుల్ని, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడిని నమ్ముకోలేదు. పైన దేవుడిని, మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* మీ బిడ్డ వల్ల మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ సైనికులుగా మీరే నిలబడండి అని, ప్రతి కుటుంబం నుంచి స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని అడగండి.
* ప్రతి కుటుంబం నుంచి బయటకు వచ్చిన వారు కనీసం 100 మందికైనా మన ప్రభుత్వం చేసిన మంచిని వివరంగా చెబుతూ వాళ్లందరిచేత కూడా మీ బిడ్డ ప్రభుత్వానికి తోడుగా నిలబడేట్టుగా స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని చెప్పండి.
* ఈ ఎన్నికలు ఎందుకు ఇంత ముఖ్యమైనవనేది చెప్పాలి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకొనేందుకు మాత్రమే ఉన్నవి కావు.
* పేదల కుటుంబాల భవిష్యత్తు, వారిని నడిపించే భవిష్యత్తు.. ఈ ఎన్నికల్లో ఓటు వేస్తే వారి భవిష్యత్ మారుతుందని చెప్పండి.
* ప్రతి పేదవాడి భవిష్యత్ మారాలంటే ఈ ఎన్నికల్లో జగనే రావాలని చెప్పండి.
* పేదవాడు చదువుతున్న బడులు మారాలన్నీ, ఇంగ్లీషు మీడియం చదువులు రావాలనాన్న, పిల్లలచేతుల్లో ట్యాబులు రావాలన్నా, ఐఎఫ్ పీలు ఉండాలన్నా, మరో 10-15 ఏళ్ల తర్వాత ప్రపంచంతో పోటీ పడేలా చదువులు అందాలన్నా మీ జగన్ వస్తేనే జరుగుతుందని ప్రతి ఇంట్లోనూ గట్టిగా చెప్పండి.
* ఆ ఇంటి వద్దనే అవ్వాతాతలకు చెప్పండి. 1వ తారీఖున సెలవుదినమైనా, ఆదివారమైనా ప్రతి అవ్వకూ, తాతకు, వితంతు అక్కకు, వికలాంగులకు అందరికీ అర్థమయ్యేలా చెప్పండి. చిక్కటి చిరునవ్వుతో నేరుగా మీ ఇంటికి పెన్షన్ రావాలంటే ఒక్క జగన్ ఉంటేనే జరుగుతుందని చెప్పండి.
* ఈరోజు మన ఇంటికే డాక్టర్లు వస్తున్నారు. గ్రామంలోనే విలేజ్ క్లినిక్ ఉంది. జల్లెడ పడుతూ ఏ మందులు కావాలని అడిగి మందులిస్తూ, పేదవాడికి ఆరోగ్యపరంగా ఏ అవసరం వచ్చినా చేయిపట్టుకొని నడిపిస్తున్న పరిస్థితులు కొనసాగాలంటే, ప్రతి పేదవాడూ వైద్యం కోసం అప్పులపాలయ్యే పరిస్థితి రాకుండా లేకుండా పేదవాడికి మంచి జరగాలంటే మీ జగన్ ముఖ్యమంత్రి అయితేనే అది జరుగుతుందని చెప్పండి.
* పిల్లల్ని బడికి పంపితే చాలు మేనమామ అమ్మ ఒడి ఇస్తున్నాడు, ప్రతి అక్కకూ చేయూత, ఆసరా ఇచ్చాడు, సున్నా వడ్డీతో తోడుగా ఉండి నడిపిస్తున్నాడు. ప్రతి అక్కచెల్లెమ్మకూ చెప్పండి. ఇంత ఆర్థిక స్వావలంబన ఉండాలన్నా, కావాలన్నా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని చెప్పండి.
* గతంలో రైతన్నల రుణాలు మాఫీ చేస్తానని మోసం చేసిన పెద్దమనిషి పాలన చూశాం. ఈరోజు జగనన్న మాత్రం మాట చెప్పాడు, రైతు భరోసా ఇస్తానన్నాడు చెప్పిన దానికన్నా ఎక్కువే ఇచ్చిన పాలన చూశారు. ప్రతి సంవత్సరం రైతు భరోసా రావాలన్నా, ఫ్రీగా ఇన్సూరెన్స్, ఇన్ పుట్ సబ్సిడీ, ఆర్బీకే వ్యవస్థ కొనసాగాలన్నా మీ జగన్ ముఖ్యమంత్రిగా ఉంటేనే జరుగుతుందని, మీ జగన్ ను తెచ్చుకుందామని ప్రతి రైతన్నకూ చెప్పండి.
* మనం వేసే ఈ ఓటు పేదవాడిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే ఓటు అని చెప్పండి. ఇక్కడి నుంచి 10-15 సంవత్సరాల తర్వాత మన పిల్లలు నిటారుగా నిలబడి అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడుతూ, పెద్ద పెద్ద కంపెనీలతో లక్షల జీతాలు తీసుకుంటూ తలరాతలు మార్చే ఎన్నికలు ఈ ఎన్నికలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* పేదవాడికి మంచి జరగాలన్నా, భవిష్యత్ ఉండాలన్నా కేవలం ఒక్క మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే మాత్రమే జరుగుతుందని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు తీసుకొచ్చింది మీ బిడ్డ అని చెప్పండి.
* ఎన్నికల ముందు కేజీ బంగారం ఇస్తామనిమాట చెబుతారు. ప్రతి ఇంటికీ బెంజ్ కారిస్తామనిమోసం చేస్తారు.
* విశ్వసనీయతకు అర్థం చెప్పింది మాత్రం మీ బిడ్డ మాత్రమే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* మీ బిడ్డ చేయగలిగిందే చెబుతాడు. ఒక్కసారి చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి.
* ఈ 56 నెలల్లోనే ఇచ్చిన ఏ స్కీమైనా ఏ మంచైనా కొనసాగాలన్నా, భవిష్యత్ లో ఇవి పెరగాలన్నా, ఇంటికే ఆ పెన్షన్, డీబీటీ స్కీములు, ఆ మంచి జరగాలన్నా మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలదని, ప్రతి పక్షాలకు ఓటు వేయడం అంటే దాని అర్థం మాకు ఈస్కీములు వద్దు, ఈ స్కీముల రద్దుకు మీరే ఆమోదం తెలిపినట్టే అని, లంచాలు వివక్షతో కూడిన మళ్లీ జన్మభూమి కమిటీల వ్యవస్థకు మళ్లీ ఓటు వేయడమే అని ఇంటింటికీ చెప్పమని అడుగుతున్నా.
read also: YS Jagan on Social Justice: సామాజిక న్యాయానికి బ్రాండ్ వైయస్సార్‌సీపీ.. 68 శాతం మంత్రి పదవులిచ్చామన్న సీఎం జగన్
YS Jagan Bus Yatra: జనం మధ్యలోకి జగన్.. బస్సు యాత్రతో వైయస్సార్ సీపీలో జోష్!!
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
