HomeAndhra PradeshYS Jagan Bheemili: దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు...

YS Jagan Bheemili: దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా..!

YS Jagan Bheemili: భీమిలి సభలో సీఎం జగన్‌ విశ్వరూపం చూపించారు. తన స్పీచ్‌కు పదును పెట్టినట్లు స్పష్టమైంది. 34 నియోజకవర్గాల నుంచి భారీ సంఖ్యలో జనం రావడంతో పూనకాలు తెప్పించేలా జగన్‌ ప్రసంగం సాగింది. దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి తాను సిద్ధమని, మీరు సిద్ధమా అంటూ జగన్‌ చెప్పిన స్పీచ్‌.. కార్యకర్తల్లో భావోద్వేగాన్ని కలిగింది. (YS Jagan Bheemili)

* ఏ మంచీ చేయని వీరంతా పొత్తు లేకపోతే పోటీ చేయడానికి అభ్యర్థులే లేని వీరంతా పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటే కొన్ని సామెతలు గుర్తుకొస్తున్నాయి.
* ఓటి కుండకు మోత ఎక్కువ, ఉత్త గొడ్డుకు అరుపులెక్కువ, చేతగాని వాడికి మాటలెక్కువ అనే సామెతలు గుర్తుకొస్తున్నాయి.
* జనంలో లేని వారు, ప్రతి పేదవాడి గుండెలో లేని వారు ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ కూడా మీ జగనన్నే టార్గెట్ గా, పేదవాడి భవిష్యత్ టార్గెట్ గా, వైయస్సార్ సీపీ టార్గెట్ గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి.
* ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతున్నా.

* నేను సిద్ధం.. దేవుడి దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా.
* వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధం అని ఇక్కడి నుంచే వైయస్సార్ సీపీ పిలుపునిస్తోందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
* 2024 మరో 60-70 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఆ ఎన్నికలకు మీరు సిద్ధమా? దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను ఓడించేందుకు సిద్ధమా? అని మీ అందరినీ అడుగుతున్నా.

* వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం, వారి వంచనకు, మన విశ్వసనీయతకు మధ్య యుద్ధం. వచ్చే ఎన్నికలు వారి దోచుకో, పంచుకో తినుకో అనే విధానానికి, మన డీబీటీ కి మధ్య జరుగుతున్న యుద్ధం.
* వచ్చే ఎన్నికలు వారి సామాజిక అన్యాయానికి, మన సామాజిక న్యాయానికి మధ్యయుద్ధం.
* ఈ సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసే వారిక కుట్రలకు, మన సంక్షేమ ప్రభుత్వానికి మధ్య జరగబోయే యుద్ధం.వచ్చే రెండు నెలలు మనందరికీ నిత్యం యుద్ధమే.

* మరోసారి అడుగుతున్నా. ఈ యుద్ధానికి మీరంతా సిద్ధమా?
* ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పని చేయాలి. ప్రతిపక్షం పది వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాను, వారి సోషల్ మీడియాను, సోసల్ మీడియాలో చేసే దుష్ర్పచారాల్ని తిప్పి కొట్టాలి, అందుకు మీరు సిద్ధమా? ప్రతి ఒక్కరి చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ ఫోన్లే మీకు అస్త్రాలు.

* సెల్ ఫోన్ ఉన్న ప్రతి పేదవాడూ సోషల్ మీడియాను శాసించబోతున్నాడు.
* బూత్ కమిటీల సభ్యులుగా, గృహ సారథులుగా, వాలంటీర్లుగా ఉన్న వారంతా పార్టీలో సామాన్య కార్యకర్త మొదలు, రాజ్యసభ సభ సభ్యుల వరకు కీలక పాత్ర పోషించాలి. అందుకు మీరంతా సిద్ధమేనా?
* వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 స్థానాలు మన టార్గెట్.

* 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు మన టార్గెట్. ఎందుకు రావు? అని అడుగుతున్నా.
* ప్రతి ఇంటికీ మంచి జరిగినప్పుడు, ప్రతి గ్రామానికి మంచి జరిగినప్పుడు 60 శాతం కుటుంబాలు మీ వెంట, మన వెంట ఉంటే ఎందుకు రావు 175కు 175. ఎందుకు రావు 25కు 25.
* మంచి చేసిన ప్రభుత్వం, మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం, ప్రతి పేదవాడి భవిష్యత్ గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం, చేస్తున్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం.

* ఈ యుద్ధంలో యుద్ధానికి సిద్ధం, సై అంటున్న మీ బిడ్డకు మీరంతా తోడుగా ఉండటానికి సిద్ధమా?
* మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి ఆశీస్సులు దేవుడి దయ, మీ బిడ్డతో ఉన్నంత వరకు మీ బిడ్డ ఏ ఒక్కరితోనూ భయపడడు.
* ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినందుకు ప్రతి అక్కకూ ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అన్నకు, ప్రతి స్నేహితుడికి, ప్రతి అవ్వకు, తాతకూ హృదయపూర్వకంగా రెండు చేతులూ జోడించి మీ బిడ్డ కృతజ్ఞతలు తెలుపుకుంటూ మీ బిడ్డ ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి మోగిస్తున్నాడు.

read also: YS Jagan to YSRCP Cadre: ప్రతి గడపకూ వెళ్లండి.. జగన్‌ను తెచ్చుకుందామని చెప్పండి.. జగన్‌ వస్తేనే పథకాలు కొనసాగుతాయని చెప్పండి
YS Jagan vs All: పిక్చర్‌ క్లియర్‌.. ఒక్క జగన్‌ వర్సెస్‌ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్‌..!
CM Jagan Help to Doctor Couple: డబ్బుదేముంది లేబ్బా.. ముందు ప్రాణం నిలబడనీ..!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు