YS Jagan comments at Bheemili: అన్నింట్లోనూ మోసం చేసిన చంద్రబాబుకు ఓటేస్తానని ఎవరంటారని సీఎం జగన్ ప్రశ్నించారు. ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబానికీ మంచి చేసిన మీ బిడ్డ ప్రభుత్వానికి మద్దతుగా ఓటేయకుండా ఉండగలరా? అని జగన్ వ్యాఖ్యానించారు. భీమిలి బహిరంగ సభలో తమ ప్రభుత్వం చేసిన మంచిని జగన్ కేడర్‌కు వివరించారు. (YS Jagan comments at Bheemili)
* అన్నింటిలోనూ మోసం, ఇవన్నీ కూడా నేను అడుగుతున్నా. ఇవన్నీ విన్న తర్వాత ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా మనకు ఓటు వేయమనిగానీ, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా ఓటు వేస్తామని గానీ అనగలరా?
* ఇవన్నీ విన్న తర్వాత.. ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మీ బిడ్డ ప్రభుత్వం, మీ అన్న ప్రభుత్వం, మీ తమ్ముడి ప్రభుత్వానికి తోడుగా నిలబడకుండా ఉండగలరా?
* 2019లో మనం అధికారంలోకి వచ్చే వరకు ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా పేదలకు ఎలాంటి లంచాలు, అవినీతి లేకుండా, వివక్ష లేకుండా అర్హత ఉన్న ప్రతి పేదవాడికీ కులం, మతం, ప్రాంతం, వర్గం చూడకుండా, ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా పేదల చేతికి ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయీ ఇవ్వటం సాధ్యమే అని ఎవరైనా చెబితే మీరంతా నమ్మి ఉండేవారా?
* ఈ 56 నెలల కాలంలోనే మనందరి ప్రభుత్వం మాత్రమే ఈరోజు ఆ పని చేయగలిగింది.
* ఈరోజు ఓ లంచాలు లేని వ్యవస్థ, గ్రామ స్థాయిలో మీరు, నేను కలిసి ఈరోజు ఇవ్వగలుగుతున్నాం, ప్రతి పేదవాడికీ న్యాయం, మంచి చేస్తున్నాం.
* లంచం, వివక్ష లేని సుపరిపాలనను తీసుకొచ్చింది ఓ వైయస్సార్ సీపీ పార్టీ, మీ జగన్ అని చెప్పడానికి గర్వపడుతున్నా.
* రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబాన్నీ మీరంతా అడగండి, ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు అడగండి. గత 10 సంవత్సరాల వారి బ్యాంకు ఖాతాలను వారినే చూడమని అక్కచెల్లెమ్మలను అడగండి.
* వారి అకౌంటులో గతంలో చంద్రబాబు పాలనలో 2014-19 మధ్యలో చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్కరూపాయి అయినా వేసిందా అని వారినే అడగండి.
* మళ్లీ అడగండి. 2019-24 మధ్య.. అంటే మీ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాల్లో ఆ అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లోకి, రైతన్నలు, అవ్వాతాతల చిరునవ్వుల మధ్య మీ జగన్ ప్రభుత్వం అందించిన సొమ్ము చూడండి అని ప్రతి ఇంట్లోనూ చెప్పండి.
* కోవిడ్ కష్టాలు ఎన్ని వచ్చినా మీ బిడ్డ మాత్రం ప్రతి పేదవాడి ముఖంలో, కుటుంబంలో చిరునవ్వులే చూడాలని ఆరాటపడ్డాడు.
* సాకులు చెప్పలేదు, ఆదాయాలు తగ్గిన సాకు చెప్పలేదు. తోడుగా, అండగా నిలబడింది మీ బిడ్డ మాత్రమే అని ప్రతి పేద కుటుంబంలోకి వెళ్లి ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ, రైతన్నకు, అవ్వాతాతలకు చెప్పండి.
* వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, చైర్మన్లు, కార్పొరేటర్లు, మేయర్లు, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, వీరితో పాటు ప్రతి కార్యకర్త, అభిమానికి, ప్రతి నాయకుడికీ ఒక్క విషయం చెబుతున్నా.. ఇది మీ అందరి పార్టీ. ఇది ఒక్క జగన్ పార్టీ కాదు. ఇది మీ అందరి పార్టీ.
* మీ బిడ్డ కేవలం మీ అందరికీ ప్రజలకు ఓ మంచి సేవకుడని మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.
* కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో, పదవులు, అధికారాలిచ్చే విషయంలో దేశ చరిత్రలో లేని విధంగా కార్పొరేషన్లకు డైరెక్టర్లు నియమించిన ప్రభుత్వం మనది.
* మార్కెట్ యార్డులు, దేవాలయ బోర్డుల్లో మొత్తంగా నామినేటెడ్ పదవుల భర్తీలో 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్లు, డైరెక్టర్లు ఇవ్వడం మీ అన్నకే సాధ్యమైంది.
* గత టీడీపీ, చంద్రబాబు పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్దిమందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి వారి కార్యకర్తలతో సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేసి లంచాలు పుచ్చుకుంటూ ఉంటే, ఆ స్థానంలో మన ప్రభుత్వంలో మన చదువుకున్న పిల్లల్ని తీసుకొచ్చి మనదైన వాలంటీర్ల వ్యవస్థ ఇంటింటికీ వెళ్లి లంచాలు, వివక్ష లేకుండా ప్రతి పథకాన్ని అందిస్తున్నాం.
* మనందరి ప్రభుత్వానికి దన్నుగా మనందరితో కలిసి గ్రామ స్థాయి, మండల స్థాయిలో ప్రజా ప్రతినిధులందరితో అనుసంధానమై ప్రతి పేదకూ మంచి చేస్తూ వారి మన్ననలు పొందుతూ అడుగులు వేస్తోంది మన పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నా.
* కొంత మంది నాయకులకు అనిపిస్తుంటుంది. జగనన్న అందరికీ వాలంటీర్ల చేతుల్లో పెట్టాడు, లంచాలు లేకుండా ప్రతి ఇంట్లో సాయం చేస్తున్నారు అనిపిస్తుంటుంది.
* కానీ ఆ వాలంటీర్లు ఎవరో కాదు, వారు కూడా మనల్ని అభిమానించే మన పార్టీని అభిమానించే మనలో నుంచి వచ్చిన మనవాళ్లే అని చెప్పడానికి గర్వపడుతున్నా.
* ఎందుకంటే ప్రతి పథకాన్నీ ప్రతి పేద కుటుంబంలోకి తీసుకొని పోయి వాళ్లకు ఇవ్వాలన్న తపన, తాపత్రయం మనసులో మన పార్టీపట్ల, మన పట్ల ఆ ప్రేమ, అనురాగం ఉంటేనే చేయగలుగుతారు.
* మంచి చేయగలిగాం కాబట్టే ఈరోజు నేను గర్వంగా చెబుతున్నా. మీలో ఎవరైనా సరే, మన పార్టీలో ఎవరైనా సరేఏ పదవికి పోటీ చేసినా ప్రజలందరూ మామూలు మెజార్టీ కాదు, గొప్ప మెజార్టీతో ఆ స్థానాల్లో కూర్చోబెడతారు.
* ఇలా మన పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం.
* నామినేషన్ పనుల్లోనూ ఇదే న్యాయం చేస్తూ వచ్చాం.
* ఎవరూ గెలవనన్ని పదవులన్నింటిలోనూ జగన్‌ను నమ్మిన వారు, వైయస్సార్ సీపీలో ఉన్న వారు, పార్టీ కోసం కష్టపడిన వారందరికీ అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నా.
* మనం ఈ 56 నెలల పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం కాబట్టే, వివక్ష లంచాలు లేని పాలన ఇవ్వగలిగాం కాబట్టే, ఇవాళ ఎవరైనా మన పార్టీ తరఫున నామినేషన్లు వేస్తే చాలు ప్రజలు ఆశీర్వదించి భవిష్యత్ లో ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పిస్తారు. కార్యకర్తలను గెలిపించే పార్టీ మనది.
read also: YS Jagan on Social Justice: సామాజిక న్యాయానికి బ్రాండ్ వైయస్సార్సీపీ.. 68 శాతం మంత్రి పదవులిచ్చామన్న సీఎం జగన్
CM Jagan Help to Doctor Couple: డబ్బుదేముంది లేబ్బా.. ముందు ప్రాణం నిలబడనీ..!
YS Jagan vs All: పిక్చర్ క్లియర్.. ఒక్క జగన్ వర్సెస్ టీడీపీ, జనసేన, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్..!
