బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Sharmila : మోదీపై షర్మిల ఘాటు విమర్శలు.. ఓట్ చోర్.. గద్దె ఛోడ్!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శుక్రవారం, 19 సెప్టెంబర్ 2025

Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, భారత ఎన్నికల సంఘంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశవ్యాప్తంగా ఓట్ల చోరీకి మోడీయే కారణమని, దానిని ఎన్నికల సంఘం కప్పిపుచ్చుతోందని ఆమె ఆరోపించారు.

విజయవాడలో మీడియాతో మాట్లాడిన షర్మిలా, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన సంచలన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, ఇది ప్రజాస్వామ్య చరిత్రలో ఒక “చీకటి అధ్యాయం” అని పేర్కొన్నారు.

షర్మిలా ప్రధాన వ్యాఖ్యలు:
“రాహుల్ జీ తీగలాగుతుంటే, మోడీ గారి డొంక కదులుతోంది. ఓట్ల దొంగ మోడీ బాగోతం ఒక్కొక్కటిగా బట్టబయలవుతోంది” అని షర్మిలా అన్నారు. ఓట్ల చోరీ కాంగ్రెస్‌ను బలహీనపర్చేందుకు పథకం ప్రకారమే జరిగిందని ఆరోపించారు. రాహుల్ గాంధీ మాటలే “ECIపై హైడ్రోజన్ బాంబు” లాంటివని, ఆధారాలతో సహా నిజాలను దేశం ముందుంచారని అన్నారు.

స్వతంత్రంగా ఉండాల్సిన ఎన్నికల సంఘాన్ని మోడీ చేతిలో బొమ్మగా మార్చారని, ఇది ప్రజాస్వామ్యానికి చేసిన అతిపెద్ద నేరమని అన్నారు. “లక్షలాది మంది ఓటు హక్కును హరించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు” అని షర్మిలా మండిపడ్డారు.

ఓట్ల చోరీపై ఆరోపణల వివరాలు
కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగించారని షర్మిలా ఉదహరించారు.
అలంద్ నియోజకవర్గంలో మాత్రమే 6 వేల ఓట్లను నకిలీ లాగిన్ల ద్వారా తొలగించారని చెప్పారు.
సాఫ్ట్‌వేర్‌ను హైజాక్ చేసి, ఆటోమేటెడ్ ప్రోగ్రామింగ్ వినియోగించడం దేశద్రోహానికి తక్కువ కాదన్నారు.
నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు మొబైల్ నంబర్లతో అక్రమంగా ఓట్లు తొలగించడం ఉగ్రవాద చర్యకు నిదర్శనం అని పేర్కొన్నారు.

ఎన్నికల సంఘంపై డిమాండ్లు
తొలగించిన ఓటర్ల పూర్తి వివరాలు ఒక వారం లోపు ప్రకటించాలని డిమాండ్ చేశారు.
వాటికి ఉపయోగించిన మొబైల్ నంబర్లు, OTPలు, లాగిన్ వివరాలు బయట పెట్టాలని కోరారు.
లేకపోతే ECI స్వయంగా ఓట్ల దొంగలకు రక్షణ కల్పిస్తున్నట్టే అవుతుందని షర్మిలా హెచ్చరించారు.

“Democracy will not be deleted” అని ఘాటుగా వ్యాఖ్యానించిన షర్మిలా, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ఇవీ చదవండి: Sharmila on BJP : నేను కాదు గాంధారి.. మీరే కౌరవులు : షర్మిల ఫైర్
Sharmila fire: జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డ షర్మిల.. అదానీతో ముడిపెడుతూ..

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading