ఆదివారం, 1 నవంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Sharmila on BJP : నేను కాదు గాంధారి.. మీరే కౌరవులు : షర్మిల ఫైర్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 5 మే 2025

Sharmila on BJP : బీజేపీ నేతలపై ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిల (Sharmila on BJP) ఫైర్ అయ్యారు. బీజేపీ (AP BJP) నేతలు కౌరవులతో సమానం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో రాష్టానికి ఒక్క ప్రయోజనం జరిగింది అని నిరూపిస్తే..నేను గాంధారి అని ఒప్పుకుంటానన్నారు.

‘‘అకాల వర్షాల వలన అస్థి, ప్రాణ, పంట నష్టం తీవ్రంగా జరిగింది. ఎక్కడ చూసినా తడిచిన ధాన్యం కనిపిస్తోంది. రాలిపోయిన మామిడి, కూలిపోయిన అరటి కనిపిస్తోంది. దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది అని అంచనా. ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగింది అని ఈ ప్రభుత్వం లెక్కలు కూడా తీయలేదు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా తడిచిన ధాన్యమే. (Sharmila on BJP)

ఈ సారి దాదాపు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండింది. కానీ ప్రభుత్వం కొన్నది మాత్రం కేవలం 13 లక్షల మెట్రిక్ టన్నులే. ఇంకా 17 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల దగ్గరే ఉంది. టార్గెట్ ముగిసింది అని RSK కేంద్రాలు బంద్ పెట్టారు. విదేశాల్లో డిమాండ్ లేదని మిల్లర్లు కూడా కొనడం లేదు. పొలాల్లో వరి కుప్పలు పోసి నిరీక్షిస్తున్నారు. ఇప్పుడు ఆ ధాన్యం ఎవరు కొనాలి? చివరి గింజ వరకు కొంటాం అని ఇచ్చిన హామీ ఏమయింది?

మిల్లర్లు తక్కువ రేటుకు కొంటున్నారు అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో ఇదే పరిస్థితి ఏర్పడితే… నేరుగా అక్కడ ప్రభుత్వం విదేశాలకు నేరుగా బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఫిలిప్పీన్స్,మలేషియా దేశాలతో నేరుగా తెలంగాణ ప్రభుత్వం MOU చేసుకుంది. ఈ ప్రభుత్వం మిల్లర్ల మీద ఒత్తిడి చేయకుండా…నేరుగా విదేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేయొచ్చు కదా? మీ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపం కావాలా ?

రాష్ట్రంలో రైతు పరిస్థితి దారుణంగా ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులను మోసం చేసింది. రాష్ట్రంలో ఏ పంటకు మద్దతు ధర లేదు. కనీస మద్దతు ధర అందక రైతులు నష్టపోతున్నారు. రాష్ట్రంలో మిరప కి 11781 మద్దతు ధర ఉంటే… 6 నుంచి 9 వేలు ధర దక్కలేదు. పత్తి పంటకు 7521 మద్దతు ధర ఉంటే.. గరిష్ఠంగా 5 వేలు కూడా అందలేదు. వేరుశెనగ కి 6783 రూపాయలు మద్దతు ధర ఉంటే.. గరిష్టంగా 5 వేలు దక్కలేదు. జొన్న పంటకు 3371 మద్దతు ధర ఉంటే.. గరిష్ట ధర 2500 కూడా రైతుకు అందలేదు.

కంది పంటను మద్దతు ధర కన్నా 2 వేల రూపాయలు తక్కువకు అమ్ముకోవాల్సి వచ్చింది. పెసర కు క్వింటాకు 3600 రూపాయల నష్టానికి, మినుము 14 వందల నష్టానికి, మొక్క జొన్న 250 రూపాయల నష్టానికి అమ్ముకున్నారు. పొగాకు రైతుకు 13 వేల నష్టానికి రైతు అమ్ముకుంటున్నారు. ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రైతులకు మద్దతు ధర హక్కు అని చెప్పారు. ఎక్కడ దక్కుతుంది రైతులకు ఆ హక్కు ?

రైతులను దగ చేస్తూ..వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఒక స్టేట్ మెంట్ ఇచ్చాడు. ధరల స్థిరీకరణ కింద 6 వేలు ఇప్పటివరకు ఖర్చు చేశారట ? ఇదంతా పచ్చి అబద్ధాలు. మీరు అధికారంలో వచ్చి 10 నెలలు కాలేదు. 10 నెలల్లో 6 వేల కోట్లు ధరల స్థిరీకరణ కింద ఎలా ఖర్చు చేశారు? 6 వేల కోట్ల పై వ్యవసాయ శాఖ వెంటనే శ్వేత పత్రం ఇవ్వాలి.

కులగణన క్రెడిట్ రాహుల్ దే..
కులగణన పై బీజేపీ కి జ్ఞానోదయం అయ్యింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇది రాహుల్ గాంధీ గారి విజయం. ఈ క్రెడిట్ మొత్తం రాహుల్ గాంధీ ది. కులగణన చేయాలి అనేది కాంగ్రెస్ డిమాండ్. సామాజిక న్యాయం కోసం కులగణన చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. కులగణన చేసి రిజర్వేషన్లు పెంచాల్సి వస్తే పెంచాలని రాహుల్ అన్నారు. ప్రతి 10 ఏళ్లకు కులగణన చేయాలి. 1951 నుంచి ప్రతి 10 ఏళ్లకు కులగణన జరుగుతుంది. 2011 లో చివరిసారి జరిగింది. 2021లో జనగణన జరగాలి. బీజేపీ జనగణన తో పాటు కులగణన పై నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ ఒత్తిడితో ఇప్పుడు తప్పని సరి అయ్యింది.

కులగణన చేయడం బీజేపీ సిద్ధాంతానికి వ్యతిరేకం. బీజేపీ సిద్ధాంతం మత గణన. మతాల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీ అజెండా. కులగణన చేస్తే మత గణన కి ఇబ్బంది. ఇందుకే ఇంతకాలం బీజేపీ కులగణన కు ఒప్పుకోలేదు. రాహుల్ పోరాటంతో బీజేపీ దిగి వచ్చింది. కులగణన కి తెలంగాణ, కర్ణాటక ఆదర్శం. ఈ రాష్ట్రాలను ఆదర్శంగా తీసుకొని దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. దీంతో బీజేపీ దిగి వచ్చింది. రాజకీయ ఒత్తిడితో తలదించుకుంది. కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వెంటనే కులగణన పై టైమ్ బాండ్ కావాలి. రిజర్వేషన్ల పరిమితి పై చర్చ జరగాలి. కులగణన ఫార్మాట్ ఎలా ఉంటుందో బయట పెట్టాలి.

బీజేపీ వాళ్లు కౌరవులు
బీజేపీ వాళ్ళు నన్ను గాంధారి అంటే… బీజేపీ వాళ్లను నేను కౌరవులు అంటా. బీజేపీ వాళ్ళు నిజంగా కౌరవులతో సమానమే. ఈ రాష్ట్రానికి మోడీ ఏం చేశాడో చెప్తే నేను గాంధారి అని ఒప్పుకుంటా. ఎటు చూసినా అన్యాయమే. ఒక్క మేలు జరగలేదు. ప్రత్యేక హోదా మోసమే, పోలవరం ప్రాజెక్టుకు అన్యాయమే. కడప స్టీల్ లేదు..విశాఖ స్టీల్ కి దిక్కులేదు. విభజన హామీలు అన్ని మోసం చేసి..ఇప్పుడు అమరావతికి అండగా ఉంటాం అంటే నమ్మాలా? అందుకే బీజేపీ వాళ్ళు కౌరవులు.’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి: Sharmila fire: జగన్‌పై మరోసారి విరుచుకుపడ్డ షర్మిల.. అదానీతో ముడిపెడుతూ..
Sharmila: సాయిరెడ్డికి షర్మిల కౌంటర్.. మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా?
YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ

ట్యాగ్స్: , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.