Sharmila fire: ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి తన సోదరుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. అదానీ రూ.1750 కోట్ల లంచం నాటి ముఖ్యమంత్రి జగన్ కు ముట్టజెప్పిన కేసులో అటు దేశం పరువు, ఇటు రాష్ట్రం పరువే కాకుండా తమ కుటుంబం పరువు కూడా తీశారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్ లో ఆమె (Sharmila fire) మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆమె ఏమన్నారో పూర్తి వివరాలు ఇవీ..
‘‘నిన్న ద జస్టిస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ యూఎస్ఏ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ కమిషన్.. ఈ రెండు అమెరికన్ ఏజెన్సీలు గౌతమ్ అదానీ అండ్ కో మీద కొన్ని అభియోగాలు చేశాయి. గౌతమ్ అదానీ అండ్ టీమ్ కొన్ని అగ్రిమెంట్లు చేసుకున్నారు. భారత దేశంలో పవర్ సప్లయ్ చేసే అగ్రిమెంట్లు చేసుకోవడానికి కొంత మంది, కొన్ని రాష్ట్రాలకు చెందిన టాప్ ర్యాంకింగ్ అఫీషియల్స్ అంటే టాప్ పర్సన్స్.. కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలంలో ఉన్న అధికారులకు, ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో రూ.2,100 కోట్లు లంచాలు ఇచ్చినట్టు, అందులో 86 శాతం 1,750 కోట్లు ఏపీ ముఖ్యమంత్రికి జగన్ మోహన్ రెడ్డి గారికి, పేరు ఒక్కటే చెప్పలేదు. ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. ఇందులో పేరు ఒక్కటే చెప్పలేదు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ స్వయంగా కలిసి పవర్ సప్లయ్ అగ్రిమెంట్ కోసం మీకు ఏమి ఇవ్వాలి అని అడిగారు. ఏమి ఇస్తే ఏమి చేస్తే గవర్నమెంట్ వైపు నుంచి సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్లు క్లియర్ గా పేర్కొన్నారు. (Sharmila fire)
ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్లకు ఆధారాలు ఉన్నట్లు క్లాస్ నంబర్ 82 కింద అభియోగాలు మోపారు. ఫారెన్ అఫిషియల్ నంబర్ వన్ అన్న సింగిలర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్ కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగిందని స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది, గౌతమ్ అదానీ మీద అరెస్టు వారెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసులు పెట్టడంలో జగన్ మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదంటే, జగన్ మోహన్ రెడ్డి గారు డైరెక్టుగా అమెరికన్స్ కి ఇంటరెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి.
గౌతమ్ అదానీ గారు అయితే అమెరికాలో ఇన్వెస్ట్ మెంట్ రేస్ట్ చేయాలి అనుకున్నాడు కాబట్టి, అక్కడి వాళ్లు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద, ఆయన కంపెనీ మీద ఎంక్వైరీ చేస్తే తేలిన విషయం ఇది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకుని పవర్ సప్లయ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి గారికి 1750 కోట్లు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. అగ్రరాజ్యమైన అమెరికా ఈ విషయం బయట పెడితే తప్ప అసలు మన దేశంలో మన రాష్ట్రంలో ఇది జరుగుతోందని ఇంత వరకు బయట పడలేదుక అంటే ఇది ఎంత అవమానకరం.
అంటే మన దేశంలో ఉన్న సీబీఐ అయినా, ఈడీ అయినా, సెబీ అయినా ఇన్ కమ్ ట్యాక్స్ డిపార్ట్ మెంట్లు అయినా ఇవన్నీ ఏం చేస్తున్నట్టు? ఇవన్నీ ఏవీ బయట పెట్టని విషయాలు ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్లు బయట పెట్టారంటే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశంలో అవినీతి గురించి చర్చ జరుగుతోందంటే ఇది అవమానం కాదా? అదానీ గారు దేశం పరువు తీస్తే జగన్ మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర పరువు తీశారు. జగన్ మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. కేవలం మీకు ఒక్క డీల్ లో వచ్చిన లంచం రూ.1750 కోట్లు అంటున్నారు. ప్రజలకు ఎంత భారంగా మారుతుందో ఒకసారైనా ఆలోచించలేకపోయారా? (Sharmila fire)
1700 కోట్ల రూపాయలు సోలార్ విద్యుత్ లో లంచం అయితే, 17 వేల కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన విద్యుత్ భారం పడుతుంది. రెండింటికీ కనెక్షన్ ఉందని నేను అనడం లేదు. కానీ ఈరోజు సినారియో చూడండి. 1700 కోట్లేమో జగన్ మోహన్ రెడ్డి గారికి లంచం వచ్చిందని మాట్లాడుతున్నాం. మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన అప్పుల వల్ల డిస్కంలకు నష్టం వచ్చి 17 వేల కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద కరెంటు బిల్లుల భారం మోపబోతోంది చంద్రబాబు గవర్నమెంట్ అని మేము పగలనక, రాత్రనక లాంతర్లు పట్టుకుని ప్రజల కోసం పోరాడాం. రెండింటికీ కనెక్షన్ లేకపోయినా జరుగుతున్న వాస్తవం ఇది.
ఇలాంటి డీల్ చేసుకుంటే ఆఖరికి ప్రజల మీదే భారం పడుతుంది. ఈ డీల్ లో కాకపోయినా, ఇంకో సారి అయినా 25 సంవత్సరాలకు గానూ ఈ డీల్ కుదుర్చుకున్నారంటే ఆ భారమంతా ప్రజలపైనే. ఇదెక్కడి న్యాయం అని అడుగుతున్నా. జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చే లంచాల కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలను తాకట్టుపెట్టినట్టు కాదా? యూనిట్ ధర పక్క రాష్ట్రాలకు అదే అదానీ పవర్ యూనిట్ 1.90 పైసలకు అగ్రిమెంట్ చేసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం రూ.2.49కి అగ్రిమెంట్లు చేసుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారంటే కేవలం ఈయనకు లంచాలు ఇచ్చినందుకే కదా. ఈయనకు లంచాలు ఇస్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెట్టడానికి సిద్ధం.
యూనిట్ కు ఇంత ఎక్సస్ గా ఇస్తే.. ప్రజలపైనే భారం పడుతుంది. ఇలా ఎక్సస్ గా ఇచ్చినందుకు 25 ఏళ్ల కాలానికి రూ.లక్ష కోట్లు భారం ప్రజలపై పడబోతోంది. ఇది అన్యాయం కాదా? నీకు ఒక్క డీల్ లో వచ్చే లంచం కోసం ప్రజలను, డిస్కాంలను తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఇంత అవినీతి పరుడని ఒక చర్చ జరుగుతుంది అంటే..ఇది ఆయన కుటుంబానికి మాత్రమే అవమానం కాదు? ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా అవమానం. మన దేశానికి కూడా అవమానం. ఇంకెక్కడుంది క్రెడిబులిటీ? ఐదేళ్లు మీకు ప్రజలు బంగారు అవకాశం ఇస్తే.. మీరు అన్ని రకాలుగా దుర్వినియోగం చేశారు. రూ.1750 కోట్ల కోసం దేశంలోనే కాదు. అమెరికాలో కూడా మీ రిప్యుటేషన్ ను తాకట్టు పెట్టడం పై జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసుకోవాలి.
ఒక్క సోలార్ ఎనర్జీ కోసం రూ.1750 కోట్లు లంచం తీసుకున్నారు.. ఇదొక్కటే కాదు..గౌతమ్ అదానీగారి కోసం జగన్ గారు ఎన్ని డీల్స్ చేయలేదు. ఎంత లంచం వచ్చి ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ఎంక్వైరీలు.. గంగవరం పోర్టులో ప్రభుత్వం వాటా 10 శాతం అయితే.. 30 ఏళ్లలో తిరిగి ప్రభుత్వం చేతికి రావాలన్నది వైయస్సార్ గారి ఆకాంక్ష. కానీ రూ. 9 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ వాటాను కేవలం రూ.640 కోట్లకు అప్పనంగా అమ్మేశారు. గంగవరం పోర్టులో మీకు ఎంత లంచం వచ్చిందో జగన్మోహన్ రెడ్డిగారు చెప్పాలి. కృష్ణపట్నం పోర్టు.. ఒత్తిడి చేసి, భయపెట్టి.. అదానీ వాళ్లు ఏ ధర నిర్ణయిస్తారో ఆ ధరకే జెన్ కో కూడా కరెంట్ ను విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. జెన్ కో ప్రైస్ ను నిర్ణయిస్తుంది కూడా అదానీగారు.
డేటా సెంటర్.. 40 వేల ఉద్యోగాలు వస్తాయని అదాని గారు చెప్పారు. అన్ని ఉద్యోగాలు వస్తాయా అండి. బీచ్ శాండ్ మైనింగ్ మొత్తం అదానీగారికే.. విశాఖలో సబ్ మెరైన్ డీల్.. వీటికి ఎంత లంచం వచ్చింది? ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక బ్లాంక్ చెక్ గా అదానీ రాసిచ్చేశారు జగన్మోహన్ రెడ్డిగారు.. ఎంక్వైరీలు జరగాల్సిన అవసరం లేదా? 25 ఏళ్లకు చేసిన ఈ పవర్ డీల్ ను రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ చంద్రబాబుగారిని డిమాండ్ చేస్తోంది. అదానీగారి ఏపీలో కూడా బ్లాక్ లిస్ట్ చేయాల్సిన అవసరం ఉంది.
అదానీ, జగన్మోహన్ రెడ్డిగారు చేసుకున్న అన్ని డీల్స్ పై ఎంక్స్వైరీ చేసి అవసరమైతే వాటిని రద్దు చేయాలి.అదానీపై ఎన్ని ఆరోపణలు వచ్చినా ఒక్కసారి కూడా మోడీ గారు చర్య తీసుకోలేదు. అమెరికాలోని సెక్యూరీటీస్ ఎక్స్ ఛేంజ్ కమిషన్ అదానీగారు అవినీతి చేశారని స్పష్టం చేసిన తర్వాత కూడా అదానీపై చర్యలు తీసుకోకపోవడం చూస్తే.. మోడీగారు అవినీతిలో కూరుకుపోయారని ప్రజలకు స్పష్టంగా అర్థం అవుతోంది.
గౌతమ్ అదానీ గత పది పదిహేను ఏళ్లలో ఎంతగా ఎదిగారో దేశం చూశాం. ఎందుకంటే.. మోడీగారు అండగా ఉన్నారు కాబట్టి. ఆయనపై దేశంలోని ఏజెన్సీలు ఒక్క చర్య కూడా తీసుకోలేదు. మోడీగారూ.. భారత్ కు అమెరికాకు ట్రీటీ ప్రకారం ఏ దేశంలోనైనా క్రైంకు పాల్పడితే వారిని ఎక్సిడైట్ (అక్కడికి ఎంక్వైరీ కమిటీ వెళ్లి విచారణ) అన్నా చేయాలి లేదా ఇక్కడే ప్రాసిక్యూట్ అయినా చేయాలి.. ట్రీ టీ ప్రకారం మోడీ గారు ఏం చేస్తారో ప్రజలు చూస్తున్నారు.
మోడీ తాము దేశానికే కాపలా కుక్కలం అని చెబుతున్నారు. కానీ అవి మాటలకే పరిమితం. మోడీ అండవల్ల ఇంత పెద్ద పెద్ద వాళ్లే అవినీతి చేసి బయటపడుతుంటే.. దేశం ఎలా బాగుపడుతుంది. చంద్రబాబు గారికి లంచాలు వచ్చి ఉంటే.. అవినీతి చేసి ఉంటే..జగన్మోహన్ రెడ్డిగా అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ఎంక్వైరీ వేయలేదు.. అప్పుడు ఏం గాడిదలు కాశారు. ఈ రోజు మీ గురించి కాకుండా చంద్రబాబు గురించి మాట్లాడేవాళ్లం కదా? ఎవరు పెట్టొద్దన్నారండీ?’’ అని షర్మిల తన ప్రసంగం ముగించారు.
ఇవీ చదవండి: Sharmila: సాయిరెడ్డికి షర్మిల కౌంటర్.. మీ బిడ్డలపై ప్రమాణం చేయగలరా?
YS Sharmila: షర్మిల కంట తడి.. అన్నపై హాట్ కామెంట్స్.. దౌర్భాగ్యుడు, శాడిస్ట్ అంటూ… పూర్తి ప్రసంగం ఇదీ
Sharmila: కరెంటు చార్జీల భారం ఉపసంహరించుకోవాలి
