మంగళవారం, 22 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
International

16 worst countries : నివసించడానికి అత్యంత కష్టమైన 16 దేశాలు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: సోమవారం, 1 సెప్టెంబర్ 2025

16 worst countries : ప్రపంచంలో ప్రతి దేశానికీ ప్రత్యేకమైన సవాళ్లు ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లో పరిస్థితులు అంత తీవ్రంగా ఉంటాయి కాబట్టి అక్కడ ప్రజలు సురక్షితంగా, గౌరవప్రదంగా జీవించడం కష్టమవుతుంది. పేదరికం, యుద్ధాలు, ఉగ్రవాదం, నియంత్రణ పాలన, సహజ విపత్తులు, మహిళలపై ఆంక్షలు, మైనారిటీలపై హింస వంటి అనేక సమస్యలు ప్రజల రోజువారీ జీవితాన్ని నరకయాతనలా మార్చేస్తున్నాయి. వరల్డ్ లో నివసించడానికి అత్యంత కష్టమైన 16 దేశాలపై ఒకసారి చూద్దాం. (16 worst countries)

1. బంగ్లాదేశ్
పేదరికం, జనాభా అధికం, వరదలు, తుఫానులు వంటి సహజ విపత్తులు బంగ్లాదేశ్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. హిందువులు సహా మైనారిటీలు వివక్ష, హింసకు గురవుతున్నారు.

2. పాకిస్తాన్
ఉగ్రవాదం, అస్థిరత, పేదరికం పాకిస్తాన్‌ను ప్రమాదకర దేశంగా నిలిపాయి. ఉసామా బిన్ లాడెన్ వంటి ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఉంది. మైనారిటీలు బలవంతపు మతమార్పిడి, హింసకు గురవుతున్నారు.

3. ఆఫ్ఘానిస్తాన్
తాలిబాన్ పాలన తిరిగి రావడంతో మహిళలు తమ ప్రాథమిక హక్కులను కోల్పోయారు. విద్య, ఉపాధి అవకాశాలు దాదాపు లేకుండా పోయాయి. ఉగ్రవాదం, పేదరికం, ఆకలితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.

4. యెమెన్
దీర్ఘకాలిక గృహయుద్ధం వల్ల యెమెన్‌లో మానవతా విపత్తు నెలకొంది. లక్షలాది మంది ఆకలి, కాలరా వ్యాధులతో బాధపడుతున్నారు. వైద్య సదుపాయాలు, తాగునీరు దొరకడం కష్టమైపోయింది.

5. ఉత్తర కొరియా
ప్రపంచంలోనే అత్యంత నియంత్రిత దేశం. ప్రజలకు మాట స్వేచ్ఛ లేదు, ఆహార కొరత, కఠిన శిక్షలు, సమాచార నియంత్రణతో జీవితం బానిసత్వంలా ఉంటుంది.

6. దక్షిణ సూడాన్
ప్రపంచంలోనే కొత్త దేశం అయినా, గృహయుద్ధాలు, కుల హింస, కరువు దేశాన్ని కుదిపేశాయి. నీరు, విద్య, వైద్యం లాంటి ప్రాథమిక వసతులు దాదాపు లేవు.

7. హైటి
పేదరికం, తుఫానులు, భూకంపాలు, రాజకీయ అస్థిరతతో హైటి ప్రజలు తీవ్ర కష్టాలు పడుతున్నారు. గ్యాంగ్ హింస ఎక్కువగా ఉంది.

8. సిరియా
పదేళ్లుగా కొనసాగుతున్న గృహయుద్ధం దేశాన్ని శిథిలాలుగా మార్చింది. లక్షలాది మంది శరణార్థులుగా జీవిస్తున్నారు. పాఠశాలలు, ఆసుపత్రులు ధ్వంసమయ్యాయి.

9. సోమాలియా
అల్-షబాబ్ వంటి ఉగ్రవాద గ్రూపుల దాడులు, కరువు, రాజకీయ గందరగోళం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నియంత్రణ కూడా బలహీనంగానే ఉంది.

10. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
రెబల్ దాడులు, పేదరికం, ఆహార కొరత ఈ దేశాన్ని అత్యంత వెనుకబడిన దేశాలలో ఒకటిగా మార్చాయి.

11. సూడాన్
2023లో ప్రారంభమైన సైనిక వర్గాల యుద్ధం దేశాన్ని చీల్చేసింది. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. వైద్య, ఆర్థిక వ్యవస్థ కూలిపోయింది.

12. కాంగో ప్రజాస్వామ్య గణరాజ్యం
సహజ వనరులు ఉన్నా, తిరుగుబాటు దళాల హింస, లైంగిక దాడులు, ఎబోలా వంటి వ్యాధులు ప్రజల జీవితం కష్టతరం చేస్తున్నాయి.

13. క్యూబా
ఒకే పార్టీ పాలన, మాట స్వేచ్ఛ లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, వస్తువుల కొరత వల్ల ప్రజలు వలసలు వెళ్ళే పరిస్థితి.

14. ఎరిత్రియా
“ఆఫ్రికా ఉత్తర కొరియా”గా పిలిచే ఈ దేశంలో డిక్టేటర్ పాలన, నిర్బంధం, బలవంతపు సైనిక సేవ, స్వేచ్ఛల లేమి ఉంది.

15. బురుండి
తీవ్ర పేదరికం, రాజకీయ అణచివేత, అవినీతి, తాగునీరు, వైద్యం వంటి ప్రాథమిక సదుపాయాల కొరత.

16. ఇరాన్
కఠినమైన ఇస్లామిక్ పాలన, ప్రజాస్వామ్యం లేకపోవడం, మహిళలపై ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందులు ప్రజలను బాధిస్తున్నాయి.

ఇవీ చదవండి: Heart Attack : దేశంలో 30 శాతం పెరిగిన గుండెపోటు జబ్బు.. ఎందుకిలా?
US stopped nuclear conflict : భారత్-పాక్ యుద్ధాన్ని ఆపాం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Iran Israel War : ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. నేపథ్యం, జీ7 దేశాల ప్రకటన

ట్యాగ్స్: , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading