బుధవారం, 16 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Andhra Pradesh

Water problem: ఎన్టీఆర్‌ జిల్లాలో తాగునీటి సమస్యపై కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు

Keerthanaa News Deskప్రచురణ తేదీ: శనివారం, 13 ఏప్రిల్ 2024

Water problem: వేసవి కాలం కారణంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ముఖ్యంగా తాగునీరులేక చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తోంది.

ప్రస్తుత వేసవి సీజన్ లో తాగునీటి ఎద్దడి నివారణకు అవసరమైన ముందస్తు చర్యలు తీసుకున్నామని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజినీర్ డి.వెంకట రమణ తెలిపారు. విజయవాడ ఆర్ డబ్ల్యూ ఎస్ పర్యవేక్షక ఇంజినీర్ కార్యాలయంలో తాగునీటిపై ” కంట్రోల్ రూమ్ ” ఏర్పాటు చేశామని అయన తెలిపారు.

జిల్లా పరిధిలో తాగు నీటి సమస్యలపై ప్రజలు ఈ కంట్రోల్ రూమ్ నకు ఫిర్యాదు చేసిన వెంటనే తగు చర్యలు చేపట్టి తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రతీ రోజూ ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ ఈ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని పర్యవేక్షక ఇంజినీర్ మరియు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.

తాగునీటి సమస్యలపై ప్రజలు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ నేరుగానే టెలిఫోన్ ద్వారా తమ ఫిర్యాదులు చేయవచ్చునన్నారు. ఎటువంటి తాగునీటి సమస్యలు ఉన్నా ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఇ డి. వెంకట రమణ – 9100121300, సిబ్బంది జి. పద్మజ – 9100121306, ఎల్ పి ఎస్ ఆర్. కృష్ణ – 6304990363, ఎం. బాలచంద్ర – 9989206318 నెంబర్లకు తమ ఫిర్యాదులు తెలియజేయవచ్చునన్నారు.

ఇవీ చదవండి:Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం-ఓడరేవులపై సీఎస్ జవహర్‌రెడ్డి సమీక్ష
Electricity supply: మెరుగైన రీతిలో విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలి
Veligonda Project: ఇది దేవుడి స్క్రిప్టే.. వెలిగొండను జాతికి అంకితం చేయడంపై వైయస్సార్‌ను గుర్తు చేసుకున్న సీఎం జగన్‌

ట్యాగ్స్: , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading