సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Life Style

MRP : ఎమ్మార్పీ ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారా? ఇలా చేయండి

Keerthanaa News Deskప్రచురణ తేదీ: గురువారం, 3 అక్టోబర్ 2024

MRP : రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, మరికొన్ని ప్రాంతాల్లో దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూలు చేస్తుంటారు. దీనివల్ల వినియోగదారులు నష్టపోతారు. అయితే భారత ప్రభుత్వ చట్టాల ప్రకారం వ్యాపారి ఎక్కువగా వసూలు చేస్తే, వారి నుంచి డబ్బు తిరిగి పొందే వీలుంది.

మాగ్జిమం రిటైల్ ప్రైస్ అనేది ఒక వస్తువు లేదా సేవ కోసం చిల్లర వ్యాపారి చట్టబద్ధంగా ఛార్జ్ చేయగల గరిష్ఠ మొత్తం. ఈ ధరను తయారీదారులు లేదా విక్రేతలు నిర్ణయిస్తారు. వీరు ఉత్పత్తి ఖర్చులు, మార్కెటింగ్ కాస్ట్స్, ప్రాఫిట్ మార్జిన్‌ను పరిగణనలోకి తీసుకుని MRPని నిర్ణయిస్తారు. ఎంఆర్పీని మామూలుగా ప్రొడక్ట్ లేబుల్ లేదా ప్యాకేజింగ్‌పై ప్రింట్ చేస్తారు. ఇందులోనే అన్ని ట్యాక్సులు ఇంక్లూడ్ చేస్తారు.

ప్రశ్నించాలి
ఎందుకు ఎక్కువ ధర వసూలు చేస్తున్నారో దుకాణదారుడిని అడగవచ్చు. బిల్లును చూపించి, MRP ధరను సూచించవచ్చు. చాలా సందర్భాలలో, దుకాణదారులు తప్పును గుర్తించి సరైన ధర వసూలు చేస్తారు. దుకాణదారుడు ఎక్కువగానే వసూలు చేస్తా అని మొండిగా వ్యవహరిస్తే రాష్ట్రంలోని సంబంధిత లీగల్ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.

ఎక్కువ ధర వసూలు చేస్తే?
భారతదేశంలో 2009 లీగల్ మెట్రాలజీ చట్టం ప్యాక్ చేసిన వస్తువుల అమ్మకాలను నియంత్రిస్తుంది, చట్ట ప్రకారం, ప్రొడక్ట్ లేబుళ్లపై లేదా ప్యాకేజింగ్‌పై ఎంఆర్పీ స్పష్టంగా ప్రింట్ చేయడం తప్పనిసరి. MRP కంటే ఎక్కువ ధరకు ఉత్పత్తులను విక్రయించడం చట్టవిరుద్ధం, అలా చేసే వారికి జరిమానాలు, ఇతర శిక్షలు విధిస్తారు. కన్జ్యూమర్ గూడ్స్ (మాండేటరీ ప్రింటింగ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ మాగ్జిమం రిటైల్ ప్రైస్) యాక్ట్ 2006 ప్రకారం, ప్రొడక్ట్ ప్యాకేజింగ్‌పై సూచించిన MRP కంటే ఎక్కువ ధరను వ్యాపారులు వసూలు చేయలేరు.

నేషనల్ కన్‌స్యూమర్ హెల్ప్‌లైన్ అనేది ఒక ప్రీ-లిటిగేషన్ స్టేజ్ మాత్రమే అని గమనించాలి. ఈ స్టేజ్‌లో సంబంధిత అధికారులు వ్యాపారులను సంప్రదించడం ద్వారా ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. వినియోగదారు సంతృప్తి చెందకపోతే, వారు తగిన కన్జ్యూమర్ కమిషన్ ద్వారా పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార సంఘం వెబ్‌సైట్, రాష్ట్ర కమిషన్, జిల్లా కమిషన్ అందుబాటులో ఉంటాయి.

ఫిర్యాదు ఎలా చేయాలి?
నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించడానికి టోల్-ఫ్రీ నెంబర్ 1800-11-4000 లేదా 1915కు కాల్ చేయవచ్చు. SMS ద్వారా 8800001915కు ఫిర్యాదు చేయవచ్చు. NCH యాప్ (https://play.google.com/store/apps/details?id=mount.talent.mtcdev02.udaan) లేదా ఉమాంగ్ యాప్ (https://play.google.com/store/apps/details?id=in.gov.umang.negd.g2c) ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చు.

ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడానికి https://consumerhelpline.gov.in/ విజిట్ చేయాలి. ముందుగా వన్-టైమ్‌ రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. అందుకు https://consumerhelpline.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి, లాగిన్ లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను ఎంటర్ చేసి, ఈ-మెయిల్ ద్వారా వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అలా యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ పొందవచ్చు.

నిబంధనలను ఉల్లంఘించిన దుకాణదారుడిపై జరిమానా విధించవచ్చు లేదా శిక్షించవచ్చు, వినియోగదారుడు అధికంగా వసూలు చేసిన మొత్తానికి నష్టపరిహారం పొందే అవకాశం ఉంది.

Read also: MP Avinash Reddy: బాబు వైఖరితో ఈ ఏడాది 750 మెడికల్ సీట్లు కోల్పోయాం: అవినాశ్ రెడ్డి
Tirumala Laddu: నేడు తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ
Nagarjuna Akkineni: కొండా సురేఖపై అక్కినేని నాగార్జున ఆగ్రహం
AP TET: రేపటి నుంచి ఏపీ టెట్.. 4.27 లక్షల మంది అభ్యర్థుల దరఖాస్తు

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading