మంగళవారం, 22 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema, Life Style

Soha ali khan : కొత్త ఏడాదికి ఫిట్‌నెస్ గిఫ్ట్.. హెల్తీ స్టార్ట్‌కు పవర్ డ్రింక్ సీక్రెట్ చెప్పిన సోహా అలీ ఖాన్

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 31 డిసెంబర్ 2025

Soha ali khan : కొత్త ఏడాది అంటే కొత్త రిజల్యూషన్స్… అందులో ముఖ్యమైనది ఫిట్‌నెస్. జిమ్‌లు, కఠినమైన ఎక్సర్‌సైజులు, ఖరీదైన ట్రైనర్లు ఎంత చేసినా… మనం తీసుకునే ఆహారం సరిగా లేకపోతే ఆరోగ్యం అందుకోదు. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేస్తోంది బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్.

47 ఏళ్ల వయసులోనూ ఎనర్జిటిక్‌గా, యంగ్‌గా కనిపించే సోహా… ఫిట్‌నెస్ విషయంలో తనదైన నియమాలను పాటిస్తుంది. సోషల్ మీడియాలో తరచూ వర్కౌట్ వీడియోలు, హెల్తీ లైఫ్‌స్టైల్ టిప్స్ షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు ప్రేరణగా నిలుస్తోంది. తాజాగా న్యూ ఇయర్‌ను హెల్తీగా స్టార్ట్ చేయాలనుకునేవారి కోసం తన స్పెషల్ డిటాక్స్ పవర్ డ్రింక్ రెసిపీని బయటపెట్టింది.

ఏంటీ ఈ ఫిట్‌నెస్ సీక్రెట్ డ్రింక్?
పండుగలు, పార్టీల సీజన్‌లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో అలసట, నీరసం పెరుగుతుంది. అలాంటి సమయంలో శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను తొలగించి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఈ గ్రీన్ పవర్ డ్రింక్ బాగా ఉపయోగపడుతుందని సోహా చెబుతోంది.

ఇది కేవలం బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా,
హార్మోన్ల బ్యాలెన్స్
డైజెషన్ మెరుగుదల
శరీరానికి కావాల్సిన హైడ్రేషన్
లాంటివాటికి కూడా సహాయపడుతుందట.
కావలసిన పదార్థాలు
క్యారెట్ – సగం
దోసకాయ – సగం
సెలెరీ స్టిక్స్ – 2
కొబ్బరి నీళ్లు – పావు కప్పు
రాత్రంతా నానబెట్టిన చియా సీడ్స్ – 1½ స్పూన్లు
డ్రాగన్ ఫ్రూట్ ముక్కలు
కొద్దిగా అల్లం తురుము
కొత్తిమీర
మొలకెత్తిన పెసలు – ఒక పిడికెడు
హెంప్ సీడ్స్ – కొద్దిగా
ఆకుకూరలు (పాలకూర లేదా లెట్యూస్)

తయారీ విధానం
పైన చెప్పిన అన్ని పదార్థాలను బ్లెండర్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరమైతే కొంచెం అదనంగా కొబ్బరి నీళ్లు కలుపుకోవచ్చు. తర్వాత వడకట్టి తాజా జ్యూస్‌లా తీసుకోవాలి.
అల్లం రోగనిరోధక శక్తిని పెంచుతుంటే, కొబ్బరి నీళ్లు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతాయి.

సోహా చెబుతున్న ముఖ్య సూచనలు
ఈ పవర్ డ్రింక్ గురించి సోహా మాట్లాడుతూ—
“ఇది కేవలం డిటాక్స్ డ్రింక్ మాత్రమే కాదు. శరీరానికి అవసరమైన ఫైబర్, పోషకాలు అందిస్తుంది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లేదా లంచ్‌కు ముందు తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉంటుంది. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి” అని చెప్పింది.

ఎప్పుడూ యంగ్‌గా, ఫిట్‌గా కనిపించే ఈ బాలీవుడ్ బ్యూటీ చెప్పిన ఈ సింపుల్ హెల్త్ టిప్‌ను ఫాలో అయితే… 2026ను మనం కూడా ఫిట్‌గా, హ్యాపీగా స్టార్ట్ చేయొచ్చు. ఈ కొత్త ఏడాదికి మీ డైట్‌లో ఈ పవర్ డ్రింక్‌ను తప్పకుండా చేర్చుకోండి!

View this post on Instagram

ఇవీ చదవండి: Exercise: వ్యాయామం చేస్తే శరీరంలో ఎలాంటి మార్పులు చూడొచ్చు? ఏరోబిక్‌తో హెల్తీ లైఫ్‌
Ganga River: భారతదేశంలో లైఫ్‌ లైన్‌ ఆఫ్‌ ఇండియా అని ఏ నదిని పిలుస్తారు?

ట్యాగ్స్: , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading