శనివారం, 19 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Business

Silver Rates: రికార్డులు వరుసగా బద్దలు.. బంగారాన్నే వెనక్కి నెట్టిన వెండి ధరలు!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 14 డిసెంబర్ 2025

Silver Rates: వెండి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తగ్గేదే లేదన్నట్లుగా పరుగులు తీస్తూ, బంగారాన్నే మించి దూసుకెళ్తున్నాయి. వెండి ప్రియులకు ఇది నిజంగా భారీ షాక్ అనే చెప్పాలి. ఒకప్పుడు అందుబాటులో ఉన్న సిల్వర్‌ను ఇప్పుడు చూడడమే కానీ, కొనాలంటే ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే వెండి ధరలు ఆల్‌టైమ్ హై రేట్లను నమోదు చేశాయి.

ఇటీవల కాలంలో వెండి ధరల పెరుగుదల సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది. ముఖ్యంగా ఈ ఒక్క వారంలోనే వెండి రేట్లు చేసిన పరుగులు చూస్తే ‘బాబోయ్’ అనాల్సిందే. ధరలు కొండలా పెరుగుతుండగా, కొనుగోలుదారులు మాత్రం చేతులు కాల్చుకుంటున్నారు.

ఏడాది క్రితం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండేది. అప్పట్లో కిలో వెండి ధర లక్ష రూపాయల లోపలే ఉండేది. కానీ ఇప్పుడు ఆ ధర ఏకంగా రూ.2 లక్షల మార్కును దాటి కొత్త చరిత్ర సృష్టించింది. అంతేకాదు… ఇంకా పెరుగుతూనే ఉంటుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ వెండి ర్యాలీ ఎక్కడ ఆగుతుందో నిపుణులు కూడా అంచనా వేయలేకపోతున్నారు.

బంగారం ధరలు అందుబాటులో లేకపోవడంతో, ‘వెండితో అయినా సరిపెట్టుకుందాం’ అనుకున్నవారికి ఇప్పుడు సిల్వర్ పెద్ద షాక్ ఇస్తోంది. దేశీయంగా వెండి ధరలు సరికొత్త జీవనకాల గరిష్టాన్ని నమోదు చేయడంతో, పసిడి కూడా వెండి ముందు వెలవెలబోతున్న పరిస్థితి నెలకొంది.

ఏడాది వ్యవధిలో రెట్టింపు ధర
గత ఏడాది డిసెంబర్‌లో వెండి ధరల పెరుగుదల మొదలైంది. మధ్యలో స్వల్ప విరామాలు తప్ప, ఎక్కడా ఫుల్‌స్టాప్ లేకుండా సిల్వర్ రేట్లు పరుగులు తీస్తున్నాయి.
2024 డిసెంబర్ 31న కిలో వెండి ధర: రూ. 89,700
తాజా రేటు: రూ. 2.15 లక్షల మార్కు దాటింది

అంటే ఏడాది వ్యవధిలోనే వెండి ధరలు 100 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. అంతేకాదు, గత 5 రోజుల్లోనే రూ. 19,100 మేర వెండి ధర పెరగడం గమనార్హం.

ఫెడ్ కోతలు, రూపాయి పతనం ప్రభావం
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల కోతలు, రూపాయి విలువ పతనం వెండి ధరలకు రెక్కలు తెచ్చాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు డాలర్ బలహీనత కూడా సిల్వర్ ర్యాలీకి ప్రధాన కారణంగా మారింది. మరోవైపు, ఇండస్ట్రియల్ డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలకు అదుపు లేకుండా పోయింది.

ధరలు ఈ స్థాయిలో పెరగడంతో వెండి అమ్మకాలు సుమారు 10 శాతం వరకు తగ్గిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. అయినప్పటికీ, భవిష్యత్తులో వెండి ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో వెండి కొనాలనుకునే వారు అయోమయంలో పడుతున్నారు.

ఇవీ చదవండి: Gold Rate Today: తిరిగి రెట్టించిన వేగంతో పెరుగుతున్న బంగారం ధరలు – హైదరాబాద్‌లో తాజా రేట్లు ఇవే
Bank of England : బంగారం కింద దాగి ఉన్న లండన్ వీధి రహస్యం.. రోజూ టన్నుల బంగారంపై కార్లు, బస్సులు!

ట్యాగ్స్: , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading