సోమవారం, 19 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Tollywood: 47 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. 50 ఏళ్లకు తండ్రికాబోతున్న స్టార్ హీరో

Keerthanaa News Deskప్రచురణ తేదీ: ఆదివారం, 30 నవంబర్ 2025

Tollywood: బాలీవుడ్ నటుడు రణ్‌దీప్ హుడా మరియు నటి లిన్ లైశ్రామ్ ఈ నవంబర్ 29న తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని ప్రత్యేకంగా మార్చుతూ, రణ్‌దీప్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. తన భార్యకు యానివర్సరీ విషెస్ చెప్పడమే కాకుండా, మరో శుభవార్తను కూడా అభిమానులతో పంచుకున్నాడు — తాను తండ్రి కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించాడు.

ప్రస్తుతం లిన్ లైశ్రామ్ గర్భవతిగా ఉన్నారని వెల్లడించిన రణ్‌దీప్, ఇద్దరూ కలిసి చెట్ల మధ్య కాచుకుంటూ ఉన్న ఫోటోకు “రెండేళ్ల ప్రయాణం… ఇప్పుడు మా ఇంట్లోకి ఓ బుజ్జి పాపాయి రాబోతోంది” అని క్యాప్షన్ జత చేశాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

రణ్‌దీప్ హుడా కెరీర్ గ్లింప్స్
టాలెంటెడ్ నటుడిగా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రణ్‌దీప్,
రిస్క్, లవ్ కిచిడీ, జన్నత్ 2, హీరోయిన్, మర్డర్ 3, హైవే, సుల్తాన్, లవ్ ఆజ్ కల్, భాగీ 2 వంటి చిత్రాల్లో నటించి మెప్పించాడు.
అలాగే స్వతంత్ర వీర్ సావర్కర్ చిత్రంలో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మూడు పాత్రలు పోషించాడు.

తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన సుపరిచితుడే. ఇటీవల గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన జాట్ సినిమాలో రణ్‌దీప్ విలన్‌గా నటించి, “రణతుంగ” పాత్రతో తెలుగు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు.

View this post on Instagram

ఇవీ చదవండి: Spirit Movie: ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో మరో సర్‌ప్రైస్ స్టార్ హీరో?
Bollywood : రాత్రికి రమ్మని ఒత్తిడి చేశారు.. బడా హీరోలతో అలా చేసేందుకు ఒప్పుకోలేదన్న స్టార్ హీరోయిన్

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading