HomeCinemaSpirit Movie: ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో మరో సర్‌ప్రైస్ స్టార్ హీరో?

Spirit Movie: ప్రభాస్ – సందీప్ రెడ్డి వంగా కాంబోలో మరో సర్‌ప్రైస్ స్టార్ హీరో?

Spirit Movie: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్నారు. అతని తాజా సినిమా ‘ది రాజా సాబ్’ విడుదలకు సిద్ధమవుతుండగా, ఇక మరో భారీ ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ చిత్రీకరణ కూడా అధికారికంగా మొదలైంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవలి ముహూర్తం కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ‘స్పిరిట్’ తారాగణం ఎంపిక జరుగుతోంది. పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రముఖ నటీనటులను తీసుకోవడానికి యూనిట్ ప్రణాళికలు వేస్తోంది.

ఇప్పటికే బాలీవుడ్ నటిని తృప్తి దిమ్రీ హీరోయిన్‌గా ఖరారు చేశారు. ఆమెతో పాటు వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇంతటితో ఆగకుండా మరో స్టార్ హీరోను కూడా ఈ భారీ ప్రాజెక్ట్‌లో చేర్చుతున్నారనే వార్తలు హాట్ టాపిక్‌గా మారాయి.

అతడే మరెవరో కాదు — ‘యానిమల్’ హీరో, బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్. సమాచారం ప్రకారం రణ్‌బీర్ కపూర్ ఈ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నాడట. ప్రభాస్–రణ్‌బీర్ ఒకే సినిమాలో కనిపించడం ఇదే మొదటిసారి కావడంతో అభిమానుల్లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏర్పడ్డాయి.

సందీప్ రెడ్డి వంగా–రణ్‌బీర్ కపూర్ సాన్నిహిత్యం యానిమల్ సమయంలో పెరిగిన సంగతి తెలిసిందే. ఆ స్నేహమే రణ్‌బీర్‌ను ఈ ప్రాజెక్ట్‌కు రప్పించి ఉండొచ్చన్న ఊహాగానాలు ఉన్నాయి. ఇక దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.

ఇవీ చదవండి: Spirit : తగలబెట్టేస్తారా..? అదే.. రికార్డులు.. స్పిరిట్ లేటెస్ట్ అప్‌డేట్స్!
Spirit : స్పిరిట్.. ప్రభాస్-త్రిప్తి డిమ్రి రొమాంటిక్ సీన్స్.. పవర్‌ఫుల్ పోలీస్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు