గురువారం, 17 సెప్టెంబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

OTT Movie : OTTలో దుమ్మురేపుతున్న మూవీ: మగాళ్లు మాత్రం మిస్ అవ్వకూడదు! తెలుగు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోన్న సెటైరికల్ డ్రామా

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 3 డిసెంబర్ 2025

OTT Movie : ప్రస్తుతం ఓటీటీలో ఒక సినిమా అస్సలు ఊహించని స్థాయిలో దుమ్మురేపుతోంది. ప్రత్యేకమైన కథ, జీవితానికి దగ్గరైన డ్రామా, కరెక్ట్ డోస్‌లో కామెడీ — ఇవన్నీ కలిపి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. విడుదలైన కొద్ది రోజులకే ఈ మూవీ ఓటీటీ టాప్ ట్రెండింగ్ లిస్టులో నిలుస్తోంది.

భార్య–భర్తల మధ్య చిన్నచిన్న ఇగో సమస్యలు ఎలా పెద్ద డ్రమాగా మారుతాయో, చుట్టుపక్కల వాళ్ల ‘అనవసర సలహాలు’ ఎలా పెట్రోల్ పోస్తాయో ఈ సినిమా అద్భుతంగా చూపించింది. ముఖ్యంగా అసలైన ఫెమినిజం vs సూడో ఫెమినిజం మధ్య తేడాను కళ్లకు కట్టినట్లు చూపించిన తీరు ప్రత్యేక ఆకర్షణ.

కథ ఏంటి?
కథ శివ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చుట్టూ తిరుగుతుంది. పెద్దల నిర్ణయంతో శక్తిని పెళ్లి చేసుకుంటాడు. మొదటి నెల రోజులు కలసి బాగానే జీవితం సాగించినా… ఆ తర్వాత చిన్న చిన్న విషయాలే పెద్ద పెద్ద గొడవలకు దారి తీస్తాయి. ఇగో, అప్రయత్న అపార్థాలు, బాహ్య ప్రభావాలు — ఏటా తిరిగేసరికల్లా విషయంలో అంత దూరం వెళ్తాయి అంటే… ఇద్దరూ తల్లిదండ్రులకు కూడా చెప్పకుండా విడాకులు నిర్ణయించుకునే స్థితికి చేరిపోతారు.

కోర్టు మెట్లెక్కిన ఈ దంపతులు చివరకు ఏ నిర్ణయం తీసుకున్నారు? ఒకరినొకరు అర్థం చేసుకున్నారా? లేక విడాకులతోనే తమ ప్రయాణం ముగించారా? అనేదే కథ మిగతా భాగం.

తెలుగులోకి వచ్చిన హిట్ తమిళ మూవీ
ఇటీవల తెలుగు ప్రేక్షకుల కోసం డిజిటల్‌గా విడుదలైన ఈ చిత్రం అసలు తమిళ టైటిల్ “Aan Paavam Pollathathu”.
రెండు సంవత్సరాల క్రితం విడుదలైన “ஜோ (Joe)”తో మంచి పేరు సంపాదించిన
రియో రాజ్, మాళవిక మనోజ్ ఈ చిత్రంలో మళ్లీ జంటగా అలరించారు.

అక్టోబర్ 31న తమిళనాడులో విడుదలైన ఈ రొమాంటిక్ & సెటైరికల్ కామెడీ తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ సొంతం చేసుకుంది.
బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టిన తర్వాత, ఇప్పుడు జియో–హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ముఖ్యంగా Gen Z తప్పనిసరిగా చూడాల్సిన ‘మస్ట్ వాచ్’ చిత్రంగా ప్రేక్షకులు ఫుల్ రికమెండ్ చేస్తున్నారు.

ఎక్కడ చూడాలి?
✔ Jio + Hotstar
✔ Available in Tamil & Telugu

ఇవీ చదవండి: OTT Movies This Week: 20+ కొత్త రిలీజ్‌లు… ఆ రెండు మాత్రం ఏ మాత్రం మిస్ అవ్వకండి!
OTT Movies : నవంబర్ చివరి వారం: థియేటర్‌, ఓటీటీలో ప్రేక్షకులను అలరించబోయే కొత్త మూవీస్

ట్యాగ్స్: , , , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading