Owl Eyes: సాధారణంగా గుడ్లగూబను (Owl Eyes) చూడాలంటే చాలా మంది కాస్త భయపడుతుంటారు. అయితే, వాస్తవానికి గుడ్లగూబను చూడటం (Owl Eyes) వల్ల చాలా ఉపయోగాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. రోజూ గుడ్లగూబను చూడటం వల్ల అత్యంత తెలివైన వారిగా మారతారని, నాలెడ్జ్ పెరుగుతుందని చెబుతున్నారు. మనుషుల్లో విజ్ఞానాన్ని పెంచే సామర్థ్యం గుడ్లగూబల్లో ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నారు. ఈ కారణంగా గుడ్లగూబ ఫొటోను రోజూ చూడాలని సూచిస్తున్నారు.
గుడ్లగూబ ఫొటోను ఓ పది నిమిషాల పాటు తదేకండా చూడాలి. తర్వాత ఈ ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారుతుందని చెబుతున్నారు. ప్రపంచంలో ప్రతీదీ నిశితంగా, ఏకాగ్రతతో చూడటం మొదలవుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుడ్లగూబ కళ్లు గుండ్రంగా, సూటిగా ఉంటాయి. మనం ఆ కళ్లను తదేకంగా చూడటం వల్ల ప్రతీదీ తదేకంగా చూడటం అలవాటవుతుందట. అందువల్ల మిగతా వారి కంటే మనం లోతుగా చూడగలమని చెబుతున్నారు.
గుడ్లగూబ ఫొటోను రోజూ ఓ పది నిమిషాలు చూడటం వల్ల మనుషుల్లో విజ్ఞానం పెరుగుతుందని చెబుతున్నారు. గుడ్లగూబ కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం వల్ల చాలా లాభాలు కలుగుతాయంటున్నారు. మనిషి జీవితంలోమార్పులు రావాలన్నా గుడ్లగూబను తదేకంగా చూడాలంటున్నారు. దీనికింతటికీ కారణం గుడ్లగూబ కళ్లేనట. గుడ్లగూబ కళ్లలో గ్రాస్పింగ్ పవర్ ఉంటుందట. గుడ్లగూబ కళ్లకు ఉన్న శక్తి కారణంగా రోజూ దాదాపు 10 నిమిషాలు దాని కళ్లలోకి చూస్తే లోతుగా, నిశితంగా, స్పష్టంగా, కచ్చితత్వంతో ఆలోచించే అలవాటు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి.
గుడ్లగూబలు చీకట్లో కూడా స్పష్టంగా చూడగలవు. అయితే, మనుషులు అలా చేయలేరు. మానువుని మెదడులో చూపుకి సంబంధించిన భాగాలు మరింత చురుకుగా మారాలంటే గుడ్లగూబను చూడాలని సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కచ్చితత్వం పెరుగుతుందట. చుట్టూ జరిగే పరిణామాలపై మరింత ఆసక్తి పెరిగేలా చేస్తుందట. గుడ్ల గూబను నేరుగా కానీ, ఫొటోలోగానీ చూడటం వల్ల మనం చూసే చూపులో తప్పనిసరిగా మార్పు వస్తుందంటున్నారు.
తెల్లటి గుడ్లగూబను చూస్తే మంచిదేనట..
మరోవైపు తెల్లటి గుడ్లగూబను చూడడం వల్ల శుభం కలుగుతుందని భావిస్తారు. దాంతోపాటు ఇది చాలా అరుదుగా కనిపిస్తుందని తెలుస్తోంది. ఇది కనిపిస్తే జీవితంలో ఉన్న సమస్యలు మటుమాయం అవుతాయని చెబుతారు. మీ జీవితంలో అనుకున్న పనులు నెరవేరనట్లయితే తెలుపు రంగు గుడ్లగూబను చూడటం శ్రేయస్కరం అని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల సానుకూల ఫలితాలు పొందుతారని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఆత్మలతో ముడిపడి ఉంటుందట. దీన్ని చూడటం వల్ల మీ పూర్వీకులు మీతో ఉన్నారని అర్థం చేసుకోవాలని చెబుతున్నారు. అప్పుడు ఎవరికీ భయపడాల్సిన పని ఉండదని సూచిస్తున్నారు.
పదే పదే గుడ్లగూబ ఎదురైతే…
గుడ్లగూబ పదే పదే ఎదురవుతూ మీరు నిరంతరం చూడటం వల్ల జీవితంలో ఆకస్మిక ఆనందం వస్తుందనే సంకేతాలుగా భావించాలట. అలాగే మీరు డబ్బు పొందబోతున్నారని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏదైనా పనికోసం బయటకు వెళ్తున్న క్రమంలో ఎడమవైపు ప్రాంతాల్లో గుడ్లగూబను చూసినట్లయితే అది కూడా చాలా శుభ సంకేతంగా భావించాలని చెబుతున్నారు. ఇలా జరిగినప్పుడు మీరు చేపట్టిన కార్యాలు అవంతారాలు లేకుండా పూర్తి కాగలవని స్పష్టం చేస్తున్నారు. గుడ్లగూబ మీకు కుడి వైవున కనిపిస్తే అది అశుభంగా భావించాలని చెబుతున్నారు. కుడివైపున దిశలో కనిపిస్తే పని పూర్తి చేసేందుకు మరికొంత సమయం పడుతుందని దీని అర్థం.
నైరుతి దిశలో గుడ్లగూబ కనిపిస్తే..
ఇక నైరుతి దిశలో నుంచి గుడ్లగూబ ఎదురైతే, లేదా శబ్దం వస్తే అది ఆర్థికంగా నష్టపోవడానికి సంకేతంగా భావించాలట. మరోవైపు గూడ్లగూబ శబ్దం తూర్పు నుంచి వినిపిస్తే మాత్రం అది ఆర్థికంగా శుభ సంకేతంగా భావించాలని చెబుతున్నారు. డబ్బు సంపాదన, ధన ప్రాప్తి కలుగుతాయని చెబుతున్నారు. ఒకవేళ దక్షిణ దిశ నుంచి గుడ్లగూబ సౌండ్‌ను వింటే లేదా ఈ దిశలో గుడ్లగూబ ఎదురైనట్లయితే శత్రువులపై మీ విజయానికి చిహ్నంగా భావించాలట.
Read Also : Silver Vastu Tips: వాస్తు దోషాలను వెండి వస్తువులతో పరిహరించండి