వెండి వస్తువులు (Silver Vastu Tips) వాడటం గురించి వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రయోజనాలను వివరించారు నిపుణులు. వాస్తు నియమాల ప్రకారం వెండికి (Silver Vastu Tips) చంద్రుడు, బృహస్పతితో సంబంధం కలిగి ఉందని చెబుతారు. వెండి వస్తువులు, (Silver Vastu Tips) ఆభరణాలు ధరించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెబుతారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి బోలెడు ప్రయోజనాలున్నాయట.
1. వాస్తు దోషాలు పోగొట్టడానికి వెండిని వాడాలని నిపుణులు సూచిస్తున్నారు.
2. ముఖ్యంగా వెండి నగలు, ఆభరణాలు ధరిస్తే ఇంట్లో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయంటున్నారు.
3. ఇంట్లో సానుకూలత, ఇంటి యజమాని ఆదాయం పెరగడానికి వెండి వస్తువులు దోహదపడతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
4. వెండి వస్తువుల్లో వెండి తాబేలు, వెండి చేప ఇలా చాలా వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు చేకూరుతాయి.
5. ఇలా చేయడం వల్ల ఆనందం, శ్రేయస్సు లభిస్తాయి. మీ ఇంటికి ఉత్తరం మూలలో లాకర్ కు పశ్చిమ లేదా దక్షిణం వైపు నుంచి వెండి వస్తువులను ఉంచితే శుభం కలుగుతుందట.
6. వాస్తు దోషాలు తొలగిపోవాలంటే మీ ఇంటి ప్రధాన ద్వారం నుంచి వెండి తీగను వేలాడదీయాలని సూచిస్తున్నారు.
7. గోడలపై వెండి గోళ్లను కూడా ఉంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పూజా సామాగ్రి విషయంలోనూ వెండి పాత్రలు విశిష్టమైనవిగా చెబుతారు.
8. వీటి ద్వారా అదృష్టాన్ని ఆకర్షించినట్లు అవుతుంది. వెండి గిన్నెలు రెండు తీసుకొని వాటిలో నీరు పోసి వెండి చేపలు ఉంచడం వల్ల అదృష్టం వరిస్తుందట.
9. పడుకొనేటప్పుడు వెండి నాణేలను దిండు కింద ఉంచడం వల్ల బుధుడు లేదా అంగారకుడి వల్ల కలిగే నష్టాలు, దోషాలు తొలగిపోతాయని సూచిస్తున్నారు.
10. వెండి నాణేలను మీ పర్సులో కూడా ఉంచుకోవచ్చు. ఆర్థిక లాభాలు కలుగుతాయి.
తరచూ అనారోగ్యం వేధిస్తోందా.. వాస్తు టిప్స్ ఇవిగో..
తరచూ అనారోగ్యాల బారిన కొందరు పడుతుంటారు. ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నా ఇలా జరుగుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటున్నా తరచూ జబ్బులు వేధిస్తుంటాయని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో డాక్టర్ వద్దకు వెళ్లి వైద్యం చేయించుకోవడం ఎంత ముఖ్యమో వాస్తు సలహాలు పాటించడం కూడా అంతే ముఖ్యమంటున్నారు వాస్తు నిపుణులు.
1. ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలని చెబుతున్నారు. మంచి ఆరోగ్యం, సిరిసంపదలతో తులతూగాలంటే వాస్తుపరమైన కొన్ని చిట్కాలను పాటించాలని సలహాలు ఇస్తున్నారు.
2. ముఖ్యంగా ఇంట్లో ఉన్న కొళాయిల నుంచి నీరు కారకుండా చూసుకోవాలట.
3. అలా కారుతూ ఉంటే ఇంట్లోని వ్యక్తుల ధనం కూడా అలాగే ఖర్చయిపోతుందని చెబుతున్నారు. ధన నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు.
4. నైరుతి వైపు పడకగది ఉండాలని వాస్తు నిపుణులు సలహా ఇస్తున్నారు.
5. ఇంటికి నైరుతి దిశలో వీధి పోటు ఉన్నట్లయితే తీవ్ర పరిణామాలు తప్పవట. ఆ ఇంటి ఇల్లాలికి సంవత్సరమంతా జబ్బులు సోకుతూనే ఉంటాయని చెబుతున్నారు.
6. ఇంటికి వీధి పోటు లేకుండా చూసుకోవడం ముఖ్యం. ఒక వేళ తప్పని పరిస్థితుల్లో వీధి పోటు ఉండే ఇంట్లోనే నివాసం ఉండేటట్లయితే.. అక్కడ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవాలని పరిహారంగా సూచిస్తున్నారు.
7. వాస్తు శాస్త్రం ప్రకారం మెట్ల కింద ఉన్న భాగాన్ని టాయిలెట్ కోసం గానీ, వంట గది కోసం గానీ వినియోగించరాదట.
8. ఇలా చేయడం వల్ల నాడీ, గుండె సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉండాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.
9. తులసిని పూజించడం వల్ల మానసిక సంతోషం చేకూరుతుందట. తులసిని పూజించకపోవడం వల్ల మానసికంగా అస్థిరత వస్తుందని చెబుతున్నారు.
Read Also : Vastu Tips: గృహంలో వాస్తు దోషాలున్నాయా? డబ్బుకు ఇబ్బందులా.. ఇలా చేస్తే దశ తిరిగిపోతుంది!