White Hair: ఇంటి పరిసరాల్లో మొలిచే మొక్కలను చాలా మంది పట్టించుకోరు. ఇలాంటి వాటిలో కొన్ని మొక్కలు ఆయుర్వేద పరంగానూ, చిన్న చిన్న జబ్బులకు నివారిణిగానూ ఉపయోగిస్తారని చాలా మందికి తెలియదు. దీనిపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అరుదైన విషయాలను కనుగొంటున్నారు. ఈ క్రమంలో చిన్న మొక్కల ద్వారా మన ఆరోగ్య సమస్యల్ని ఇంట్లోనే ఎలా తగ్గించుకోవచ్చనే విషయాలను నిపుణులు సూచిస్తున్నారు. (White Hair)
ఇందులో భాగంగా గొలిమిడి అనే మొక్క గురించి అధ్యయనాలు చేసిన పరిశోధకులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. దీన్నే ముళ్ల గోరింట అని కూడా పిలుస్తారు. ఇందులో ముఖ్యంగా నాలుగు రకాలు ఉంటాయని చెబుతున్నారు. దీని పూలు పసుపు రంగులో ఉంటాయి. పూజకు కూడా వాడుతుంటారు. దీన్ని మందుల తయారీలో కూడా వినియోగిస్తారని పరిశోధకులు చెబుతున్నారు.
చాలా మంది పూజకు మాత్రమే వినియోగించే ఈ మొక్క అనేక రకాల అనారోగ్య సమస్యల్ని పరిష్కరించేందుకు వినియోగిస్తారని చెబుతున్నారు. ఈ రకమైన మొక్క ఒక మీటరు లేదా ఒకటిన్నర మీటరు పొడవు పెరుగుతందని చెబుతున్నారు. గుబురుగా, పొదలాగా ఈ మొక్క పెరుగుతుంది. దీని ఆకులను తీసుకొని ముద్దగా నూరేయాలి. కొంచి నీళ్లు కలిపి బాగా పేస్ట్‌లాగా చేసుకోవాలి. అరకప్పు పేస్ట్‌లో అరకప్పు పుల్లటి గడ్డ పెరుగును కలపాలి.
ఈ మిక్స్‌డ్ పదార్థాన్ని వారానికి రెండు సార్లు తలకు పట్టించుకోవడం వల్ల అనేక రకాల ఉపయోగాలున్నాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఇలా జుట్టుకు పట్టించిన తర్వాత ఓ రెండు గంటల పాటు అలాగే ఆరబెట్టాలి. అనంతరం షాంపూ వేసుకొని క్లీన్ చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇది ఎంత అద్భుతంగా పని చేస్తుందో తర్వాత చూసుకోవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు దీన్ని ట్రై చేయడం వల్ల మూడు వారాల్లోనే హెయిర్ ఫాల్ తగ్గిపోతుందని స్పష్టం చేస్తున్నారు. అలాగే జుట్టు నల్లగా నిగనిగలాడుతుందని తెలుపుతున్నారు. ఆయుర్వేదంలోనూ దీని ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు.
తెల్లజుట్టును నల్లగా మార్చేందుకు మరిన్ని చిట్కాలు
రెండు టీస్పూన్ల హెన్నా పౌడర్, ఉసిరి పొడి, రెండు టీస్పూన్ల పెరుగు, ఒక గుడ్డు, అర టీస్పూన్ కొబ్బరి నూనె, షికాకాయ్, ఒక టీస్పూన్ నిమ్మరసంను మిక్స్ చేసి మిశ్రంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన పేస్ట్‌ను జుట్టుకు అప్లయ్ చేసుకోవాలి. దీనివల్ల సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి రిలీఫ్ కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. దాంతోపాటు జుట్టు దృఢంగా తయారవుతుందని సూచిస్తున్నారు. జుట్టు రాలడం సహా ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని వాడితే మంచి ఫలితాలు చూడొచ్చని చెబుతున్నారు.
ఉసిరి పొడిలో నిమ్మరసం కలిపి జుట్టుకు పూసుకోవాలి. దీంతో కూడా మంచి ఫలితాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. దీన్ని జుట్టుకు పూసిన తర్వాత సుమారు అరగంట పాటు ఆరబెట్టాలి. తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల జుట్టు దృఢంగా నల్లగా తయారవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. జుట్టు బాగా రాలిపోతున్న వారికి వేగంగా ఫలితం కనిపిస్తుంది.
ఇక నువ్వులు తినడం వల్ల కూడా జుట్టు సమస్యలు తగ్గుముఖం పడతాయి. నువ్వుల నూనెను జుట్టుకు రాయడంవల్ల సులభంగా జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. జుట్టును ఒత్తుగా దృఢంగా తయారు చేయడానికి బృంగరాజ్, అశ్వగంధ మూలికలు బాగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు.
Read Also : Sabja Seeds: సబ్జా గింజలతో లాభాలు తెలుసా? చర్మ సమస్యలకు చెక్