Vande bharat express fire: వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో పొగలు, మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు

Vande bharat express fire: వందే భారత్‌ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన భోపాల్‌ నుంచి ఢిల్లీ వెళ్తున్న వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు వ్యాప్తి చెంది దట్టమైన పొగలు వచ్చాయి. రైలులోని సీ-14 కోచ్‌ కింది భాగంలో మంటలు వచ్చాయి. ఈ క్రమంలో పొగ వాసన, మంటల వేడి కారణంగా ప్రయాణికులు భయంతో పరుగులు లంకించుకున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన రైలులోనూ మంటలు రావడం ఏంటని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. (Vande bharat express fire)

సోమవారం ఉదయం వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు భోపాల్‌ నుంచి ఢిల్లీకి స్టార్ట్‌ అయ్యింది. ఈ క్రమంలో రాణికమలాపాటి స్టేషన్‌ నుంచి జర్నీ మొదలైన తర్వాత కుర్వాయి స్టేషన్‌ వద్దకు రైలు చేరుకోగానే బ్యాటరీ నుంచి పొగలు వచ్చి మంటలు చెలరేగాయి. ఊహించని ఈ పరిణామం విషయం తెలియగానే రైల్వే సిబ్బంది రైలు వద్దకు చేరుకున్నారు.

Read Also : Indian Railways: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. వందే భారత్‌ సహా పలు రైళ్లలో చార్జీల సవరణ.. ఎంత తగ్గించారంటే..

మంటలను గుర్తించిన వెంటనే లోకోపైలట్‌కు సమాచారం అందించారు. లోకో పైలట్‌ హుటాహుటిన రైలును అక్కడే ఆపివేశారు. అనంతరం అగ్నిమాపక దళం అధికారులు, సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. త్వరితగతిన మంటలను అర్పివేశారు. రైలులో ‍మంటలు చెలరేగడంతో ప్రయాణికులందరూ భయాందోళన చెందారు. పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో మంటలు వ్యాపించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Read Also : Maharashtra: మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మార్పు ఖాయమా? శిండేకు పదవీ గండం, ఆశాభంగం?

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles