ఆదివారం, 25 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Telangana

Medaram : మేడారం అభివృద్ధి పనులు 100 రోజుల్లో పూర్తి!

Keerthanaa News Deskప్రచురణ తేదీ: మంగళవారం, 9 సెప్టెంబర్ 2025

Medaram : మేడారం అభివృద్ధికి సంబంధించిన పనులు 100 రోజుల్లో పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధిపై రేవంత్ ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. (Medaram)

ఈ సందర్భంగా మేడారం, బాసర ఆలయాల అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించగా, మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని సూచించారు. మేడారం అభివృద్ధికి సంబంధించి పలు డిజైన్లను పరిశీలించిన వంద రోజుల్లో అభివృద్ధి పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు ఉండాలని సీఎం అన్నారు.

ప్రపంచంలో అతిపెద్ద గిరిజన పండుగకు సంబంధించి నిర్మాణాలు పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో చారిత్రాత్మకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఎంట్రీ, ఎగ్జిట్, పార్కింగ్ వసతులు అన్నీ సక్రమంగా ఉండాలని చెప్పారు.

భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జంపన్న వాగులో నీరు నిలిచేలా ప్రాంతాల వారిగా చెక్ డ్యామ్‌ల నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ వారంలో మేడారంకు వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన చేస్తానని చెప్పారు.

దీనితో పాటు బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవాలయ విస్తరణ, అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు పలు సూచనలు చేశారు. అన్ని దేవాలయాల అభివృద్ధికి సంబంధించి స్థానిక సెంటిమెంట్‌ను గౌరవించడంతోపాటు, స్థానిక నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.

ఇవీ చదవండి: Koppula Eshwar: పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్? కేసీఆర్‌ నుంచి కీలక సమాచారం..!
Revanth Reddy: ఆ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ వెనుక ఆంతర్యం?
BRS : తెలంగాణ‌ను మ‌రోసారి అవ‌మానించిన బీఆర్ఎస్‌!

ట్యాగ్స్: , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading