Aloe Vera for Money: కలబంద మనకు లభించే వాటిలో దివ్యౌషధమైన మొక్క. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. చర్మ సంరక్షణ కోసం అల్లోవెరాను విరివిగా వినియోగిస్తుంటారు. దాంతోపాటు ఇతర ఉత్పత్తుల తయారీలోనూ కలబందను వినియోగిస్తుంటారు. వాస్తు శాస్త్రంలో కూడా కలబందకు విశేష ప్రాధాన్యం ఇచ్చారు పండితులు. కలబంద మొక్కను ఇంట్లో ఉంచుకోవడం, పెంచుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు చేకూరతాయని చెబుతున్నారు. (Aloe Vera for Money)
కలబందను ఇంట్లో సూర్యరశ్మి ప్రవేశించే ప్రాంతాల్లో ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అంటే కిటికీలు, లేదా సెల్ప్‌లు వంటి వాటి వద్ద కలబందను పెంచుకోవాలి. ఇలా అల్లోవెరా మొక్కపై సూర్యుని కిరణాలు పడటం, తర్వాత ఆ కాంతి ఇంట్లోకి చేరడం వల్ల పాజిటివ్ ఎనర్జీ మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఆర్థికపరంగానూ అనేక ప్రయోజనాలు చేకూరుతాయంటున్నారు.
కలబందను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులన్నీ వైదొలగిపోతాయి. పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుందని వాస్తు పండితులు స్పష్టం చేస్తున్నారు. దాంతోపాటు వ్యక్తిగత జీవితంలో కూడా అదృష్టం మిమ్మల్ని వరిస్తుందని చెబుతున్నారు. ఇక ఇంట్లో కలబందను ఏ ప్రాంతంలో, ఏ దిక్కులు ఉంచుకోవాలో కూడా వాస్తు శాస్త్రంలో వివరించారు.
అల్లెవెరా మొక్క ఆకు పచ్చని రంగులో ఉంటే ఇక ఆ ఇంట్లో అదృష్టం వరించినట్లేనని వాస్తు పండితులు చెబుతున్నారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడానికి కూడా కలబంద ఉపయోగపడుతుంది. చాలా ఈ మొక్కను పెరట్లో నాటుతుంటారని, అలా కాకుండా ఇంటి లోపల పెంచుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. కలబంద మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం వల్ల ఉత్తమ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.
కలబందతో మరిన్ని ఉపయోగాలు…
కలబందను కాస్మోటిక్స్‌లో, ఆయుర్వేద వైద్య విధానాల్లోను విరివిగా వాడుతారు. లోషన్లు, యోగర్ట్స్ క్రీంలు, పానకాలు తయారు చేస్తారు. జీర్ణశక్తిని పెంపొందించుకోడానికి, గుండె మంటని తగ్గించుకునేందుకు, అజీర్తివల్ల ఏర్పడే వ్యాధులు అరికట్టడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుని రోజ్‌వాటర్‌లో కలిపి శరీరానికి పూస్తే, శరీరంలోని మృత కణాలుపోతాయి. శరీరం కాలిన చోట కలబంద రసాన్ని వాడితే పూర్తి ప్రయోజనం చేకూరుతుంది.
ఉదయాన్నే పరగడుపున కల బంద ఆకుని తింటే, కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే సాధారణ వినియోగంలోకి వస్తే, కలబంద ఆకుల రసంలో కొబ్బరినీటిని కలిపి శరీరంలో ఉండే నల్లని భాగాలలో రాస్తూ వుంటే నల్ల మచ్చలుగానీ, మూలల్లో ఏర్పడిన నలుపుగానీ వెంటనే పోయి శరీర కాంతి పెరుగుతుంది. కలబంద నోటి పరిశుభ్రతను మెరుగుపరుస్తుంది, పంటి మీద చేరే కల్మషం తగ్గిస్తుంది. దీని పై 2017లో ఇండియాలో చేసిన అధ్యయనం ప్రకారం, కలబంద టూత్‌పేస్ట్‌ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారని తేలింది. కలబందలో అలోయిన్ అనే రసాయనిక పదార్థం ఉంది. తాజా కలబంద గుజ్జు కీళ్ల నొప్పులు తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Also : Vastu For Kitchen: వంట గది ఎలా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది?