బాదం పాలు (Almond Milk Benefits) చాలా మంది ఇష్టపడుతుంటారు. వేసవి కాలంలో అయితే మరీ ఎక్కువ తీసుకుంటాం. బాదం పాలతో (Almond Milk Benefits) అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యానికి కూడా బాదం పాలను ఉపయోగిస్తారు. బాదం పాలను తీసుకొని చర్మంపై అప్లై చేస్తే ఇన్ ఫెక్షన్లు తగ్గుతాయట. అలాగే చర్మం పొడిబారడం, టానింగ్ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. బాదంతో ఉపయోగాలేంటో తెలుసుకోండి.
1. బాదం పాలను మన చర్మానికి వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు బోలెడున్నాయి. బాదం పాలను సుసంపన్నమైనవిగా చెబుతారు.
2. వీటిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. చర్మం మృదువుగా, మెరిసేలా చేయడంలో బాదం పాలది కీలక పాత్ర.
3. చర్మ సమస్యలు ఉన్న వారు బాదం పాలను ట్రై చేసి చూడొచ్చు. చర్మంపై నల్లని మచ్చలు, ముఖంపై మచ్చలు కలిగిన వారికి బెస్ట్ హెల్త్ టిప్.
4. బాదం పాలను క్రమం తప్పకుండా ఉపయోగిస్తే పొడి చర్మం సమస్యలు మీ దరిచేరవు. చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
5. చిన్నపాటి చర్మ సమస్యలున్న వారు అంటే చర్మం పొడిబారుతున్న వారు వెంటనే బాదం పాలను ట్రై చేయాలి. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఉంటాయి.
6. భవిష్యత్తులో అనేక చర్మ రోగాలకు దారి తీయకుండా చర్మం పొడిబారుతున్న వారు జాగ్రత్త వహించాలి.
7. దురద, ఎరుపు, ఇతర చర్మ వ్యాధుల చికిత్స బాదం పాలతో సాధ్యం. అలాగే చర్మంపై ముడతలు ఉన్నా వాటిని తగ్గిస్తాయి బాదం పాలు.
8. అలాగే డార్క్ సర్కిల్స్ ను తగ్గించి చర్మం కాంతి వంతమయ్యేలా బాదంపాలు చేస్తాయి. బాదం మిల్క్ కాటన్ ప్యాడ్ పై ఉంచి కళ్ల కింద ఉండే నల్లటి పొరలపై రుద్దితే త్వరగా తగ్గుతాయి.
9. మీరు మీ దేహం మెరుపును కాపాడుకోవాలంటే బాదంపాలు కచ్చితంగా ట్రై చేయాల్సిందే.
బెస్ట్ శాకాహారం కోసం చూస్తున్నారా.. ఇవి ప్రయత్నించండి..
1. శాకాహార ప్రియులూ ఇది మీ కోసమే. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు రోజూ తింటే ఆరోగ్యం మీవెంటే ఉంటుంది. వాటిలో కావాల్సినంత విటమిన్స్, ఫైబర్, ప్రోటీన్లు కలగిసి ఉంటాయి. పోషకాహార లోపంతో బాధపడేవారు ఆకు కూరలు తింటే పుష్కలంగా అందుతాయి.
2. రోజువారీ ఆహారంలో కొన్నింటిని చేర్చుకుంటే ఇక మీ ఆరోగ్యానికి వచ్చిన ఢోకా ఏమీ ఉండదు. చాలా మంది మాంసాహారంలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయని భావిస్తారు. కానీ అది తప్పంటున్నారు డైటీషియన్లు. శాకాహారంలోనూ మీరు కోరుకున్న ప్రోటీన్లు, మాంసకృత్తులు ఉంటాయంటున్నారు.
3. నిజానికి శాకాహారంతోనే అనారోగ్యాలు దరిచేరకుండా ఉంటాయి. మాంసం తినడం వల్ల బలం చేకూరినా, కొవ్వు పదార్థాలు ఎక్కువైతే శరీరానికి కోరి హాని తెచ్చుకున్నట్లే. పండ్లు కూరగాయల్లో మాంసాహారంతో దీటుగా పోషకాలు ఉంటాయి.
4. ఏ పదార్థాలు తీసుకుంటే ఎలాంటి పోషకాలుంటాయో తెలుసుకోవడం ముఖ్యం. శాకాహారం తీసుకొనే వారంతా తప్పక తెలుసుకోవాలి.
5. మనకు మార్కెట్ లో దొరికే వాటిలో బీట్ రూట్ కూడా ఒకటి. ఇది తీసుకోవడం వల్ల, ఈ దుంపల్లో ఫైబర్, మాంగనీస్, పొటాషియం, విటమిన్ బీ9, ఐరన్ బాగా దొరుకుతుంది. దుంపలు తినడం వల్ల కండరాల పునరుద్ధరణ జరుగుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, నైట్రేట్లు ఉంటాయి.
6. వంటింట్లో నిత్యం అదుబాటులో ఉండే పసుపులోనూ అనేక ఔషధ గుణాలున్నాయని చాలా మందికి తెలుసు. పసుపు వంట రుచిని మరింత పెంచుతుంది. యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది.
7. కూరగాయల మార్కెట్ లో దొరికే వాటిలో టమోటా కూడా ప్రధానమైనది. వీటిలో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్ లైకోపీన్ ఉంటాయి. ఆరోగ్యానికి మంచిది.
8. ఇవిగాక ఉసిరికాయ, ఆకు కూరలనూ వీలైంత ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి. ఆకు కూరల్లో బచ్చలికూర, మెంతికూరలో ఖనిజాలు, విటమిన్లు అధికంగా ఉంటాయి.
Read Also : Health tips: తక్కువ ఖర్చుతో క్వాలిటీ ఫుడ్ కోసం ఇలా చేయండి..