Red Eyes: కొన్ని సార్లు నిద్ర తక్కువ కావడంతో పాటు ఇన్ఫెక్షన్ల వల్ల కూడా కళ్లు ఎర్రబడుతూ ఉంటాయి. బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల కూడా కళ్లు రెడ్ కలర్‌లోకి మారుతుంటాయి. మరికొన్ని సార్లు అలసట వల్ల కూడా కళ్లు ఎరుపు రంగులోకి మారతాయి. ఇలాంటి తరుణంలో వెంటనే అప్రతమ్తం కావాల్సిన అవసరం ఉంటుంది. అయితే, కళ్లు ఎర్రబడటానికి అనేక కారణాలు ఉంటాయి. (Red Eyes)
ప్రస్తుతం బిజీ జీవితంలో అందరూ అర్ధరాత్రి వరకు నిద్ర మేల్కొంటుంటారు. ఉద్యోగ బాధ్యతలు, వ్యాపార లావాదేవీలు, ఇతర కారణాలతో రాత్రిపూట సరిగా నిద్రలేక చాలా మంది సతమతం అవుతుంటారు. ఈ క్రమంలో కళ్లకు తగినంత విశ్రాంతి లేకపోతే అవి ఎర్రగా మారుతాయి. ఇది మరింత శృతి మించితే అనేక అనర్థాలకు మూలం అవుతుంది. ఈ నేపథ్యంలో కళ్లు ఎర్రగా మారుతుంటే వెంటనే కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.
కళ్లు ఎర్రబడుతుండటాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కళ్ల సమస్యలు ఏర్పడతాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం కళ్లు ఎరుపు రంగుంలోకి మారడం, కళ్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ సాధారణమైపోయిందని కంటి వైద్యులు చెబుతున్నారు. కళ్లలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కళ్లు ఎర్రగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు.
కంటి అద్దాలను ఉపయోగించే ముందు వాటిని శుభ్రం చేయని పక్షంలోనూ కళ్లు ఎర్రబడే చాన్స్ ఉందట. దీని వల్ల ఇన్‌ఫెక్షన్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పదే పదే లెన్స్‌లు వాడడం, రాత్రిపూట కూడా వాటిని ధరించడం వల్ల అకంతమీబా కెరాటైటిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని ఓ పరిశోధనలోనూ తేటతెల్లమైందని నిపుణులు చెబుతున్నారు. కెరాటిటిస్ కార్నియా వాపు వచ్చేందుకు ఇది కారణమవుతుందట. కెరాటిటిస్ వ్యాధి కొన్నిసార్లు అంధత్వానికి దారితీసే ఆస్కారమూ ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
కారణాలు, నివారణ..
కరోనా నేపథ్యంలో ఊపిరితిత్తులు, గుండె సంబంధిత ఇన్ఫెక్షన్‌తో చాలా మంది బాధపడ్డారు. ఇలాంటి వారిలో కూడా కళ్లు ఎరుపు రంగులోకి మారడం లాంటి సమస్యలు గుర్తించినట్లు వైద్యులు చెబుతున్నారు. కోవిడ్ వైరస్ కళ్ల ద్వారా వ్యాప్తి చెందడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. ఇక కంటికి సంబంధించిన బ్లెఫారిటిస్ వ్యాధి సోకితే కూడా కళ్లు రంగు మారతాయని చెబుతున్నారు.
ఇంకా కళ్లకు సంబంధించిన అలర్జీలు సోకినప్పుడు కూడాకళ్లు ఎరుపు రంగులోకి మారతాయి. కంటి అద్దాలు వినియోగించే వారు వాటిని రెగ్యులర్‌గా క్లీన్ చేసుకోకపోవడం కూడా కారణం అవుతుందంటున్నారు. ఇలాంటి సమస్యలను సమయానికి గుర్తించాలని సూచిస్తున్నారు. సమస్య జఠిలం కాకముందే కంటి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని చెబుతున్నారు. కళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. చల్లటి నీటితో కళ్లు శుభ్రం చేసుకోవడం వల్ల కళ్లకు రిలీఫ్ ఇస్తుంది. దాంతోపాటు కళ్లను తాకేటప్పుడు యాంటీ బ్యాక్టీరియల్ చుక్కలను తరచూ వాడటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కళ్లకు రిలీఫ్ ఇవ్వడంతో పాటు రెడ్ కలర్‌లోకి రాకుండా ఉంటాయని చెబుతున్నారు.
Read Also : Benefits of Dates: డేట్స్ నానబెట్టుకొని తింటే ప్రయోజనాలివే.. పురుషుల్లో ఆ శక్తి పుంజుకుంటుంది!