Benefits of Dates: మారిన జీవన శైలితో పురుషుల ఆరోగ్యంలో అనేక మార్పులు వస్తుంటాయి. ముఖ్యంగా గజిబిజీ జీవితంలో, ఎప్పుడూ ఉరుకులు పరుగుల జీవితం గడుపుతుంటారు. ఈ క్రమంలో సరైన ఆహారం తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తుంటారు. ఫలితంగా పోషకాహార లోపంతో ఇబ్బంది పడుతుంటారు. ఈ క్రమంలో పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గుతుంది. సంతానలేమి సమస్యలు చుట్టుముడతాయి.
పురుషుల్లో సంతానలేమి సమస్యను పరిష్కరించి శృంగార వృద్ధి, వీర్య వృద్ధి కలగడానికి వైద్యులు ప్రత్యేకించి కొన్ని పద్ధతులు సూచిస్తున్నారు. వీటిలో నానబెట్టిన కర్జూరం తింటే ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు సూచిస్తున్నారు. కర్జూరంలో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. ప్రతి రోజూ నానబెట్టిన కర్జూరం తీసుకోవడం వల్ల పురుషుల్లో బలం పెరుగుతుంది.
అన్ని రకాల రోగులు కూడా వీటిని తీసుకోవచ్చు. ఇందులో ఉండే సహజమైన తీపి శరీరానికి మేలు చేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, జింక్, మాంగనీస్ వంటి అనేక పోషకాలు కర్జూరాల్లో ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కర్జూరంలోఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రక్తాన్ని పెంచడంలో దోహదపడుతుంది. (Benefits of Dates)
ఆల్కహాల్, స్మోకింగ్, చెడు ఆహార అలవాట్లు కలిగిన పురుషుల్లో ప్రస్తుతం లైంగిక సమస్యలు వేధిస్తుంటాయి. వైవాహిక జీవితంలో అనేక సమస్యలతో సతమతం అవుతుంటారు. ఇలాంటి వారు రోజూ నాలుగు కర్జూరాలను తింటే శక్తి పుంజుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. దాంతోపాటు స్పెర్మ్ కౌంట్ కూడా పెరిగి శృంగారంలో తమ సత్తా చాటుతారని సూచిస్తున్నారు. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
మీ శరీరంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నట్లయితే ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఖర్జూరం తినడం అలవాటు చేసుకోండి. ఖర్జూరం శరీరంలో హిమోగ్లోబిన్ మొత్తాన్ని పెంచడం ద్వారా రక్తహీనత సమస్యను తొలగిస్తుంది. అలాగే శరీరానికి కావలసిన ఐరన్ మొత్తాన్ని అందిస్తుంది. ఇది కాకుండా మలబద్ధకంతో బాధపడేవారు ఈ రోజు నుంచి ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఖర్జూరాన్ని తినడం అలవాటు చేసుకోండి. దీని వల్ల కచ్చితంగా ప్రయోజనం పొందుతారు. ఖర్జూరంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది ప్రేగు కదలిక ప్రక్రియను సులభతరం చేస్తుంది. మలబద్ధకం అజీర్తి సమస్యను దూరం చేస్తుంది.
పోషకాలు పుష్కలంగా ఉండే ఖర్జూరం అనేక వ్యాధులను దరిచేరనీయదు. ఇందులో ఉండే పీచు జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను రానివ్వకుండా చూస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుందని ఆరోగ్య నిపుణుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బ్లడ్ షుగర్ కూడా నియంత్రణలో ఉంటుందని చెబుతున్నారు. రోజువారీ ఖర్జూరం బలాన్ని ఇస్తుందని స్పష్టం చేస్తున్నారు. దీనిని ఆరోగ్య నిధి అని కూడా పిలుస్తారు. ఇందులో ఉండే సహజమైన తీపి శరీరానికి మేలు చేస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు, జింక్, మాంగనీస్ వంటి అనేక పోషకాలు ఖర్జూరాలలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ శరీరంలో రక్తాన్ని పెంచడంలో దోహదపడుతుంది.
Read Also : Arunachala Giri Pradakshina: అరుణాచల గిరి ప్రదక్షిణకు టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
