Mental Health Condition in Family: వైవాహిక జీవితం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలంటే రిలేషన్ షిప్ లో కాంప్రమైజ్ ముఖ్యం. గొడవలు పడి కొట్లాడుకున్నా తర్వాత దగ్గరైపోతే అంతా సర్దుకుంటుంది. అలా కాకుండా రోజూ ఇబ్బందులు పడుతున్నారంటే ఆ బంధంలో ఏదో లోపించిందని అర్థం. మానసిక సమస్యగా మారకముందే ఇలాంటి వారు మేల్కోవాలి. మీ భాగస్వామి సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి. (Mental Health Condition in Family)
పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. సర్దుకుపోతే దాంపత్యం అనురాగాలమయం అవుతుంది. కాస్త చికాకులు, చిన్నపాటి గొడవలు కామన్ అయినప్పటికీ అవి ముదిరి పాకాన పడితే మొత్తం దాంపత్య జీవితమే ప్రభావితం అయ్యే చాన్స్ లేకపోలేదు. పెళ్లయిన కొత్తలో ముద్దూ ముచ్చట్లు ఎక్కు శాతం మందికి బాగానే ఉంటాయి. అయితే ఏళ్లు గడిచే కొద్దీ మనస్పర్ధలు కూడా కామనే. అయితే వీటన్నింటినీ అధిగమిస్తేనే జీవితం రంగులమయం అవుతుంది. మీ దాంపత్యంలో భాగస్వామి ఆనందంగా ఉన్నారో లేదో తెలియాలంటే కొన్ని టిప్స్ పాటించాలి.
ఒకరినొకరు గౌరవించడం ద్వారా ఆనందం వెల్లివిరుస్తుంది. ఇలా గౌరవించుకోలేదంటే మీ పార్ట్ నర్ ఆనందంగా లేరని అర్థం చేసుకోవాలి. పరిపక్వత కలిగిన వ్యక్తులుగా ఒకరినొకరు అర్థం చేసుకొని పరస్పరం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి. చాలా మంది మానసికంగా, ఎమోషనల్ గా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. నవ్వుతూ జోకులేస్తూ ఉంటారు. ఇది ఎక్కువైతే భాగస్వామి ఇబ్బందులు పడుతున్నట్లే.
మరీ ముఖ్యంగా జీవిత భాగస్వామికి అబద్ధాలు చెప్పకూడదు. ఏ విషయాన్నీ దాయకూడదు. బంధం బలోపేతం కావడానికి అబద్ధాలు చెప్పకపోవడమే బెటర్. అబద్ధాలు చెబుతుంటే రిలేషన్ దెబ్బతింటుంది. కోపం తక్కువ ఉన్న వారు సర్దుకుపోతుంటారు. ఇలాంటి మనస్తత్వం కలిగిన జంటలు అన్యోన్యంగా ఆనందంగా ఉంటారనడంలో సందేహం లేదు.
ఇదీ చదవండి: Relationship Tips for Couple: భాగస్వామితో ఆ విషయాలు చెప్పకూడదట..!
Couple Relationship : దంపతులు నిత్యం గొడవ పడుతున్నారా? ఈ టాపిక్స్ తీసుకురాకండి..
Niharika Divorce: వాళ్లిద్దరూ విడిపోయారు.. నాగబాబు కుమార్తె నిహారిక, చైతన్య విడాకులు