HomeLife StyleVastu for house and money: ఇంట్లో వాస్తు దోషాలు, డబ్బు ఇబ్బందులా.. మంచి రెమెడీ...

Vastu for house and money: ఇంట్లో వాస్తు దోషాలు, డబ్బు ఇబ్బందులా.. మంచి రెమెడీ ఇదే

Vastu for house and money: వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతికూల శక్తి ఇంట్లో ఉండకూడదు. ఇంట్లో సానుకూల ఫలితాల కోసం కొన్ని వస్తువులు వెంట తెచ్చుకుంటే మీ జీవితం సంతోషాలమయం అయ్యి తీరుతుంది. ఏయే వస్తువులతో వాస్తు బాగుంటుందో మీరూ ఓ లుక్కేయండి.. ఇంట్లో తెల్ల జిల్లేడు మొక్కను నాటండి. తద్వారా శుభం జరుగుతుంది. ఈ మొక్కలో వినాయక స్వామి ఉంటాడట. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనదిగా చెబుతారు. ఇంట్లో ఈ మొక్క ఉంటే ప్రతి రంగంలో విజయం మీదే. ఆగ్నేయ దిశలో కాకుండా ఉత్తర దిశలో ఈ మొక్కను నాటాలని వాస్తు పండితులు చెబుతున్నారు. (Vastu for house and money)

గృహమే కదా స్వర్గ సీమ అన్నారు పెద్దలు. ఏ గృహమైనా వాస్తు ప్రకారం ఉంటే ఆ ఇంట సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం లేకపోతే ప్రతికూల శక్తి ప్రభావితం చూపుతుంది. ఇంట్లోని వ్యక్తులపై ఆ ప్రభావం పడుతుంది. తద్వారా ఏ పనీ కలిసిరాకపోవడం, డబ్బు పుట్టకపోవడం, కొత్తది ఏది మొదలుపెట్టినా ఆటంకాలు ఎదురుకావడం జరుగుతుంటాయి. వృధా ఖర్చులూ పెరుగుతాయి. మరి ఇంతటి కష్టాలు కొనితెచ్చుకోకూడదంటూ ఇంట్లోని వస్తువులు వాస్తు ప్రకారం ఉంచుకుంటే సరి. వాస్తు చిట్కాలు కొన్నింటిని ఈ కథనంలో చదవండి..

ఒక కన్ను కలిగిన కొబ్బరికాయను ఇంట్లో ఉంచుకోవాలి. దీన్ని శాంతి, శుభాలకు సూచకంగా చెబుతారు. ఒక కన్ను కలిగిన కొబ్బరికాయను తెచ్చి, పసుపు, కుంకుమ రాసి, ఎరుపు రంగు వస్త్రం కట్టి పూజ గదిలో పెట్టి క్రమం తప్పక పూజిస్తే మంచి ఫలితాలు చూడవచ్చు. మరో చిట్కా ఏంటంటే.. ఎర్రటి వస్త్రంలో పటికను కట్టి ఇంటికి గుమ్మంలో వేలాడదీయండి.

ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు పెరుగుతాయి. దుష్ట శక్తులు ఇంట్లోకి రావు. అలాగే పాదరసంతో చేసిన శివలింగాన్ని ఇంటికి తెచ్చుకొని నిష్టతో రోజూ పూజిస్తే శివయ్య అనుగ్రహం లభిస్తుంది. నిత్యం అభిషేకాదులు నిర్వహించి, భక్తి శ్రద్ధలతో కొలవాలి. అప్పుడు మీరు అనుకున్న ఫలితం దక్కుతుందంటున్నారు వాస్తు నిపుణులు.

ఇదీ చదవండి: Vastu tips for House Clean: ఇంటి శుభ్రతలో వాస్తు టిప్స్‌ పాటిస్తే శుభప్రదం..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు