Beauty Face: ముఖాన్ని అందంగా చేసుకోవడం, ముడతలు పోగొట్టుకోవడానికి చాలా మంది అనేక రకాల పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్‌లను చాలామంది ఆశ్రయిస్తుంటారు. అక్కడ వేసే ఫేస్ ప్యాక్‌లకు ఆకర్షితులవుతుంటారు. ఆడవారు, మగవారు తేడా లేకుండా అందరూ ఇటీవలి కాలంలో అందానికి ప్రయారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ముఖం అందంగా, కాంతివంతంగా తయారు కావాలంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకోండి.. (Beauty Face)
ముఖాన్ని కాంతివంతంగా తయారు చేసుకోవాలంటే సరైన పద్ధతిలో ఫేస్ మసాజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సరైన పద్ధతి అనుసరించకపోవడం వల్ల ముఖంపై ముడతలు రావడం, ఫైల్ లైన్స్ ఏర్పడటం లాంటివి జరుగుతుంటాయి. వీటిని అరికట్టి ముఖాన్ని సాఫ్ట్‌గా తయారు చేసుకోవడానికి కొన్ని టిప్స్ పాటించాలి. మన ఇంట్లో దొరికే ఎసెన్సియల్ ఆయిల్స్‌తోనే ఫేస్ మసాజ్ చేసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆలివ్ ఆయిల్ గానీ, నువ్వుల నూనెగానీ వినియోగించవచ్చని చెబుతున్నారు.
ముఖం అందంగా కనిపించాలంటే రకరకాల పద్ధతులు ఉంటాయి. ఇందులో ఒకటి ఫేస్ మసాజ్. బ్యూటీ పార్లల్‌లో ఇందుకోసం అనేక రకాల కాస్మొటిక్స్ వాడుతుంటారు. అయితే కొన్ని సార్లు అవి మన చర్మానికి పడకపోవడం వల్ల ముఖం మరింత అందవిహీనంగా తయారయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఫేస్ మసాజ్ సక్రమంగా చేసుకోవడం కూడా ఒక పెద్ద టాస్క్ అనే చెబుతారు.
గొంతు కింద, గడ్డం కింద నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి. చేతులు సాఫ్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఆయిల్‌ను రెండు చేతులకు రాసుకొని అపవర్డ్స్ స్మూత్‌గా రాసుకోవాలి. గొంతు, గడ్డం కింద ఇలా చేసిన తర్వాత చూపుడు వేలు, మధ్యవేలు రెండింటినీ మడిచి తిప్పేసి గడ్డం కింది భాగం నుంచి పైకి మసాజ్ చేసుకోవాలి. పైన డైరెక్షన్‌కు మాత్రమే ఇలా చేసుకోవాలి. తర్వాత కళ్ల కింద, నుదుటి భాగంలోనూ ఇదే విధంగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేశాక ఫేస్‌పై సాఫ్ట్‌గా ట్యాప్ చేసుకోవాలి. తర్వాత రెండు చేతులతో రుద్దుకొని హీట్‌ను జనరేట్ చేసుకొని కళ్లమీద, ఫేస్‌పై మెత్తగా రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఫేస్‌పై ముడతలు తగ్గుతాయి.
ఈ ప్యాక్ కూడా ట్రై చేయొచ్చు..
ఒక గిన్నెలో రెండు చెంచాల బియ్యప్పిండిని తీసుకోండి. దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. పేస్ట్ చేయడానికి మీరు దీనికి రోజ్ వాటర్ జోడించవచ్చు. ఇప్పుడు దాన్ని పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో గిన్నెలో రెండు నుంచి నాలుగు చెంచాల చందనం పొడిని తీసుకోవాలి. పచ్చి పాలు మిక్స్ చేసి సన్నని పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
తర్వాత మీ ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ముఖానికి రెండు మూడు లేయర్ రైస్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. శరీరంలోని ఇతర భాగాలపై కూడా మరక ఉంటే, మీరు దానిని అక్కడ కూడా అప్లయ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు దాన్ని సుమారు 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత, మీ చేతులను తడిపి, మీ ముఖాన్ని వృత్తాకార కదలికలలో మసాజ్ చేసుకోండి. తర్వాత నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
ఇప్పుడు మీ ముఖం, ఇతర భాగాలపై గంధపు ఫేస్ ప్యాక్ అప్లయ్ చేసుకోవాలి. మసాజ్ చేసేటప్పుడు కూడా మీరు దీన్ని చర్మంపై రాసుకోవాలి. తర్వాత ముఖం15 నిమిషాలు ఆరబెట్టాలి. తర్వాత చల్లటి నీళ్లతో కడిగేసి ఏదైనా క్రీమును ముఖానికి పూసుకోండి. మీరు ఈ రెండు ఫేస్ ప్యాక్‌లను ఒకదాని తర్వాత ఒకటి వారానికి 2 సార్లు అప్లయ్ చేసుకోవడం వల్ల రెండు నెలల్లోనే పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది.
Read Also : Good Health Tips: రోగాలు రాకుండా ఉండాలంటే మంచి ఆరోగ్య చిట్కాలివే..