HomeSportsMS Dhoni Cutout: నందిగామలో 77 అడుగుల ధోని కటౌట్‌.. మహేంద్రుడి బర్త్‌డే స్పెషల్‌

MS Dhoni Cutout: నందిగామలో 77 అడుగుల ధోని కటౌట్‌.. మహేంద్రుడి బర్త్‌డే స్పెషల్‌

MS Dhoni Cutout: టీమిండియా మాజీ దిగ్గజం.. కెప్టెన్‌ కూల్‌ మహేంద్ర సింగ్‌ ధోని బర్త్‌ డే జూలై 7 (Dhoni Birth day) అని తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ముందే సంబరాలు చేసుకుంటున్నారు. మనదేశంలోనూ ధోని అభిమానుల కోలాహలం మామూలుగా లేదు. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో మహేంద్రుడి 77 అడుగుల భారీ కటౌట్‌ (MS Dhoni 77 feet Cutout at Nandigama) వెలిసింది. ధోని అభిమానులు దీన్ని ఏర్పాటు చేశారు. మిస్టర్‌ కూల్‌ బర్త్‌ డే సందర్భంగా కటౌట్‌ ఏర్పాటు చేయడంతో దేశ వ్యాప్తంగా నందిగామ వార్తల్లో నిలిచింది. (MS Dhoni Cutout)

మరోవైపు తెలంగాణలోని హైదరాబాద్‌ (Hyderabad) నగరంలోనూ ధోని కటౌట్‌ వెలిసింది. 52 అడుగుల ధోని కటౌట్‌ను (52 Feet Dhoni Cutout) ఏర్పాటు చేశారు. ఇందులో ధోని టీమిండియా జెర్సీ ధరించి ఉన్నాడు. అయితే, నందిగామలో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు జెర్సీ ధరించిన ధోని కనిపిస్తున్నాడు. హైదరాబాద్‌లోని పలు థియేటర్లలో ఎంఎస్‌ ధోని బయోపిక్‌ “ఎంఎస్‌ ధోని.. ది అన్‌ టోల్డ్‌ స్టోరీ” సినిమా ప్రదర్శించనున్నారు. ధోని అభిమానులంతా ఏకమై చిత్రాన్నివీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు.

https://twitter.com/TheDhoniEra/status/1676916677815189506?s=20

మరోవైపు కేరళ రాష్ట్రంలోనూ ధోని క్రేజ్‌ సపరేట్‌గా ఉంటుంది. ధోని బర్త్‌ డే సందర్భంగా కేరళలో అభిమానులు భారీ కటౌట్‌ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. భారత్‌కు చిరస్మరణీయ ప్రపంచ కప్‌లను అందించిన ఘనత ధోని కెప్టెన్సీలోనే జరిగిన సంగతి తెలిసిందే. అయితే, ఎంత ఫ్యాన్‌ బేస్‌ ఉన్నప్పటికీ ధోని అంటే నచ్చని వారు కూడా ఉన్నారు. ప్రపంచ కప్‌లు గెలవడంలో మిగతా క్రికెటర్ల శ్రమనుగుర్తించలేదనే కారణంతో ధోనిని హేట్‌ చేసే వారు ఉన్నారు.

ఏపీలోని నందిగామలో వెలసిన 77 అడుగుల కటౌట్‌.. ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు కూడా ఇలాంటి అరుదైన అవకాశం దక్కలేదు. ధోనికి మాత్రమే ఇంతటి గౌరవం, అభిమానం దక్కాయి. ధోని కెప్టెన్సీలో టీమిండియా 2007 టీ20 ప్రపంచ కప్‌, 2011 వన్డే వరల్డ్‌ కప్‌ నెగ్గిన సంగతి తెలిసిందే. దాంతోపాటు ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా ధోని సారథ్యంలో భారత్‌ కైవసం చేసుకుంది. అంతేకాదు.. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లోనూ ధోనికి ప్రత్యేక చరిత్ర ఉంది. ఏకంగా 5 సార్లు కప్‌ నెగ్గిన ఘనత సొంతం చేసుకున్నాడు. 42 ఏళ్ల వయసులోనూ యువకుడిలా పరుగెత్తగల ఫిట్‌నెస్‌ ధోని సొంతం.

ఫిట్‌నెస్‌ కోసం అహర్నిశలు శ్రమించి బాడీని ఫిట్‌గా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంటాడు ధోని. ఒక్క క్రికెట్‌ మాత్రమే కాదు.. టెన్నిస్‌, ఫుట్‌బాల్‌ తదితర క్రీడలను కూడా ధోని సరదాగా ఆడుతుంటాడు. తన ఫామ్‌ హౌస్‌లో సేద్యం కూడా చేస్తుంటాడు ధోని. మొన్నామధ్య ధోని ట్రాక్టర్‌ నడుపుతున్న వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే.

అంతేనా.. ధోని ఏం చేసినా ట్రెండింగ్‌లోఉండాల్సిందే.. ఇటీవల విమానంలో ధోని క్యాండీ క్రష్‌ (Dhodi Candycrush) ఆడుతూ కనిపించిన వీడియో బాగా వైరల్‌ అయ్యింది. దాంతోపాటు ఏకంగా కోట్లాది మంది క్యాండీ క్రష్‌ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారంటే ధోని ప్రభావం ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ధోని వల్లే తమ గేమ్‌ డౌన్‌లోడ్లు పెరిగాయని, తాము ట్రెండింగ్‌లో ఉన్నామని క్యాండీ క్రష్‌ గేమ్‌ యాజమాన్యం ధోనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ధోని అంటే ఓ క్రీడాకారుడు మాత్రమే కాదు.. ఓ ఎమోషన్‌ అంటూ అభిమానులు ముద్దుగా “తలా” అని పిలుచుకుంటారు.

Read Also : IPL Final 2023: తిరుగులేని మహేంద్రుడు.. ఐదో టైటిల్‌ విశేషాలు ఇవే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు