Good Health Tips: నేటి కాలంలో అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ (Good Health Tips) పెరిగింది. కరోనా పాండెమిక్ పరిస్థితుల తర్వాత అందరూ పోషకాహారంపై దృష్టి సారించారు. పళ్లు, ఆకు కూరలు తీసుకోవడంపై శ్రద్ధ కనబరుస్తున్నారు. సమాజంలో అందరికీ ఆరోగ్యంగా జీవించాలని కోరిక ఉంటుంది. ఆస్పత్రి మెట్లు ఎక్కకూడదని ప్రతి ఒక్కరూ భావిస్తూ సంకల్పాలు చేసుకుంటూ ఉంటారు. వీటిని సాధించడం కోసం అనేక పద్ధతులు పాటిస్తుంటారు.
ఉపవాసం చేసే రోజు రెండు లేదా మూడు సార్లు తేనె నీళ్లు తాగితే సరిపోతుంది. మిగతా సమయం అంతా మంచినీళ్లు తాగితే చాలు. ఉదయం ఓసారి, మధ్యాహ్నం మరోసారి, రాత్రికి ఇంకోసారి తేనె కలిపిన నీరు తీసుకుంటూ సోమవారాన్ని గడిపేస్తే.. చక్కటి ఆరోగ్యం మీసొంతం అవుతుంది. పొట్ట మాడ్చుకోవడం వల్ల 24 గంటల్లో మన శరీరం శుభ్రంగా మారుతుందని చెబుతున్నారు. రక్షణ వ్యవస్థ మెరుగువుతుందంటున్నారు.
ఆనందమయ జీవితానికి అనేక ఆయుర్వేద చిట్కాలు పాటించాలి. నేచురోపతిలో అనేక విధానాలు ఉన్నాయి. ప్రకృతి వైద్యంలో కూడా అనేక పద్ధతులు ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వారానికోరోజు ఉపవాసం ఉండాలని సూచిస్తున్నారు. ఇది నేచురోపతి విధానంలో ఉత్తమ విధానమని చెబుతున్నారు. వారంలో ప్రతి సోమవారం ఉపవాసంగా ఉండాలని నియమంపెట్టుకోవాలని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల బోలెడు ఉపయోగాలు ఉన్నాయట.
వారంలో ఒకసారి అంటే ప్రతి మంగళవారం కేవలం జ్యూస్‌లతో సరిపెట్టుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీన్ని రసోపవాసంగా పాటించాలని సూచిస్తున్నారు. బాడీ డీటాక్సిఫికేషన్ యాక్టివ్‌గా జరుగుతుందని చెబుతున్నారు. రసోపవాసం వల్ల లివర్ క్లీనింగ్, బ్లడ్ ప్యూరిఫికేషన్ ఈజీగా జరుగుతుంది. చర్మ సౌందర్యం కూడా సాధ్యమవుతుంది. రోజుకు ఐదు సార్లు జ్యూస్ తాగి గడిపేయాలి. ఇక వారంలో ఒకరోజు కేవలం ఫ్రూట్స్ తీసుకొని గడిపేయాలని చెబుతున్నారు. ఇక మరో చిట్కాగా వారంలో ఒకరోజు రోజుకు రెండుసార్లే భోజనం తినాలి. ఇక చికెన్, మటన్, స్వీట్లు, ఫ్యాటీ పదార్థాలు తినాలనిపించిన సందర్భాల్లో రోజుకు ఒకేసారి తినాలని సూచిస్తున్నారు.
పూర్వకాలంలో మానవుడు చేసే పనిలో శారీరక శ్రమ అధికంగా ఉండేది. దీంతో అలాంటి వాతావరణంలో ఉన్నపుడు ఎటువంటి జబ్బులు మానవుని వద్దకు వచ్చేవి కాదు. కానీ నేటి కంప్యూటర్ యుగంలో ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా కదలకుండా పని చేయడం అలవాటు చేసుకున్నారు. ఎలాంటి సమయంలో సీజనల్ గా లభించే పండ్లు బత్తాయి, సీతాఫలం, దానిమ్మ, జామ, మామిడి మొదలగు పండ్లను తీసుకోవటం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి, గుండెపోటు వంటి రకరకాల జబ్బులు రాకుండా ఉంటాయని పరిశోధకులు కూడా స్పష్టం చేస్తున్నారు.
మానవుడు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే ఆరోగ్యవంతునిగా గుర్తించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా వెల్లడించింది. వ్యక్తి తన వ్యక్తిగత, సామాజిక సంబంధాల్లో సంపూర్ణ జీవనం గడపడానికి, ఉత్తమ సేవ చేయడానికి శక్తివంతుడిని చేసే జీవిత విధానమే ఆరోగ్యంగా చెబుతారు. ఒక వ్యక్తి బాగా జీవించేటట్లు బాగా సేవ చేసేటట్లు చేసేది ఆరోగ్యం. కేవలం వ్యాధి కాకుండా మనిషి పూర్తి శారీరక, మానసిక, సంఘీక స్థితిని గురించి వివరించేది ఆరోగ్యం.
Read Also : Vastu Tips Health: అనారోగ్యాలు వదలడం లేదా? వాస్తులో ఈ టిప్స్ చూడండి..