Coconut water for Diabetes: డయాబెటిస్ అనేది చాలా ఇబ్బందికర జబ్బు. ఇది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. ఇలాంటి వారికి కొబ్బరి నీళ్లు తాగొచ్చా లేదా అని అనుమానాలు వెంటాడుతుంటాయి. అలాంటి అనుమానాల్ని నిపుణులు నివృత్తి చేస్తున్నారు. కొబ్బరినీళ్లు తాగడం మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఓ వరం లాంటిదని చెబుతున్నారు. మధుమేహం కంట్రోల్‌లో ఉంచడంలో కొబ్బరినీళ్లు కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు.
కొబ్బరి నీళ్లను (Coconut water for Diabetes) చాలా మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా వేసవి కాలంలో కొబ్బరి నీళ్లను రోజూ తాగాలని వైద్యులు సూచిస్తుంటారు. మరోవైపు ఎలాంటి అనారోగ్యం వచ్చినా కొబ్బరి నీళ్లు తాగాలని పెద్దలు చెబుతుంటారు. ముఖ్యంగా విరోచనాలు, వాంతులు, జ్వరం లాంటి సమస్యలు వచ్చినప్పుడు ఓ కొబ్బరి బోండాం తాగడం వల్ల ఎంతో రిలీఫ్‌గా ఉంటుంది. జబ్బు నయం కావడానికి దోహదపడుతుంది.
కొబ్బరినీళ్లు తాగడం వల్ల రక్తంలో చక్కెరను తగ్గించే సామర్థ్యాన్ని కలిగిస్తుందని చెబుతున్నారు. కానీ ఇలా నిపుణులు ఎన్ని చెప్పినా మధుమేహ వ్యాధి గ్రస్తులకు అనుమానాలు వెంటాడుతుంటాయి. కొందరు ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. కొబ్బరి నీళ్లలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సి, ఎల్-అర్జినైన్ సమంజసమైన మొత్తంలో ఉంటాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
కొబ్బరి నీళ్లలో తక్కువ మొత్తంలో చక్కర శాతం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అందువల్ల మధుమేహ వ్యాధి గ్రస్తుల్లో చక్కెర స్థాయిలను గణనీయంగా ప్రభావితం చేయబోదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఇందులోని అధిక పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, విటమిన్ సీ, ఎల్-అర్జినైన్ ఇన్సులిన్‌కు కణాల సున్నితత్వాన్ని పెంచుతాయంటున్నారు. అందువల్ల అనుమానాలు పక్కనపెట్టి కొబ్బరి నీళ్లు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. కొబ్బరి నీళ్లలో ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించగల యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయని నియంత్రిత ట్రయల్స్ చూపించాయి. కాబట్టి, అవి ఇకపై హాని కలిగించవు. అనేక ఇన్-వివో అధ్యయనాలు కొబ్బరి నీళ్లలోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఆక్సీకరణ ఒత్తిడిని, హైపర్గ్లైసీమియాను తగ్గిస్తాయని చూపించాయి.
కొబ్బరి ఎలా తయారవుతుంది?
కొబ్బరి చెట్టుకు కాసిన లేత కొబ్బరికాయలలో నిల్వ ఉన్న స్వచ్ఛమైన ద్రవాన్ని కొబ్బరి నీరుగా పిలుస్తుంటాం. కొబ్బరి కాయలో కొబ్బరి బీజం తయారు కావడానికి సిద్ధమవుతున్న దశలో కొబ్బరినీళ్లు ఎక్కువగా ఉంటాయి. ఈ దశలో ఉన్న కొబ్బరి కాయలోని నీరు మనకు అత్యంత శ్రేయస్కరంగా ఉపయోగపడతాయి. ఈ దశ దాటి అభివృద్ధి చెందుతున్న కొబ్బరికాయ లోపల వైపు కొబ్బరిపీచుకు అంటుకుని గట్టిగా కొబ్బరిచిప్ప తయారవుతుంది.
నీరు రూపాంతరం చెందుతూ కొబ్బరి చిప్పకు లోపలి వైపున అంటుకుంటూ తెలుపు రంగుతో ఉన్న కొబ్బరి తయారవుతుంది. కొబ్బరిచెట్లు ఏపీలో చాలా ప్రాంతాల్లో పండిస్తారు. దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కొబ్బరి నీళ్లు విరివిగా దొరుకుతాయి. కేరళలో మరీ ఎక్కువగా కొబ్బరినీళ్లు, కొబ్బరినూనె వినియోగంలో ఉంటుంది. కొబ్బరినీరు ప్యాకెట్లలో, సీసాలలో కూడా భద్రపరచినవి చాలా ప్రాంతాల్లో మార్కెట్లో దొరుకుతున్నాయి. ఏటా సెప్టెంబర్ 2వ తేదీన ప్రపంచ కొబ్బరి దినోత్సవంగా జరుపుకుంటారు.
Read Also : Unhealthy Food: ఐదు రకాల ఫుడ్‌కు దూరంగా ఉంటే అనారోగ్యం దరిచేరదు.. అవేంటో చూడండి..