Unhealthy Food: మనం ఆరోగ్యంగా బతకాలంటే తీసుకొనే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యాన్ని కలిగించే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషక విలువలున్న పదార్థాలను ఫుడ్ ఐటమ్స్‌గా తీసుకుంటే నిత్యం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల త్వరగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి.
జంక్ ఫుడ్‌లో (Unhealthy Food) రసాయనాలు ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అనేక రసాయన సమ్మేళనాలు ఆహారంలో దాని రుచి, రంగు, ఆకర్షణీయమైన రూపాన్ని, షెల్ఫ్ లైఫ్‌ను పెంచడానికి జోడిస్తారు. అటువంటి ఆహారాలు మన ఆరోగ్యంపై పూర్తిగా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. ఈ క్రమంలో మనం ఎలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం.
మనం దూరంగా ఉండాల్సిన వాటిలో సోడియం నైట్రేట్ ఒకటి. ఇది పంది మాంసం, జెర్కీతో సహా అనేక ప్రాసెస్ చేసిన మాంసాల్లో సంరక్షణకారిగా ఉపయోగిస్తారు. సోడియం నైట్రేట్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించడానికి, మాంసాల రంగు, ఉప్పగా ఉండే రుచిని సంరక్షించడానికి ప్రాసెస్ చేయబడిన మాంసం ఉత్పత్తుల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
ఇంకా ఈస్ట్ సారం కలిగిన చీజ్, సోయా సాస్ లాంటివి తీసుకుంటే రక్తపోటు సమస్యలు వస్తాయి. చర్మ సంబంధ సమస్యలు కూడా వచ్చే ఆస్కారం ఉంది. దీంతోపాటు వైట్ షుగర్‌ను తీసుకుంటే ఊబకాయం, టైప్ 2 మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. మరోవైపు మైదాతో చేసిన పదార్థాలు అంటే ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తీసుకుంటే ఊబకాయం, టైప్ 2 మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ వ్యాప్తి చెందుతాయి. అలాగే శుద్ధి చేసిన నూనెలు, ప్రాసెస్డ్ నూనెలను అధికంగా తీసుకుంటే యాసిడ్ రిఫ్లక్స్‌తో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది.
పండ్లు, ఆకుకూరలు తినాలి..
పండ్లు, పాలు, క్యారెట్, చిలగడ దుంప వంటి దుంపలు, వేరు చనగలు, పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి, బాదం, జీడిపప్పు, పిస్తా, ఆక్రూట్, ఎండు ద్రాక్ష, ఖర్జూరాలు, తేనె, చెరకు, లేత కొబ్బరి నీళ్లు లాంటివి యధాతతధంగా అలాగే తినొచ్చు. వీటి వల్ల ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు శరీరదారుఢ్యం కూడా ఏర్పడుతుంది. అనాదిగా ప్రకృతి వైద్యంలోనూ వీటికి ప్రత్యేక విశిష్టత ఉంది. ఇక నానబెట్టిన ఆహార పదార్థాలైన పచ్చి శనగలు, పెసలు మొదలైనవి, పెసర పప్పు, వీటిని నానిన తరువాత యధాతధంగా తినొచ్చు. వీటి వల్ల కూడా జీర్ణక్రియ సక్రమంగా పని చేసి శరీరానికి విటమిన్లు, మినరల్స్ అందుతాయి.
ఇక మొలకెత్తించిన ధాన్యాలైన పెసలు, అలసందలు, సజ్జలు, గోధుమలు, జొన్నలు, రాగులు మొదలైన చిరుధాన్యాలు మొలకెత్తించి తినే సౌలభ్యం కూడా ఉంది. వీటిని యధాత్ధంగానూ, పచనం చేసి, ఎండబెట్టి పొడి చేసి, కూరలలో ఇతర ఆహారాలలో మిక్స్ చేసుకొని తినొచ్చు. మొలకెత్తించి ఉపయోగించడం ద్వారా ఆహారపు విలువలు చాలా పెరుగుతాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వీలైనంత వరకు ఇలాంటి ఆహారాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
అభిప్రాయం.
పచనం చేయకుండా తినగలిన ఆహారాలు :- పచనం చేయకుండా తిన గలిగిన ఆహారాలు రెండు విధాలు ఒకటి నిలువ చేసి సంవత్సరకాలం ఉపయోయించే ఆహారాలు.
రెండు తాత్కాలిక ఆహారాలు.
Read Also : Gold Price Today (23-06-2023): దిగొస్తున్న బంగారం.. వరుసగా నాలుగోరోజు కూడా.. నేటి పసిడి, వెండి ధరలు..
