Jammalamadugu TDP: వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా భూపేష్ రెడ్డి పేరు ఖాయమైంది. ఈ మేరకు భూపేష్ రెడ్డి పేరు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. బీజేపీ నేత, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్న కొడుకే భూపేష్ రెడ్డి. జమ్మలమడుగులో ప్రస్తుతం అధికార పార్టీ తరఫున ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి ఉన్నారు. అంతకుముందు 2014లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఆదినారాయణరెడ్డి పార్టీ ఫిరాయించి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంత్రి పదవి కూడా పొందారు. 2019లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాభవంతో టీడీపీ నుంచి బీజేపీలోకి ఆదినారాయణరెడ్డి జంప్ అయ్యారు. (Jammalamadugu TDP)
నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేయలేదు: చంద్రబాబు
ప్రతిపక్ష నేత చంద్రాబు రాయలసీమలో పర్యటిస్తున్నారు. ప్రాజెక్టుల సందర్శన, బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. జనాల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంటుండంతో టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తెచ్చేందుకు జనసమీకరణపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక కడపలో పర్యటించిన చంద్రబాబు మాట్లాడుతూ.. కొత్త ప్రాజెక్టులంటూ జగన్ మరో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. కొత్తగా 10 ప్రాజెక్టుల పేరుతో రూ. 12 వేల కోట్ల దోపిడీకి సిద్ధమయ్యారని విమర్శించారు.
గండిపేట-చిత్రవతి, గండికోట-పైడిపాలెం ప్రాజెక్టులు అటకెక్యాయయని చంద్రబాబు విమర్శలు చేశారు. మత్రి పెద్దిరెడ్డికి రూ.5036 కోట్లతో పనులు మంజూరు చేశారని చెప్పారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఏడిపిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి పెద్దిరెడ్డికి మాత్రం రూ. 600 కోట్ల బిల్లులు ఇచ్చారని చెప్పారు. 10 శాతం పెండింగ్ ఉన్న హంద్రీనీవా కాల్వ పనులు పూర్తి చేయలేదన్నారు.
హంద్రీనీవాకు కొత్త కాలువలు తవ్వుతామని చంద్రబాబు తెలిపారు. ఉన్న ప్రాజెక్టులను రద్దు చేసి నాటకాలు ఆడుతున్నారని, 23 ప్రాజెక్టులతో రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం పేరుతో డ్రామాలు ఆడుతున్నారన్నారు. నాలుగేళ్లలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి చేయలేదన్నారు. కేఆర్ఎంబీ, ఎన్‌జీటీ, సీడబ్ల్యూసీ అనుమతులు రాలేదని, రివర్స్ నిర్ణయాలతో సాగునీటిరంగాన్ని రివర్స్ చేశారంటూ విమర్శలు గుప్పించారు.
చంద్రబాబు టూర్ తో హీటెక్కిన సీమ రాజకీయం
చంద్రబాబు పర్యటన నేపథ్యంలో సీమలో రాజకీయ కాక రేగింది. సాగునీటి ప్రాజెక్టులను సందర్శిస్తున్న చంద్రబాబుకు కౌంటర్ గా వైఎస్సార్‌సీపీ ప్రత్యేక కార్యక్రమం తలపెట్టింది. చంద్రబాబు వేసిన శిలాఫలకాల పరిశీలన కార్యక్రమాన్ని నేతలు చేపట్టారు. చంద్రబాబు వేసిన శిలాఫలకాన్ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సందర్శించారు. ప్రాజెక్టులతో పాటు చంద్రబాబు తాను వేసిన శిలాఫలకాలనూ సందర్శించాలంటూ డిమాండ్ చేశారు.
Read Also : BJP Target Telangana: ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ వార్ రూమ్? నేతలకు అమిత్ షా కొత్త టార్గెట్?