BJP Target Telangana: తెలంగాణ బీజేపీ నేతలకు కేంద్ర హోంమంత్రి, బీజేపీ సీనియర్ నేత అమిత్ షా కొత్త టార్గెట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వ్యూహాలకు మరింత పదును పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ.. అంతుకు అనుగుణంగా కార్యాచరణ ఇప్పటి నుంచే మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. తాజాగా తెలంగాణ నేతలకు అమిత్ షా కొత్త టార్గెట్లు పెట్టారట. (BJP Target Telangana)
తెలంగాణ బీజేపీ నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు గెలవాలంటూ అమిత్ షా ఆర్డర్ వేసినట్లు సమాచారం. ఎంత పెద్ద లీడర్ అయినా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారట. కిషన్‌రెడ్డితో సహా ముఖ్య నేతలంతా అసెంబ్లీ బరిలోనే ఉంటారని తెలుస్తోంది. 25 నుంచి 35 మంది టాప్ లీడర్స్‌ను గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారట. తెలంగాణ బీజేపీ నాయకత్వానికి ఈ విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారని తెలుస్తోంది.
బీజేపీ సంప్రదాయ రాజకీయాన్ని పక్కన పెట్టేయాలని అమిత్ షా సూచించారట. కొత్త తరహా రాజకీయంతో ముందుకెళ్లాలని అమిత్ షా నిర్దేశించారట. ఎవరైనా సరే హస్తినలో ఉండొద్దని మరీ ముఖ్యంగా చెప్పారట. నేతలంతా గల్లీల్లోనే ఉండాలని స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేశారట. తెలంగాణ బీజేపీ ఆపరేషన్స్ అన్నీ ఇకపై ఢిల్లీ నుంచే కొనసాగుతాయని తెలుస్తోంది. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణ బీజేపీ వార్ రూమ్ కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. పార్టీ లైన్ దాటితే ఇకపై ఢిల్లీ నుంచి వార్నింగ్‌లు ఉంటాయని తెలుస్తోంది.
ప్రధాని మోదీ పాలన చూసి బీజేపీ లో చేరా : జయసుధ
సినీ నటి, అలనాటి హీరోయిన్ జయసుధ భారతీయ జనతా పార్టీలో చేరారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ఆమె.. జాతీయ నేతల సమక్షంలో బీజేపీలో చేరారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని జయసుధ చెప్పారు. మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందిందన్నారు. తాను బీజేపీ లో చేరడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించిందని వ్యాఖ్యానించారు. ఏడాది క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నానన్నారు. క్రైస్తవుల కోసం పనిచేస్తానని చెప్పారు. మంచి మార్పు కోసం బీజేపీ లో చేరానంటూ నటి జయసుధ చెప్పుకొచ్చారు.