Sleeping sides: పడుకొనే ముందు దిక్కులు, మూలలు కూడా చూసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. ఏ దిక్కున తల పెట్టి పడుకుంటే ఏం జరుగుతుందన్నది చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఉత్తరం వైపు తల పెట్టుకొని పడుకోరాదని పెద్దలు చెబుతుంటారు. ఒకవేళ ఉత్తరంవైపున తల పెట్టి నిద్రిస్తే ఏం జరుగుతుంది? దాని ఆంతర్యం ఏంటన్నది మాత్రం చాలా మందికి తెలియదు. దీని వెనుక కొన్ని శాస్త్రీయమైన కారణాలు కూడా ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. (Sleeping sides)
ఉత్తరం వైపు తల పెట్టి పడుకోవద్దు.. అని చాలా మంది చెబుతారు తప్ప.. అందుకు కారణాలు చాలా మంది చెప్పలేరు. ఉత్తరం వైపు నుంచి చలి గాలులు వీస్తాయని పెద్దలు చెబుతున్నారు. అలాగే దక్షిణం వైపు నుంచి చల్లని గాలులు వస్తాయని చెబుతున్నారు. ఈ చల్లని గాలులకు, చలిగాలులకు చాలా తేడా ఉంది. భారత దేశానికి ఉత్తరం వైపున హిమాలయాలు ఉన్నాయి. ఇది భౌతిక శాస్త్రం ప్రకారం అక్కడి నుంచి చలిగాలులు వీచడం కామన్. హిమాలయ పర్వతం నుంచి చలిగాలులే వీస్తాయి.
దక్షిణం వైపు నుంచి చల్లటి గాలులు ఎందుకు వస్తాయి? మనదేశానికి దక్షిణ ప్రాంతం అంటే కేరళ. అక్కడ మలయ పర్వతం ఉంది. అందుకే వారిని మలయాళీలు, అక్కడ మాట్లాడే భాష మళయాళం అంటారు. అక్కడ మలయ పర్వతం నిండా మంచి గంధపు చెట్లు ఉన్నాయి. అందుకే అక్కడి నుంచి మంచిగంధపు గాలులు వీస్తాయి. మంచి చల్లటి గాలులు దేశమంతా వస్తాయి. అందుకే వాస్తు ప్రకారం ఇల్లు కట్టుకొనేటప్పుడు కూడా దక్షిణం వైపు తెరిపి పెట్టాలని సూచిస్తుంటారు. ప్రస్తుతం నగరాలు, పట్టణాల్లో గోడపక్కన గోడ కట్టేసి అపార్ట్‌మెంట్లు వెలిశాయి. దీంతో దక్షిణం వైపు తెరిపి పెట్టినా ఉపయోగం లేని పరిస్థితి. మనగాలి పక్క అపార్ట్‌మెంట్ వాళ్లకు, వాళ్ల గాలి మనం పీల్చాల్చిందే.
ఇలా ఎప్పటికప్పుడు ఆచార సంప్రదాయాలు ఏమిటో తెలుసుకొని పాటించడం వల్ల మనకు మేలు కలగడంతో పాటు పది మందికి వీటి గురించి చెప్పే సౌలభ్యం ఉంటుంది. ఆచారాలు గుడ్డి నమ్మకాలు కాదు. అందులో ఎంతో శాస్త్రీయత ఉంటుంది కాబట్టే పెద్దలు ఈ రకంగా మనకు తెలిపి ఉంటారనే విషయం గుర్తుపెట్టుకోవాలి.
ఇదీ చదవండి: Health Care at night: రాత్రిపూట ఇవి తింటే పీడ కలలు వస్తాయి.. నిద్రాభంగం తప్పదు!