Gold Price Today (26-06-2023): కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం.. నిన్న కాస్త పుంజుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఇవాళ మాత్రం పసిడి స్థిరంగా కొనసాగుతోంది. ఇక ఫిబ్రవరి తర్వాత అత్యంత గడ్డు పరిస్థితులను పసిడి ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఔన్స్ (28.35 గ్రాములు) బంగారం ధర 1,930 డాలర్ల వద్ద ఉంది. ఇండియాలో ఆర్నమెంట్ బంగారం, స్వచ్ఛమైన పసిడి ధరల్లో ఇవాళ మార్పులు కనిపించలేదు. కిలో వెండి ధర మాత్రం రూ.200 తగ్గింది. Gold Price Today (26-06-2023)
తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి, వెండి రేట్లు ఇలా..
తెలంగాణలోని హైదరాబాద్ గోల్డ్ మార్కెట్‌లో (Hyderabad Gold) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.54,250గా ఉంది. అదే 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,180 వద్ద నమోదైంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ.74,500 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో ఇవే ధరలు అమల్లో ఉంటాయి.
ఇక ఏపీలోని విజయవాడ గోల్డ్ మార్కెట్‌లో (Vijayawada Gold Price) ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ.54,250 వద్ద ఉండగా, 24 క్యారెట్ల బిస్కెట్ పసిడి ధర రూ.59,180 గా కొనసాగుతోంది. బెజవాడ సిటీలో కిలో వెండి ధర రూ.74,500 వద్ద ఉంది. రాష్ట్రంలోని విశాఖపట్నం, ప్రొద్దుటూరు, అనంతపురం, తాడిపత్రి పట్టణాల్లోనూ గోల్డ్ మార్కెట్‌లో పసిడి, వెండి ధరల్లో విజయవాడ రేట్లే అమలు అవుతాయి.
దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో ఇవాళ పసిడి రేట్లు ఇలా..
చెన్నై నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి రేటు నేడు రూ.54,550 గా కొనసాగుతోంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,510 వద్దకు చేరింది. తమిళనాడులోని కోయంబత్తూరు పట్టణంలో కూడా బంగారం, వెండి ధరలు చెన్నైలో ఉన్న రేట్లే ఉంటాయి.
దేశ వాణిజ్య రాజధానిగా పేరు గాంచిన ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.54,250గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.59,180 వద్ద కొనసాగుతోంది. అక్కడి మరో ముఖ్య నగరం పుణెలో కూడా ముంబైలో కొనసాగుతున్న రేటే అమల్లో ఉంటుంది.
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల ఆభరణాల పసిడి ధర రూ.54,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,330 గా నమోదైంది. జైపూర్, లక్నో నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతాయి.
మరోవైపు 10 గ్రాముల ప్లాటినం ధర ఇవాళ రూ.290 పెరిగింది. రూ.24,460 వద్ద కొనసాగుతోంది. దేశ వ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం సహా మిగతా అన్ని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్లాటినం విషయంలో ఒకే ధర అమల్లో ఉంటుంది.
సాధారణంగా బంగారం, సిల్వర్ సహా ప్లాటినం ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. అలంకరణ లోహాల్లో ప్రతి రోజూ ఈ మార్పులు సహజం. ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలు, వాణిజ్య కార్యకలాపాలపై వీటి ధరలు ఆధారపడి ఉంటాయి. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో రేట్లు పెరగడం, లేదా తగ్గడం లాంటి పరిణామాలతో మనదేశంలోనూ మార్పులు జరుగుతాయి. ప్రపంచ మార్కెట్‌లో అలంకరణ లోహాల ధరలు పుంజుకొనేందుకు, తగ్గుదల నమోదు చేసేందుకు పలు కారణాలు ఉంటాయి. ఏడాదిన్నరగా కొనసాగుతున్న రష్యా, ఉక్రెయిన్ వార్.. ప్రపంచ వ్యాప్తంగా అనేక రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ నేపథ్యంలో కొన్ని నెలలుగా అన్ని రకాల ధరలూ అమాంతం పెరిగిపోతున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం స్టాక్, వడ్డీ రేట్ల హెచ్చు తగ్గులు.. ఇలా అనేక అంశాలు గోల్డ్ ప్రైస్‌ను నిర్దేశిస్తుంటాయి.
Read Also : Pawan Kalyan: పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన పని.. జవాబుదారీతనంతో రాజకీయాలు చేస్తున్నా: పవన్ కల్యాణ్