HomeAndhra PradeshKakani Govardhan Reddy: ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

Kakani Govardhan Reddy: ప్రజలను మోసం చేయడంలో బాబు బ్రాండ్‌ అంబాసిడర్‌

Kakani Govardhan Reddy: ప్రజలను మోసం చేయడంలో సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల ముంగిట విద్యుత్ చార్జీలు పెంచబోమని, ట్రూ అప్ చార్జీలు ఎత్తేస్తామని హామీ ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేస్తూ విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని కాకాణి మండిపడ్డారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు.

ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్‌ అందించడమే లక్ష్యమని ఎన్నికల ముందు ప్రచారం చేసిన సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే బాదుడు కార్యక్రమం మొదలు పెట్టారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆక్షేపించారు. విద్యుత్‌ ఛార్జీలు పెంచబోమని, ట్రూఅప్‌ ఛార్జీలు కూడా ఎత్తేస్తామని నాడు బీరాలు పోయిన బాబు.. తాను ఏ హామీ ఇవ్వలేదంటూ ఇప్పుడు నిస్సిగ్గుగా బుకాయిస్తున్నారని వెల్లడించారు.

చంద్రబాబు తరహాలో మరే నేత ఇంతలా మాట మార్చి ప్రజలను మోసం చేయలేరని కాకాణి అభిప్రాయపడ్డారు. కూరగాయలతో పాటు ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఆకాశాన్ని అంటుతుంటే, మరోవైపు విద్యుత్‌ ఛార్జీల వడ్డన సరికాదని ఆయన స్పష్టం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో విద్యుత్‌ ఛార్జీలపై అదేపనిగా విరుచుకుపడిన ఎల్లో మీడియా విపరీతంగా దుష్ప్రచారం చేసిందని గుర్తు చేసిన మాజీ మంత్రి, హామీలు అమలు చేయకుండా ఎగ్గొట్టిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేయడంలో బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారారని తేల్చి చెప్పారు. విద్యుత్‌ ఛార్జీల పెంపునకు సిద్ధమైన చంద్రబాబు, ప్రజలకు వంద రోజుల పాలన కానుక ఇవ్వడానికి సిద్ధపడ్డారని ఆక్షేపించారు.

‘ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జెస్ట్మెంట్‌’ (ఎఫ్‌పీపీసీఏ) ఛార్జీలు ఒక్కో పంపిణీ సంస్థ (డిస్కమ్‌)లో ఒక్కో విధంగా ఉండడంతో పాటు, ప్రసార పంపిణీ (టీ అండ్‌ డీ. ట్రాన్స్‌మిషన్‌ అండ్‌ డిస్ట్రిబ్యూషన్‌) నష్టాలు రెండూ కలిపి.. 7.99 శాతం నుంచి 10.99 శాతం వరకు ఉన్నాయని కాకాణి తెలిపారు. దాని ప్రకారం లెక్కిస్తే నాలుగు త్రైమాసికాలకు సంబంధించి వివిధ డిస్కమ్‌లలో ఒక్కో యూనిట్‌పై రూ.4.14 నుంచి రూ.6.69 వరకు భారం పడే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. అలా మొత్తం రూ.8,100 కోట్ల భారాన్ని ప్రజల మీద మోపడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు.

గత ప్రభుత్వ హయాంలో ట్రూఅప్‌ ఛార్జీలపై విరుచుకుపడిన చంద్రబాబు, ఇప్పుడు అవే ఛార్జీల పేరుతో రూ.8,100 కోట్ల భారం మోపడానికి సిద్ధమయ్యారని ఆక్షేపించారు.

2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటికి డిస్కమ్‌లు రూ.4,315 కోట్ల నష్టాల్లో ఉంటే.. 2019 నాటికి అవి ఏకంగా రూ.20 వేల కోట్లకు చేరాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. అంతే కాకుండా ఉచిత విద్యుత్‌కు సంబంధించి రూ.43,744 కోట్లు బకాయి పెట్టారని, వాటిని జగన్‌ ప్రభుత్వం చెల్లించిందని ఆయన వివరించారు.

ఇవీ చదవండి: Kakani: చంద్రబాబుకే సూపర్‌సిక్స్‌ పోస్టర్లు అంటించడానికి ప్రజలు సిద్ధం
Purandeswari: చంద్రబాబుపై సుప్రీంకోర్టు కామెంట్లు సమంజసం కాదు: పురందేశ్వరి
Adudham Andhra: ఆడుదాం ఆంధ్ర వీడియో లాంచ్.. బ్రోచర్ ఆవిష్కరణ
Purandeswari on amaravati: రాజధానిగా అమరావతికి కేంద్రం కట్టుబడి ఉంది: పురంధేశ్వరి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు