HomeAndhra PradeshMargani Bharath: పోలవరం పనుల్లో చంద్రబాబు చారిత్రక తప్పిదం: మార్గాని భరత్

Margani Bharath: పోలవరం పనుల్లో చంద్రబాబు చారిత్రక తప్పిదం: మార్గాని భరత్

Margani Bharath: పోలవరం ప్రాజెక్టు పనుల్లో కమిషన్లకు కక్కుర్తి పడి నిబంధనలకు విరుద్ధంగా, అడ్డుగోలుగా నిర్మాణం చేపట్టిన సీఎం చంద్రబాబు, ఆ ప్రాజెక్టుతో పాటు, తెలుగు ప్రజల ద్రోహిగా నిలిచిపోతారని మాజీ ఎంపీ, వైయస్సార్‌సీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌ ఆరోపించారు. ప్రొటోకాల్‌ ప్రకారం ప్రాజెక్టులో ముందుగా కాఫర్‌డ్యామ్‌లు పూర్తి చేసి, ఆ తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ చేపట్టాల్సి ఉండగా, అందుకు భిన్నంగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించారని ఆయన గుర్తు చేశారు. కమిషన్ల కక్కుర్తి మాత్రమే కాకుండా, ఎక్కువ బిల్లులు చేసుకోవచ్చన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఆ పని చేశారని ఆరోపించారు.

పోలవరం పనుల్లో చంద్రబాబు చారిత్రక తప్పిదం వల్లే ప్రాజెక్టు పనులన్నీ అస్తవ్యస్తం అయ్యాయని, ఇదే విషయాన్ని అంతర్జాతీయ నిపుణుల కమిటీ రెండు నివేదికల్లో స్పష్టం చేసిందని గుర్తు చేశారు. దీనికి చంద్రబాబే పూర్తి బాధ్యత వహించాలని, ఎప్పటికైనా ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ ఎంపీ స్పష్టం చేశారు.

20 నుంచి 40 మీటర్ల మేర కాఫర్‌డ్యామ్‌ కింద జెట్‌ గ్రౌటింగ్‌ వాల్‌ కట్టి, ఆ తర్వాత డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాల్సి ఉండగా, చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరించారని, అలా నిబంధనలకు మంగళం పాడడమే కాకుండా, సాంకేతికపరమైన అంశాలకు పాతర వేయడం వల్లనే పోలవరం ప్రాజెక్టు పనులు అస్తవ్యస్తమయ్యాయని మార్గాని భరత్‌ తెలిపారు. పోలవరం పనుల్లో తప్పిదాలన్నీ చేసిన చంద్రబాబు, నిస్సిగ్గుగా జగన్‌గారిపై నిందలు మోపుతున్నారని ఆగ్రహించారు. గత ప్రభుత్వ హయాంలోనే పోలవరం స్పిల్‌వే పూర్తి చేయడంతో పాటు, హైడ్రాలిక్‌ గేట్స్‌ కూడా ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. దీనిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని ఆయన ప్రకటించారు.

ఇప్పటికైనా చంద్రబాబు వాస్తవాలు మాట్లాడాలన్న మాజీ ఎంపీ, ఏ కమిటీ, ఏ నిపుణుడు సిఫార్సు చేస్తే కాఫర్‌ డ్యామ్‌లు పూర్తి చేయకుండా, డయాఫ్రమ్‌వాల్‌ ఎందుకు కట్టారో చెప్పాలని కోరారు. చంద్రబాబు నిర్వాకం వల్లే డయాఫ్రమ్‌వాల్‌ కొట్టుకుపోయిందని, ఫలితంగా వందల కోట్ల నష్టం జరిగిందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం, వచ్చే నెల అంటే నవంబరులో డయాఫ్రమ్‌ వాల్‌ పనులు మొదలుపెడితే, ఏప్రిల్‌ 2025లో రుతుపవనాలు వచ్చేలోగా పూర్తి చేయాల్సి ఉందని మార్గాని భరత్‌ వివరించారు.

Read also: Polavaram: పోలవరానికి రూ.12,500 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సుముఖత
Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్ కోసం అదనపు నిధులకు అభ్యంతరం లేదు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ
CM Jagan At Polavaram: చిన్న సమస్యను విపత్తుగా చూపే దౌర్భాగ్యమైన మీడియా..! సీఎం జగన్‌ ఫైర్‌
Mumbai Actress: ముంబై నటి వ్యవహారంలో అసలేం జరిగింది? ఫక్తు రాజకీయమేనా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు