గురువారం, 8 అక్టోబర్ 2026 --:--:-- | 📍 వాతావరణం తెలుసుకుంటోంది...
Cinema

Janhvi kapoor hot: జాన్వీ కపూర్‌లో ఈ ట్యాలెంట్ ఉందని మీకు తెలుసా?

Keerthanaa News Deskప్రచురణ తేదీ: బుధవారం, 20 నవంబర్ 2024

Janhvi kapoor hot: స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor hot)లో మనకు తెలియని ట్యాలెంట్ దాగి ఉందట. తొలి తెలుగు మూవీతోనే ప్రేక్షకులకు దగ్గరైన ఈ భామ.. ఇప్పుడు మరిన్ని తెలుగు చిత్రాల్లో నటించేందుకు సిద్ధమవుతోంది.

ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. అలాగే మూవీల్లో ఆఫర్స్ కూడా బాగానే అందుకుంటుంది. ప్రస్తుతం దేవర 2లోనూ ఈ భామ నటిస్తోంది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీలోనూ జాన్వీ చాన్స్ కొట్టేసింది

హిందీలో వరుసగా సినిమాలు చేసినా అవి ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో ఎన్టీఆర్ సరసన నటించడంతో ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ తన సత్తా చాటుతోంది జాన్వీ. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మూవీస్ చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కడం లేదు.

ఇక సామాజిక మాధ్యమాల్లో జాన్వీ ఫొటోలు, రీల్స్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అందాలు ఒలకబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది ఈ చిన్నది. తాజాగా జాన్వీ తనలోని ఓ ప్రత్యేక టాలెంట్ ను బయటపెట్టింది.

జాన్వీ కపూర్ నటించడం మాత్రమే కాదు, పెయింటర్ కూడా తన హాబీ. తాజాగా ఆమె వేసిన పలు పెయింటింగ్స్ చిత్రాలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. జాన్వీలో ఈ ట్యాలెంట్ కూడా ఉందా.. సో బ్యూటిఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ ఫోటోలకు ”మా డాడీ నన్ను పెయింటింగ్స్ పట్టుకొని ఓ స్టూడెంట్ లాగా ఫోటో దిగమని చెప్పాడు. ఆ ఫోటోలను ఆయన తన ఫ్యామిలీ గ్రూపుల్లో షేర్ చేసుకోవచ్చని.. అలాగే ఆ పెయింటింగ్స్ కి హైప్ ఇస్తారని”.. అని జాన్వీ రాసింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

View this post on Instagram

ఇవీ చదవండి: Janhvi Kapoor: ఐఫాలో జాన్వీ కపూర్ ఐ ఫీస్ట్.. ఆ నెక్లెస్ ఎన్ని కోట్లంటే..
Janhvi Kapoor Bawaal: అమెజాన్‌ ప్రైమ్‌లో జూలై 21న బవాల్‌ రిలీజ్‌.. జాన్వీ కపూర్‌కు హిట్‌ దక్కేనా?
Janhvi Kapoor: జాన్వీ కపూర్‌ ఫొటో గ్యాలరీ..
Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ

ట్యాగ్స్: , , , , , , , , , , , ,
AIతో కథనాన్ని సంక్షిప్తంగా చదవండి

ఎంపిక చేసిన AI సేవలో ఈ కథనం లింక్‌తో సమ్మరీ తెరుచుకుంటుంది.

Discover more from keerthanaanews.com

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading