Janhvi Kapoor: ఆ హీరోను యాంగ్రీ యంగ్ మ్యాన్‌తో పోల్చిన జాన్వీ

అతిలోక సుందరిగా మన మనసుల్లో నిలిచిపోయిన శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తోంది. శ్రీదేవి కూతురిగానే కాకుండా తనకంటూ సొంత గుర్తింపు కోసం జాన్వీ (Janhvi Kapoor) పరిశ్రమిస్తోంది. సొంత ట్యాలెంట్ తోనే ఎదుగుతానంటూ అనేక ఇంటర్వ్యూల్లో సైతం చెబుతూ వస్తోంది. తన హాట్ అందాలతో కుర్రాళ్ల మనసు కొల్లగొడుతోంది జాన్వీ.

మిలి చిత్రం చూశాక తన తండ్రి బోనీ కపూర్ ఎమోషనల్ అయ్యాడని జాన్వీ (Janhvi Kapoor) తెలిపింది. సినిమా అంటే దాదాపు అందరూ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచిస్తారన్న జాన్వీ.. తన తండ్రి మాత్రం స్టోరీ నచ్చిందా లేదా అని చూస్తారని తెలిపింది. జీవితంలో ఆయన పాత్రకు ఈ సినిమా కథ దగ్గరగా ఉందని జాన్వీ తెలిపింది. అందుకే ఈ స్టోరీ తన తండ్రికి బాగా నచ్చిందని వెల్లడించింది. మరో ఆలోచన లేకుండా ఈ చిత్రాన్ని నిర్మించాలని తన తండ్రి డిసైడ్ అయ్యాడని చెప్పింది.

జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ సినిమాలో నటించింది. నయనతార నటించిన కొలమావు కోకిల అనే చిత్రానికి ఇది రీమేక్ గా వచ్చింది. మరోవైపు మిలి అనే మూవీలో జాన్వీ నటించింది. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన హెలెన్ చిత్రానికి రీమేక్ గా మిలి సినిమా రూపొందించారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మొన్నామధ్య జాన్వీ కపూర్ హైదరాబాద్ కు వచ్చింది. ఆ నేపథ్యంలో ఆసక్తికర విశేషాలను చెప్పింది.

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ తన ఫేవరెట్ హీరో అని జాన్వీ చెప్పింది. అతనితో కలిసి మూవీ చేయాలనే కోరిక ఉందంటూ జాన్వీ మనసులో మాట బయటపెట్టింది. మరో హీరో విజయ్ దేవరకొండను చూస్తే యాంగ్రీ యంగ్ మ్యాన్ గుర్తుకొస్తాడని జాన్వీ వ్యాఖ్యానించింది. అయితే, తాజాగా జూనియర్‌ ఎన్టీఆర్ సరసన జాన్వీ చాన్స్‌ కొట్టేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 (NTR 30)లో జాన్వీ నటిస్తోంది. మొన్నామధ్య ఫస్ట్‌ లుక్‌ కూడా రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

నా బాత్ రూమ్ డోర్ కు గడియ ఉండదు!

జాన్వీ కపూర్ సొంత ప్రతిభతో పైకి రావాలని కష్టపడుతోంది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సుమారు నాలుగేళ్లయినా మంచి హిట్‌ కోసం వెయిట్‌ చేస్తోంది ఈ అందాల నటి. మొన్నామధ్య చెన్నైలోని శ్రీదేవి ఇంటిని, ఇతర విశేషాలను జాన్వీ కపూర్ సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇంద్రభవనం లాంటి ఆ ఇంటితో తనకున్న అనుబంధాన్ని జాన్వీ గుర్తు చేసుకుంది. హిందీ మూవీ దఢక్‌తో సినిమా రంగానికి పరిచయమైంది జాన్వీ కపూర్.

దఢక్‌ తర్వాత గుంజన్ సక్సెనా, ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, రూహి చిత్రాలతో తన నటనా కౌశలాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అనంతరం సీనియర్‌ హీరోయిన్‌ నయనతార హిట్ మూవీ కోలమావు కోకిల రీమేక్ సినిమాలో జాన్వీ నటించింది.

సోషల్‌ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది జాన్వీ కపూర్. హాట్‌ పోజులు, అందాల ఆరబోతతో వీడియోలు, రీల్స్‌ చేస్తూ యువతలో క్రేజ్‌ సంపాదించుకుంటోంది. ఇక హోమ్‌ టూర్‌ విషయానికి వస్తే.. ఆ వీడియోలో వింతలు విశేషాలు చెప్పుకొచ్చింది జాన్వీ. హాయ్ అని పలకరించి తమ ఇంట్లోకి ఆహ్వానించించింది. తమ ఇల్లు ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం ఉందని పేర్కొంది. తర్వాత బోనీ కపూర్ కార్యాలయం చూపించింది. బోనీ కపూర్ చుట్టూ 10 వేల ఫొటోలు ఉన్నాయని వివరించింది.

చెన్నై ఇంట్లో శ్రీదేవి కొన్నేళ్లుగా సేకరించిన పెయింటింగ్స్, ఆర్ట్ పీసులను జాన్వీ కపూర్ చూపించింది. ఇందులో శ్రీదేవి స్వయంగా వేసిన పెయింటింగ్స్ కూడా ఉంటం విశేషం. జాన్వీ కపూర్ తన తల్లిదండ్రుల పెళ్లి ఫొటోలను కూడా వీడియోలో చూపించింది. అనంతరం తన పడక గదిని చూపించింది జాన్వీ. తన గది బాత్ రూమ్ కు గడియ ఉండదని పేర్కొంది. బాత్‌రూమ్‌లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడానేమో అనే భయంతో అమ్మ శ్రీదేవి బాత్‌ రూమ్‌కు లాక్‌ పెట్టేందుకు అంగీకరించలేదని తెలిపింది జాన్వీ. అది ఇప్పటికీ అలాగే ఉందని పేర్కొంది. ఈ ఇంటితో ఎన్నో జ్ఞాపకాలున్నాయని తెలిపింది.

Read Also : Uttej: అలాంటి పని చేస్తే నా కూతురిని చచ్చిపోవాలని చెప్పా.. ఉత్తేజ్‌!

keerthanaanews
keerthanaanewshttps://keerthanaanews.com
Best Telugu news. we are providing best telugu articles and special stories.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles